ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ఒకటే వై.ఎస్.ఆర్ నటుడు కానప్పటికి , ఎన్.టి.ఆర్ డాక్టర్ కానప్పటికి మానవీయ పరిపాలన, మానవీయ సంక్షేమ పథకాల అమలు, తిరుగులేని జన బలం, సామాన్య కార్యకర్తను సైతం అందలమెక్కించే నిరాడంభరత్వం, ముక్కు సూటి తనం, వ్యక్తిత్వం, పిడివాదం, ఇలా ఎన్నో అంశాలు
వారిరువురిని ఒకే కోవకు చెందిన జనం మెచ్చిన జన నేతలుగా చేసాయి.
ఎన్.టి.ఆర్ రెండు రూ.లకే కిలో బియ్యమిచ్చారు. వై.ఎస్.ఆర్ దానిని పునరుద్దరించారు. ఎన్.టి.ఆర్ మహిళలకు కుటుంభ ఆస్తిలో భాగం కల్పిస్తే , వై.ఎస్.ఆర్ ఏకంగా పావలా వడ్డీ అమలు చేసి వారిని లక్షాధికారుల్ని చెయ్యడమే ద్యేయంగా పనిచేసారు. ఎన్.టి.అర్ యాబై రూపాయలకే రైతులకు ఒక్క హెచ్ పి విద్యుత్ ఇస్తే వై.ఎస్.ఆర్ ఉచిత విధ్యుత్తే ఇచ్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వీరిరువురి పరిపాలనలపై ఒక పి.హెచ్ .డి సైతం చెయ్య వచ్చు. ఎన్.టి.అర్ తెలుగుగంగ ప్రాజెక్టు చేపడితే వై.ఎస్.ఆర్ జలయజ్నం చేపట్టేరు. ఇద్దరికి మద్యనున్న ఒకే వ్యత్యాసం ఏమంటే ఎన్.టి.ఆర్ రాష్ఠ్ర్ర పార్టి అధినేత. వై.ఎస్.ఆర్ జాతీయపార్టియొక్క రాష్ఠ్ర్ర్ర నేత. కాని వై.ఎస్.ఆర్ ఎటువంటి స్వేచ్చను అనుభవించారో రోశయ్య బతుకు చూసి అర్థం చేసుకోవచ్చు.
"ఎవరినన్నా ప్రవ్హావితం చెయ్యగల అధ్భుత నటన ఎన్.టి.ఆర్ గారిది" - ఇది వై.ఎస్. మాట . స్వంత అల్లుడు ఎన్.టి.ఆర్ ను వెన్ను పోటు పొడిచి గుండె పోటుకు గురి చేస్తే ఒక్క వై.ఎస్.ఆరే ఈ ఉధంతాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును ఇబ్బంది పెడుతూ వచ్చారు.
ఇలా ఎన్నో విధాలుగా వై.ఎస్.ఆర్ తనే ఎన్.టి.ఆర్ అసలు సిసలైన రాజకీయ వారసులని నిరూపించుకున్నారు.
మరో విషయంలో సైతం ఇద్దరికి పోలిక ఉంది. అదేమంటే ఇరువురి వారసులకి న్యాయం జరుగలేదు. ఎన్.టి.ఆర్ లక్ష్యాలకు చంద్రబాబు గండి కొట్టినట్టే ఇప్పటి రోసయ్య ప్రభుత్వం వై.ఎస్. పథకాలను తుంగలో తొక్కేస్తుంది.
ఎన్.టి.ఆర్ /వై.ఎస్.ఆర్ అనే ఇద్దరు కారణ జన్ములు ఇటు జగన్ , జూనియర్ ఎన్.టి.ఆర్ ఉత్సాహ వంతులైన, శక్తిమంతమైనవారసులు.మరో ప్రక్కతీవ్ర అసంతృప్తిలో లక్షలాది మంది ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ అభిమానులు.
నేడు వైఎస్.ఆర్ లేదు.ఆయన పథకాలన్న్ని నీరుకారి పోతున్నాయి. ఒక్క పావలా వడ్డి పథకం కుంటుపడటంతోనే మైక్రో ఫినాన్స్ సంస్థల ఆగడాలు పెరిగిపోయాయి. ఇక వై.ఎస్. పథకాలపై నేటి రోశయ్య ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపనున్నాయో? కాని జగన్ ఉన్నారు. గళం విప్పారు. ప్రజల్లోకి వెళ్ళేరు. ఇక్కడ షాట్ కట్ చేస్తాం.
ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రవేశం జరిగినప్పటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. రాష్ఠ్ర్ర్ర ప్రజల ఆత్మ గౌరవం డిల్లీలో బోల్తా పడింది. ఈ రోజు ఎన్.టి.ఆర్ లేదు. ఆయన తనయులు బాలకృష్ణ,హరి కృష్ణ వంటి వారున్నా వారిలో ఎన్.టి.ఆర్ కున్న తేజస్సు లేనే లేదు. అవి జూనియర్ ఎన్.టి.ఆర్ లో నిక్షిప్తమై ఉన్నాయి.
ఇప్పుడు జూనియర్ ఎన్.టి.ఆర్ గళం విప్పాలి.
ఈ రెండు శక్తులు కలవాలి. రాష్ఠ్ర ఆత్మ గౌరవాన్ని సంరక్షించాలి. సోనియా రాష్ఠ్ర ఎం.ఎల్.ఏ లను ఎల్.కె.జి. బాల బాలికల్లా దలచి నియంత్రించాలని చూస్తున్నారు. రోశయ్యను కేవలం క్లాస్ లీడర్ కింద ట్రీట్ చేస్తున్నారు
ఇదే సరైన సందర్భం జగన్ జూనియర్ ఎన్.టి.ఆర్ తో చేతులు కలపాలి. జగన్ ఓదార్పు యాత్రలో జూ.ఎన్.టి.ఆర్ పాల్గొనాలి. రాష్ఠ్ర్ర వ్యాప్తంగా ఎన్.టి.ఆర్ విగ్రహాలను నెలకొల్పాలి. రాష్ఠ్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వై.ఎస్.ఆర్. ఎన్.టి.ఆర్ అభిమానులను జాగృతం చెయ్యాలి.
ఈ పని చేయకలిగిన నాడు జన భలం చూసి ఆ మహానేతల ఆశయాలపై విశ్వాసం ఉన్న ఎం.ఎల్.ఏలు చచ్చినట్టు తె.దే.పా కాంగ్రెస్ నుండి భయిటకొచ్చి యువనేతల పంచన చేరుతారు. డిల్లీ గల్లీల్లో మళ్ళీ రాష్ఠ్ర్ర ఆత్మగౌరవ నినాదం మార్మోగుతుంది.
No comments:
Post a Comment