Saturday, September 25, 2010

ఆథ్యాత్మికం వయా సెక్స్

ఆథ్యాత్మికమంటే నెను ప్రతిపాదించే ఆథ్యాత్మికం బ్లాగ్లోకంలో చలామణిలో ఉన్న యజ్న యాగాదులు, అభిషేకాలు, తీర్థయాత్రలు కాదు. మనిషి తన శరీరం,మనస్సు,భుద్దిల అంతు చూసి వీటికి అధనంగా తనలో మరేదో ఉందని అనుభవ పూర్వకంగా గుర్తెరగడమే. అలా అనుభవమైన తరువాత అతని జీవన విదానంలో చోటు చేసుకునే మార్పే ఆథ్యాత్మికం.

డిగ్రి  పొందటం - ఆ డిగ్రీని చేత పట్టి  గౌను దరించి ఫోటో దిగడం ఈ రెండింటిలో ఏది ముఖ్యం. డిగ్రీ పొందటమే. మీరు డిగ్రీ పొందాక  ఆ డిగ్రీని చేత పట్టి  గౌను దరించి ఫోటో దిగక పోయినా సమస్య ఉండదు. అలా కాక డిగ్రీ పొందకనే అద్దె డ్తెస్సుతో ఫోటో దిగడం వలన ఏం లాభం. చీటింగ్ కేసులో ఇరుక్కోవడం తప్ప.

ఆథ్యాత్మికం విషయంలో  కూడ ఇదే ఫార్ములా వొర్క్ అవుట్ అవుతుంది. మీరు మీ శరీరం, మనస్సు, భుద్ది అనే Wave Lengthలను దాటి ప్రయానించ కుండానే నంగి నంగి భక్తి ప్రపత్తులు నటిస్తుంటే ఏమీ లాభం లేదు.పైగా ఎప్పటికీ మీరు ఆధ్యాత్మికతలోని ఓనమాలు కూడ నేర్చుకోలేక పోతారు. ఏదో రోజు, ఏదో జన్మలో తెరుచుకోవడానికి వీలున్న ఒక్క గానొక తలుపును సైతం లాక్ చేసి సీలు పెట్టుకున్నట్టే.

ఉన్నది ఒకే భాట .ఆ భాటలో మనస్సు,భుద్ది అనే చెక్ పోస్టులు  ఉన్నాయి.   మీరు ఏ వాహనమెక్కి వెళ్ళినా ,ఎంత జోరుగా వెళ్ళినా, ఎంత స్లోగా వెళ్ళినా ఈ చెక్ పోస్టుల్లో దిగి క్లియరన్స్ చేసుకుని వెళ్తే కాని అవతలి చెక్ పోస్టు దాట లేరు. దాటడం మళ్ళా కథ. అక్కడే ఉండి పోవాలసి వస్తుంది.

గతంలో శరీరాన్ని దాటడానికి బ్రహ్మ చర్యాన్ని ఒక మార్గంగా ఎన్నుకున్నారు.అప్పటి ఆహార పద్దతులు, వాతావరణం, జీవన విదానం,కుటుంభ వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యాదుల కారణంగా కనీసం సగం మందైనా విజయం సాధించి ఉండవచ్చుగాక.

కాని నేడు అవన్ని గతించి పోయాయి.ఈ రోజుల్లో నైష్థిక బ్రహ్మచర్యం, అస్కలిత బ్రహ్మ చర్యమంతా ఉత్తి మాటలే. పైరు త్వరిత గతిన ఫలితమివ్వాలని వాడే మందు మాకులు, కోళ్ళ ఫారంలోని కోళ్ళు త్వరిత గతిన కోతకు రావాలని ఇచ్చే మందు మాకులు చిన్న ఉదాహరణలు మాత్రమే.

ఇవి మానవ శరీరంలోని సహజ ధర్మాలను, బయాలజికల్ క్లాక్ ను తారు మారు చేస్తాయి. నేటి ఆహార పద్దతులు, వాతావరణం, జీవన విదానం,కుటుంభ వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్, సమాజం, మీడియా, పరిసరాలు ఇలా ప్రతి ఒక్కటి యువతలో కామ వాంచను రెచ్చకొట్టే విదంగా ఉన్నాయిగాని బ్రహ్మ చర్యం పాటించటానికి అనువుగా లేనేలేదు. ఎవరో యుగ పురుషులు కారణ జన్ములకైతే ఇది సుసాధ్యం కావచ్చేమో గాని సగటు యువకునికి మాత్రం బ్ర్హహ్మచర్యం ముమ్మాతికి ఎండ మావే.

అయినా అతను శరీరాన్ని దాటాలి. ఎలా ?

(ససేషం

No comments:

Post a Comment