Thursday, October 14, 2010

10 కోట్ల మంది నిరుధ్యోగులకు ఓవర్ నైట్ ఉధ్యోగావకాశం

నేడు కర్ణాటకలో చోటు చేసుకున్న హార్స్ ట్రేడింగ్ చూసైనా కళ్ళు తెరవాలి. డైరక్ట్ డెమాక్రసి అమలుకై నడుం బిగించాలి. ఇది నవ భారత నిర్మాణానికై నేను రూపొందించిన ACTION PLAN లోని ఒక్క అంశం. దాని పేరు
ఆపరేషన్ ఇండియా 2000.
ఇందులోని ముఖ్యాంశాలు : 
అధ్యక్ష తరహా పాలన అమలు, దేశంలోని పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు, సైన్యం చేత నదుల అనుసంధానం, జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి – దేశంలోని వ్యవసాయ పొలాలన్నింటిని సదరు సంఘానికి లీజు ప్రాతిపదికన ఇచ్చి సమిష్టి వ్యవసాయం జరిగేలా చూడటం, ప్రస్తుత కరెన్సి రద్దు చేసి కొత్త కరెన్సి అమలు చెయ్యడం. పాత కరెన్సి ఉన్నవారు వాటియొక్క చట్టబద్దతను నిరూపించి కొత్త కరెన్సి పొందేలా చూడటం. అందుకు పూర్వం భారత దేశంలోనే స్విస్ బ్యాంకు తరహా బ్యాంకు ఒకటి నెల కొలపడం – ఇవే నా ప్రణాళికలోని ముఖ్యాంశాలు.

ప్రణాళిక ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్లాన్ అమలుకు కావల్సిన నిథుల సమీకరణకు కూడ ఎకానమి ప్యేకేజి పేరిట సలహాలిచ్చాను. ప్రజల పై ఎట్టి భారం పడనీయక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇందులో ఉన్నాయి.

అలాగే తపాలా శాఖ, రైల్వే శాఖ, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, తి.తి.దే. వంటి ప్రముఖ దేవస్థానాల్లో సంస్కరణలు తెచ్చి నిర్వహణ వ్యయాన్ని తగ్గించి మిగులు పాటు అయ్యే సొమ్మును బ్యాంకుల్లో ఎఫ్.డి.లుగా ఉంచేలా చేసి బ్యాంకులనుండి రుణం పొందే వీలు కల్పించే సలహాలు కూడ పై ఎకానమి ప్యేకేజిలో ఇచ్చాను

అసలు ఇటీలవల ప్రతి నేత నోట నదుల అనుసందానం మాట రావటానికి మూల కారణం నేనే ; ప్రతి నేతకు రిజిస్టర్డు పోస్టు ద్వారా నా ప్లాన్ పంపాను. పంపిన 10 రోజులకో, 15 రోజులకో ఈ నినాదాన్ని వారందుకుంటారు. అంటే నా ప్లాన్ అలానే ఉంచేసి ప్రకటించినా మన దేశానికి కొంత లాభం జరిగేది. కాని వారు ఉత్తుత్తే నదుల అనుసందానం గురించి మాత్రం ప్రస్తావిస్తున్నారు. ఉదా|| చంద్రబాబు పి.ఎ. అఫిషియల్గా సి.ఎం. గారికి నివేదించుటకు మీ ప్రతిపాదనలను పంపండి అని నోట్ రాసి పంపితే నేను ఆగస్ట్ 3 న పంపడం, సెప్టెంబర్ 1 న చంద్రబాబు “నదుల అనుసందానంతోనే దేశం సస్య శ్యామలం” అని ప్రకటించటం జరిగింది.

వీరు సాంప్రదాయిక పద్దతుల్లో నదుల అనుసందానం మొదలు పెడితే అనుసందానం జరిగే లోపు గంగే ఇంకి పోతుంది, లేదా భూమి పై ఉన్న నీరంతా కలుషితమై విషతుల్యం అయిపోయి చస్తాం.

అందుకని యుద్ద ప్రాతిపదికన దీనిని చేపట్టాలి. దేశం యొక్క సర్వ శక్తులు ఈ ప్రోజెక్టు పై కేంద్రీకరించబడి కనీసం 5 సం.ల్లో పూర్తి చేస్తే గాని ఇది ఫలప్రదం కాదు.

2 comments:

  1. అబ్బా ..ఆస..దోస..అప్పడం..వడెం కాదు.ఎంత మంచి కలగాన్నావురా వెర్రినాగన్నా?ఐ పిటీ యు..బాస్స్.better luck in ur nxt birth.

    ReplyDelete