గట టపాల్లో మానవుడికి మరణమంటేనే అసలైన భయమని ఆ భయం అతని మస్తిష్కపు పొరల్లో దాక్కుని అడ్డమైన దానితో మరణాన్ని ముడివేసి వనికిస్తూందని వివరించా. మనిషిని మరణంతో సమానంగా వనికిచ్చేది ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన తరుణమే.
జీవితంలో ప్రతి సెకండు ఒక జంక్షన్ పాయింట్.ఆటా-ఇటా -ఇటా-ఎటు అని ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీరాలి. లేకుంటే కాలం మిమ్మల్ని చెత్త కుండిలో పడదోసి తుర్రుమంటుంది.
లైఫ్ కౄరమైంది. దానికి ఎవడి మీద కరుణా కటాక్షాలుండవు. కాలగతిని అనుసరించుకుని వెళ్ళాలి. కాలగతిలో మార్పు అనివార్యం. ఆ మార్పును అంగీకరించాలి. మార్పును వ్యతిరేకిస్తే అవుట్ డేటడ్ అయిపోతాము. చచ్చిన శవంలా పడుండాల్సిందే.
కాని మార్పు మరణ సమానం. దీని వెనుకా చావు భయమే దాగుంది. పిల్లాడు తన పై పెదాల మీద ఐ టెక్స్ తో మీసాలు దిద్దుకుంటాడు.త్వరగా పెద్దవాడు కావాలని.. ఆ వయస్సులో మరణం కాసింత దూరంలో ఉంటుంది కాబట్టే ఈ ఉత్సుకత.
కాని మద్య వయస్కుడు ఒక్క తెల్ల వెంట్రుక కనబడగానే దాన్ని పీకి పారేస్తాడు. ఎందుకంటే ఈ మార్పు అతన్నిమరణానికి చేరువ చేస్తుంది. ఇటువంటి మార్పులు కొన్ని ఉంటాయి.
అన్ని మార్పులు మరణానికి చేరువ చెయ్యవు అని తెలిసినా మార్పంటేనే వనికి పోయే స్థితికి మానవుడు చేరిపోతాడు. కాని కాలగతిలో మార్పు అన్నది అనివార్యం. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే బ్రష్ఠు పట్టించెయ్యవచ్చు. లేదా ఏకంగా నెంబర్ వన్ చెయ్యొచ్చు. ఇది మార్పేగా.మార్పుతో జరిగే మేలు కథ ప్రక్కనుంచి మార్పంటేనే జడిచి వనికి పోతుంది మనస్సు.
ఈ చిక్కు ముడితో నిర్ణయం అన్నా.. స్వీయ నిర్ణయాధికారమైనా మరణంతో సమానంగా మనిషిని వనికిస్తుంది. మీరు దినపత్రికల్లో చదివి ఉంటారు బడా రాజకీయ నేతలు సైతం, వ్యాపార వేత్తలు సైతం కొందరు స్వామీజీలను , జ్యోతిష్కులను ఆశ్రయిస్తుంటారు.
వారు అలా ఆశ్రయించటంలోని అసలు మతలబు ఏమంటే నిర్ణయం అన్నది మరణ సమానం కాబట్టి స్వీయ నిర్ణయం తీసుకునే సత్తా,దమ్ము సతరు వ్యక్తికి లేదన్నదే.
నిర్ణయమంటే ఏమిటో క్లుప్తంగా చెబుతాను. జీవితమన్నదే ఒక కౄయల్ గేమ్. ఒక దానిని వదలి మరోదానిని పట్టడానికి ప్రయత్నిస్తూ చివరికి రిక్త హస్తంతో వెళ్ళడమే ఈ గేమ్ లోని రూల్. దీని అర్థం చేసుకోవడం, ఎవడన్నా కోన్ కిస్కా గాడు చచ్చినప్పుడు స్మమాశనంలో వాగేది కాదు. అను క్షణమ్ గురుతుంచుకుని మసులుకోవలసిన రూల్ ఇది. గుర్తుంచుకోవడం అసాధ్యమైన రూలూ ఇదే.
ఈ లైఫ్ గేమ్ లో మరో రూల్ కూడ ఉంది అదేమంటే మీరేదన్నా పొందాలంటే మరి దేనినో పోగొట్టుకోవడానికి సిద్దం కావాలి. మీరు అన్నింటిని పోగొట్టుకునేందుకు సిద్దమై పోతే అన్నింటిని పొందవచ్చు. మరి నేను ఏది పోగొట్టుకోను అని మడి కట్టుకుని కూర్చుంటే మిమ్మల్ని మ్యూజియంలో పెడతారంతే.
కేవలం వ్యక్తులు లైఫ్ ప్లేకే ఇన్ని కఠినమైన రూల్స్ ఉంటే మరి రాజకీయ చదరంగంలో ఎటువంటి కృరమైన రూల్స్ ఉంటాయో ఒక సారి ఊహించుకొండి. మీరో నేనో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే పోయేదేమి లేదు ఒక ఐదు లేదా పది సంవత్సరాల సంపాదన పోతుందంతే.
ఇదే ఒక రాజకీయ నాయకుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ అఫాల్ అధికారం పోతుంది. అది పవర్. పవర్ ఒక సెకండ్ పోయినా మస్తిష్కమనే కంప్యూటర్ రీ స్టార్ట్ అయిపోతుంది. డేటా లాస్ అయిపోతుంది ( చంద్ర బాబులా)
రాజకీయాల్లో హత్యలుండవు.అన్నీ ఆత్మహత్యలే ఉంటాయని అని ఎవరో చెప్పారు. మరీ కాంగ్రెస్ పార్టి విషయంలో ఈ తంతు నెహౄ కాలంనుండే మొదలు. (బాబ్రి మస్జిద్ వ్యవహారం తెలిసే ఉంతుందనుకుంటా) .
కొందరు మొదటి ఇన్నింగ్స్ లో ఓడి పోయి, మరో ఇన్నింగ్స్ మొదలెట్టినప్పుడు చాలా మారినట్టు బొమ్మ చూపుతారు.కాని అన్నీ కాస్త అనుకూలిస్తే చాలు తమ అసలు స్వరూపం చూపిస్తారు. వీరు ఎలుక తోలువంటి వారు.
రాజీవ్ మరణానంతరం పార్టి చేజారింది. నరసింహరావు మంచే చేసాడో చెడ్డే చేసాడో
నెహౄ కుటుంబేతర ప్రభుత్వాన్నిమరీ మైనారిటి ప్రభుత్వాన్ని ఐదు సం.ల పాటు నెట్టుకొచ్చాడు.
ఈ తరుణంలో అధికారానికి, పార్టికి దూరంగా ఉన్న సోనియా ఒకింతవరకు పశ్చాతపం చెంది పరిణితి చెందినట్టే కనిపించింది. ఇది మన రాష్ఠ్ర్రంలో వై.ఎస్. కిచ్చిన అన్ లిమిటడ్ స్వేచ్చతో కొట్టొచ్చినట్టు కనిపించింది.
కాని అక్కడ కొంత పుంజుకోగానే పాత బుద్దులన్ని వచ్చేసాయి. రాజకీయం ఎంతగా దిగజారినా యుక్తులు ఫలిస్తాయి కాని కుయుక్తులు ఫలిచవు.
ఇందిరమ్మకు ఆ యోగం కలిసొచ్చింది కాబట్టి ఆమె జీవితం అలా సాగి అలా ముగిసింది.
( అంతటి ఇందిరమ్మకే ఎదురు తిరిగిన నేతలూ లేక్ పోలేదు -వారిలో వై.ఎస్. కూడ ఒక్కరు) పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన సోనియా ఇందిరమ్మ పాత్ర పోషించాలనుకుంది.
ఓకే ఎవరి పిచ్చి వారికానందం. ( నిర్ణయం తప్పుడు నిర్ణయమైనా కొన్ని మెళకువలతో విజయం సాధించ వచ్చు అన్నది గమనార్హం) కాని తీసుకున్నదీ తప్పుడు నిర్ణయం. అవలంభించిన పద్దతులూ పనికి మాలినవి .ఎలా సక్సెస్ ఆవుతుంది.
వై.ఎస్. అనంతరం ఒకింతవరకైనా ప్రాంత,జిల్లా విభేదాలకు అతీతంగా రాష్ఠ్ర్ర వ్యాప్తంగా చరిస్మా ఉన్న వ్యక్తి ఒక్క జగనే. సరే దిల్లీ ఏక చత్రాధిపత్యానికి సూట్ అవ్వని వ్యక్తి కాబట్టి, బహుళ ప్రజానీకం మద్దత్తు కూడ కట్టి ఏదో రోజు ఎదురు తిరగ గల వ్యక్తి కాబట్టి పక్కన పెట్టేరు.
నిజానికి వై.ఎస్. మరణించిన క్షణం జగన్ రాజకీయంలో పసి బిడ్డ. అతనిని వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించి ఏ మూన్నెల్లకో,ఆర్నెల్లకో డిస్మిస్ చేసి ఉంటే బుద్దిగా బెంగళూర్ షిష్ట్ అయి పోయి వ్యాపారాలు చేసుకునే వాడు.
కాని అతనిని పక్కన పెట్టి హార్మ్ లెస్ - కౌన్సిలరుగా నిలబడ్డా గెలవలేని వ్యక్తి అని రోశయ్యను ఎన్నుకునేరు. (ఈ మాట అతిశోయక్తేం కాదు . నిజంగానే హైదరాబాద్ కార్పోరేట్ ఎన్నికల్లో సి.ఎం వార్డులో కాంగ్రెస్ పార్టి ఓడి పోయింది)
అతనికైనా తగిన గౌరవమిచ్చి, అధికారమిచ్చి ,స్వేచ్చనిచ్చి ఉంటే ఇంతటి దుస్థితి వచ్చేది కాదు.
కేసిఆర్ ను రెచ్చ కొట్టి తెలంగానా నిప్పు రగిల్చేరు,( తాము నామినేట్ చేసిన వ్యక్తి అయినా సరే అతను సమస్యల్లో ఉంటేనే మాట వింటాడన్న కుత్శిత స్వభావమిది. చిరంజీవిని పిలిచి అతనికి ఆశలు కల్పించేరు. తమ కుత్శిత భావతో అసలికి మోసమొస్తే ఏం చెయ్యాలన్న తలంపు ఇది.
జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. ఒకటి పార్టి శ్రేణులందరు సహకరించండి అని ఒక్క ప్రకటన చేసి ఉంటే జగన్ అడ్రస్ లేకుండా పోయుంటాడు దినపత్రికల్లో సి.ఎం. మంత్రులు, సీనియన్ ఎమ్.ఎల్.ఏ ల పేర్ల తరువాత తదితర్లు పాల్గొన్నారన్న వాక్యాని కాస్త ముందుగా కడప ఎం.పి జగన్ పాల్గొన్నారని వచ్చేది. లేదా ఆ రోజే పార్టి నుండి సస్పెండ్ చేసి ఉండొచ్చు.
రెంటికి చెడటం అంటే ఇదే. లేటెస్ట్ ఫవుల్ ప్లే ఎమంటే తెలంగాన అమర వీరుల పేరిట పరిహారం చెక్కులు ఇవ్వడం. పాపం చని పోయిన వారి పేర్ల మీది చెక్కులు కూడ హానర్ చేస్తారని భావించినట్టుంది.
ఈ సోదంతా చెప్పడం నిర్ణయమన్నది అటో ఇటో తీసుకోవలసిందే కాని మద్యె మార్గమంటూ ఏది ఉండదు. అలా సృష్ఠించినా అది మిద్యే మార్గమవుతుందే కాని ఎటువంటి ఫలితమూ ఉండదు .
No comments:
Post a Comment