Monday, October 11, 2010

అందమైన కలలే ప్రాణ వాయువుగా

అమ్మా అమ్మోరు తల్లి !
నేనే నిన్ను తలచినట్టు
నేనే నిన్ను పిలిచినట్టు
నేనే నీ వద్ద ఏదో కోరినట్టు,పొందినట్టు నమ్మిస్తున్నావు
పొందిన దానిని పంచటానికి మరెవరినో వెతికినట్టు భ్రమింప చేస్తున్నావు

కాని అమ్మా!
నువ్వే తలచావు.
నువ్వే పిలిచావు.
మరి నువ్వే కోరనిచ్చావు.(కోరింది) ఇచ్చావు
ఇవన్ని చేసినట్టే ఇచ్చింది పంచటానికి
నువ్వే జనభాహుళ్యాన్ని నా వద్దకు పంపుతావన్న
జ్నానం ఇప్పుడిప్పుడే నాలో విచ్చుకుంటూంది

అమ్మా అమ్మోరు తల్లి !
ఇవన్ని నా మనోరాజ్యపు  పతాక శీర్షికలు
కాని యధార్థంగా చూసినప్పుడు
ప్రజాకంఠకుల పై  కలబడటం,తల బడటం,
జన భాహుళ్యం బ్రహ్మరథం పడుతుందని భావించటం
నా వెనుక ఉన్న పది మందిని  పోగొట్టుకుని
మూలన పడటం ఇవి తప్ప మరొకటి జరుగదా తల్లీ..?

నా పయణం ఎటు సాగుతూందో కూడ అర్థం కావడం లేదు
లక్ష్యానికేసి ముందుకా? లక్ష్యం నుండి వెనక్కా?
నా పయణం తీరు అధోముఖమా? ఊర్ద్వముఖమా?
అసలు సాగుతూందా? ఆగిందా కూడ అర్థం కావడం లేదు

అమ్మా !
నా భుద్దిని నమ్ముకున్న రోజులు ఎప్పుడో పోయాయి
కేవలం చిత్తాన్ని,చిద్విలాసాన్ని నా చిత్తాన మెరిసే
నీ చిరునవ్వును మాత్రం  నమ్ముకునే  స్థితికి జారి(చేరి)పోయాను.
నా దిక్చూచి నీ నయనం
నీ నయనం చూపిన వైపే నా పయణం

అమ్మా అమ్మోరు తల్లి !
తనను పెద్ద బాక్సర్ అనుకుని తండ్రితో తలబడే చిన్న పిల్లవాని స్థాయిలో ఉన్నాను
ఇక్కడ తండ్రికి బదులు నా ముందున్నది రాక్షసులను సైతం వనికించే మానవ రూపంలోని  దానవులు.

నాటి రాక్షసులే నేడూ ఉండి వారిని సంహరిస్తే వారు నామరూపాల్లేక పోతారు. మరీ తప్పదంటే వాహనమై నన్ను మోస్తారు.
 ఎనలేని కీర్తి నాకు  దక్కుతుంది
మరి నేటి  మానవ రూప దానవులను  సంహరిస్తే  విగ్రహాలై లేస్తారు. మరో పిల్ల రాక్షసునికి సానుభూతి ఓట్ల వర్షం కురిపిస్తారు. నన్ను అడవుల్లోకి తరిమి వేస్తారు.
బట్టలు దరించిన మృగాలన్ను ఊళ్ళో ఉండగా నేను తల దాచుకోవాలి అడవుల్లో
మరి ఏది పరిష్కార మార్గం?
ఏ ప్రజలైతే వీరిని అందలమెక్కిచ్చారో వారి చేతే
గాడిదల పై ఊరేగించేలా చూడాలి (గాడిదల సంఖ్య సరి పోతే - గాడితలు అంగీకరిస్తే)

ప్రహల్లాదునికన్నా తండ్రితోనే ముప్పు,
కృష్ణునికన్నా మామతోనే హాని
మరి నాకు?
నేనెవరి భవిష్యత్ కోసం ఈ అక్షర యజ్నంలో నన్ను నేనే ఆహుతి చేస్తున్నానో
వారే నా శతృవులు.  వారితోనే నాకు  హాని
కొరివితో తల గోక్కుంటున్నారని నేనంటే నా పై
విమర్శల నిప్పుల వర్షం కురిపిస్తున్నారు...

ఎలా నెట్టుకొస్తున్నావో నాకే అర్థం కావడం లేదు

అటు చూడు.. సర్వ శక్తి సంపన్నులు. మేమే  శక్తిమంతులం, మేమే శక్తి పుతృలం
అసలా శక్తియే  మేమని విర్ర వీగుతున్నారు.

ఇటు చూడు ..నన్ను చూడు
అశక్తుడనై, వారిని విర్ర వీగేలా చేస్తున్న శక్తుల పట్ల నిరాసక్తుడనై,
నా దేశం గురించిన  అందమైన కలలే ప్రాణ వాయువుగా , 
నా ప్రజల అబివృద్ది గురించిన కలలే ఆహారంగా,
రేపటి తరాల భద్రత గురించిన  కలలే నీరుగా
బతుకుతున్నాను.
కేవలం సాక్షి భూతంగా వీక్షిస్తున్నా వారు రక్తి కట్టిస్తున్న ఘోర కళిని..
ఏం చెయ్యను?

నా మానస సరోవరం నిర్లిప్తంగా ఉన్నప్పుడు
నీ చాయ ఓ మాయలా ప్రవేశించి కనుమరుగై పోతూంది

నకిలి వైద్య్లుల నెలసరి టూరులా ఉంది నీ రాక పోక
వారైనా నిర్ణీత రోజుల్లో సాగిస్తుంటారు క్యేంపు
మరి నీ రాక,బసలకు ఆ ఏడుపు సైతం లేదు

ప్రియురాలు ప్రియుడ్ని ఆట పట్టించినట్టుంది నీ వ్యవహార శైలి
స్త్ర్రీని నీవిచ్చిన  నిధిగా - నీకు ప్రతిగా - నీ ప్రతినిధిగా ఫీలై
సరి పెట్టుకుంటున్నా నీ ఆట విడుపులు కలిగించే భాధను

స్థిరవాసం ఏర్పరచుకోవే ..
నాలో , నా నాడుల్లో ప్రవహించు
రాసుకుంటే రవ్వ రాలు నా వ్రాతల్లో నృత్యం చెయ్యి

నా దేశంతో సరిపెట్టుకుంటానని నన్ను నిర్లక్ష్యం చెయ్యకు
వీలైతే ఈ విశ్వాన్నే విశ్వాసంతో నింపాలి. విశ్వ ప్రేమ వికసించేట్లు చెయ్యాలి
అదే నా ఉద్దేశం.
ఓం శక్తి

No comments:

Post a Comment