సమాజంలో తెలివి తేటలున్నవారు ఆర్థికంగా రానించటం లేదు. ఆర్థికంగా రానించిన వారిలో తెలివి తేటలు పెద్దగా కనిపించటం లేదు. ఇందుకు అత్తా కోడళ్ళ పోరే కారణం అంటే మీరు ఆశ్చర్య పోతారు. అదెలా సాధ్యం?
మహావిష్ణువు యొక్క నాభి కమలమునుండి (బొడ్డు) బ్ర్హహ్మ దేవుడు పుట్టాడు. దీంతో విష్ణువు,లక్ష్మి దేవి దంపతులకు బ్ర్హహ్మ దేవుడు కొడుకయ్యాడు. బ్ర్హహ్మ దేవుని భార్య సరస్వతి దేవి. అంటే లక్ష్మి దేవికి కోడలన్న మాట. అత్తా కోడళ్ళు కాబట్టే అశూయతో ఒకరున్న చోట మరొకరు ఉండటం లేదు అని ప్రతీతి.
ఈ పురాణాల కథ పక్కన పెట్టి యధార్థంలో అత్తా కోడళ్ళ పోరుకు గల కారణాలేమిటో క్లుప్తంగా చూస్తాం
అత్తా కొడుకు మీద, కోడలు తన భర్త మీద ఆర్థికంగా ఆధారపడి ఉంటారు. కొడుకెక్కడ కోడలి అందానికి ఆకర్షితుడై పోతాడోనని అత్తకు భయం. తన భర్త తల్లి చెప్పు చేతల్లో ఉంటే తన భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని కోడలికి భయం ఇవన్ని అందరికి తెలిసినవే . ఈ టపాలో నా ప్రత్యేకతంటూ ఉండాలిగా .. అందుకే ఈ పోరు వెనుక ఉన్న లైంగిక కారణాలను వివరిస్తా.
అత్త లైంగిక జీవితం సజావుగా సాగి ఉంటే దాని ప్రాముఖ్యత ఆవిడకు తెలిసేది. కోడలి లైంగిక జీవితం కూడ చక్కగా సాగాలనుకుంటుంది. ఒక వేళ ఆవిడ వివిధ కారణాలచేత లైంగిక వాంచలు నెరవేరని అసంతృప్త స్థాయిలో ఉంటే ఆవిడ కోడలి జీతానికి కూడ అడ్డు తగులుతుంది.
కోడలంటూ ఒకావిడ అడుగు పెట్టగానే దాని ప్రభావం అత్తమ్మ లైంగిక జీవితం పై పడుతుంది .మధ్యతరగతి కుటుంభాల్లోనైతే ఇంట్లో ఒక్క బెడ్ రూమే ఉంటుంది. కోడలి రాకతో అది కాస్త కొడుకు కోడలకు స్వంతమై పోతుంది.
అత్త వయస్సు ఏదైనప్పటికి కోడల రాక అనంతరం ఆవిడ పెద్దరికం అలవరచుకోవలసి వస్తుంది. మంచి లేటస్ట్ డిజైన్లలో చీర కొనలేక పోవడం, గతంలో లాగా ఫేర్ అండ్ లవ్లి వాడ లేక పోవడం జరుగుతుంటుంది. దీనికి కారకురాలైన కోడల పై ఆవిడకు చికాకు కలగడం మామూలే.
తన భర్తనుంది తనను దూరం చేసి కోడలు మాత్రం తన భర్తతో ( అతను ఈవిడకు కొడుకే అయినప్పటికి) సుఖంగా జీవించటం చికాకు కల్పిస్తుంది.
కోడలి దృష్ఠిలో అత్త రూపం తన భవిష్యత్ రూపాన్ని గుర్తుకు తెస్తుంటుంది. ఏ స్త్ర్రీ అయినా ముసలితనాన్ని, ముసలితనాన్ని గుర్తు చేసే విషయాలను ఇష్ఠపడుతుంది?
అత్త దృష్ఠిలో కోడలి రూపం తన గత స్వరూపాన్ని ,స్మృతులను గుర్తుకు తెస్తుంటుంది. ఏ స్త్ర్రీ అయిన గతించి పోయిన తన సౌందర్యాన్ని గుర్తు తెస్తే ఊరుకుంటుంది.
(ససేషం)
No comments:
Post a Comment