Sunday, October 10, 2010
"శక్తి పూజ" - సైకో అనాలసిస్
(ఈ టపాలో నేను ప్రస్తావించిన, వెలిబుచ్చిన అభిప్రాయాలకు పూర్తి విరుద్దంగా గతంలో నేను అమ్మవారిని తల్లిగా భావించి వ్రాసిన కవిత ఒక దానిని పోస్ట్ చేసాను. దానిని చదవడానికి ఇక్కడ నొక్కండి. చదివి మీ అభిప్రాయాలు /విమర్శలు తెలిపితే సంతోషిస్తాను)
దసరా/నవరాత్రుల గురించి ఎన్నో పౌరాణిక కథలు చెలామణిలో ఉన్నాయి. ఒక మార్పు కోసం ఈ ఉత్సవాల వెనుక ప్రచారంలో ఉన్న వృత్తాంతాలను సైకలాజికల్గా నలైజ్ చెయ్యాలని నిర్ణయించాను.
ఒక స్త్ర్రీ 9 రోజులపాటు దుష్ఠ శక్తులతో చేసిన యుద్దం, 10వ రోజు ఆవిడ సాధించిన విజయం. ఆ విజయం సందర్భంగా ప్రజలు చేసుకున్న సంబరాలు - ఈ మూడు అంశాలు కలిసినదే దసరా.
ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం పితృస్వామ్య సమాజం. అంటే ఒక బిడ్డకు తల్లి ఎవరనేది ముఖ్యం కాదు. తండ్రి ఎవరన్నదే ముఖ్యం. ఉదా: మాజి గవర్నరు తివారి కేసు. నేటి సమాజంలో పురుషులదే పై చెయ్యి .స్త్ర్రీలు కేవలం భానిసలు. సమాజంలో ఆవిడ ఒక కలెక్టర్ అయినప్పటికి భర్తకు బెడ్ కాఫి ఇస్తేనే ఆవిడ పుణ్య స్త్ర్రీ కాగలదన్న అప్రకటిత నిభంధనలు అమల్లో ఉన్నవి.
అందుకే మన సినిమాలు సైతం నూటికి 99.99 శాతం హీరో ఓరియంటడ్ గానే ఉంటాయి. పొరభాటున హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలొచ్చినా ఆవిడ ఒక స్త్ర్రీగా , స్త్ర్రీపై సమాజం విధింఛిన ఆంక్షలను కేవలం 00.01 శాతమే అతిక్రమించి చివరికి పురుష ప్రపంచపు ప్రతిదుల దయా భిక్షలతో పురుష ప్రపంచం యొక్క మన్నెనలు పొందటంలో సక్సెస్ అవుతుంది.
( కళల,కళా కారుల పై సంఘంయొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది - కళాకారుడు సైతం ఈ సమాజం నుండేగా వస్తాడు - కాని కొందరు కళాకారులు సమాజాన్ని పొరకపుల్లలా భావించి తొలినుండి దాని పై తిరుగు భాటు చేస్తుండి తమ కళా కాండాల్లో సైతం దానినే కొనసాగిస్తారు)
ఇది ఇప్పటి స్థితి. కాని మానవులు ఆఠవిక జీవితం సాగిస్తున్న రోజుల్లో,సంచార జీవితం గడుపుతున్న రోజుల్లో స్త్ర్రీ పురుషుల మద్య ఎటువంటి బేదం ఉండేది కాదు. స్వేచ్చాయుతమైన సెక్సువల్ లైఫ్ కారణంగా కన్న బిడ్డకు తండ్రిని నిర్ణయించే ఏర్పాట్లు అప్పట్లో లేవు కాబట్టి తల్లికే ఎనలేని ప్రాధన్యత ఉంటుంది.
నాడు నెలకొన్న మాతృ స్వామ్య సమాజంయొక్క ప్రభావంతోనే షన్మతాల్లో శాక్తేయం చోటు చేసుకుంది. ( అమ్మవారే ప్రధాన ఆరాధ్య మూర్తిగా ఉండటం) .తర్క రీత్యా చూస్తే శైవం,వైష్ణవం,గాణపత్యం తదితర మతాలకంటే శాక్తేయమే సీనియర్ మోస్ట్ అయ్యుండవచ్చు. మానవులు ఆఠవిక జీవితం,సంచార జీవితాలకు భరత వాఖ్యం పలికిని తరువాత స్థిరవాసంలోనే స్త్ర్రీ భానిసైంది ( అదెలా సంభవించిందో మరో టపాలో వివరిస్తా) మాతృ స్వామ్య సమాజం అంతరించిన తరువాతే , పితృస్వామ్య సమాజంలోనే పై శైవం,వైష్ణవం,గాణపత్యం వంటి మతాలు వెలుగులోకి వచ్చి ఉండాలి.
ఇప్పట్లో కూడ వితంతువులు, డైవోర్సీల పిల్లలను ఇతరులు పేర్కొన్నప్పడు తల్లికి కొడుకుగానే చెబుతుంటారు. ఉదా: జానకమ్మ కొడుకు, సీతమ్మ కొడుకు . గతంలో మంగమ్మ గారి మనవుడు, ఇటీవల తమిళంలో విడుదలైన ఎం.కుమరన్ s/o హాలక్ష్మి సినిమాలు. ఈ వ్యవస్థను మాతృ స్వామ్య సమాజం అంటారు.
భర్తలు జీవనోపాయార్థం విదేశాల్లో సం.లు తరబడి స్థిర బడి పోతే పిల్లలు తల్లి సంరక్షణలోనె పెరుగుతారు. కుంతి ఒక్కో దేవత ద్వారా ఒక్కో బిడ్డను కనడం, ద్రౌపది ఏక కాలంలో ఐదుగురు భర్తలను చేసుకోవడం కూడ అప్పట్లో నెలకొన్న మాతృ స్వామ్య సమాజానికి ఆధారాలే.
ఇటీవల కుటుంభాల్లో స్త్ర్రీ/తల్లి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ క్రమేణా పునరావృతం అవుతూంది .స్త్ర్రీ విద్య, ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు, చట్ట సవరణలు రిజర్వేషన్, ఉద్యోగవకాశం తద్వ్రారా లభ్యమైన ఆర్థిక స్వేఛ్చ వంటి అంశాలు ఇందుకు ఒకింతవరకు దోహదపడ్డాయి.
స్త్ర్రీలకు సెక్స్ పట్ల భావ ప్రాప్తి పట్ల చైతన్యం - పురుషుల్లో పుంసత్వ నశింపు:
స్త్ర్రీకి పెరిగిన ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా soft ware companies, call centers కారణంగా స్త్ర్రీ ఆర్థిక స్వేచ్చను పొందింది. దీంతో స్త్ర్రీ తన హక్కులను సంరక్షించుకునే స్థాయికి ఎదిగింది. సెక్స్ పట్ల భావ ప్రాప్తి పట్ల చైతన్యం పెరిగింది. దీనిని తమ హక్కుగా భావించే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల ఈ కారణాన్ని చూపుతూ విడాకులు కోరే స్త్ర్రీల సంఖ్య భాగా పెరిగిందంటూ సమాచారం.
కులవ్యవస్థ, కులాంతర వివాహాలు జరుగుతున్నప్పటికి వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండటం, సైంటిఫిక్ డెవలప్ మెంట్స్,మెకనైజేషన్ కారణంగా శారీరక శ్రమ తగ్గడం, మానసిక వత్తిడి పెరగడం ,జీవన విదానం, ఆహారపద్దతులు మారడం,(ప్రక్తికి విరుద్దంగా - అర్ద రాత్రిదాక మేలుకోవడం, సూరీడు నడినెత్తి మీదికి వచ్చేవరకు నిద్ర పోవడం) , మద్యం,గుట్కా తదితర కారణాలవలన పురుషుల్లో పుంశత్వం శరవేగంగా అంతరించిపోతూంది.
పై తెలిపిన రెండు అంశాల కారణంగా సమాజం మళ్ళీ మాతృస్వామ్య సమాజంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబలైజేషన్, ప్రవైటైజేషన్, లిబరలైజేషన్, మారిన ప్రభుత్వ కార్మిక విదానం, ఉధ్యోగ భద్రత లేమి కారణాల వలన ఎన్నో అవాంతరాలు చోటు చేసుకున్నప్పటికి ,వీటి కారణంగా స్త్ర్రీలు చాలా వరకు నష్ఠ పోతున్నప్పటికి పురుషాధిక్యం క్రమేణా తగ్గి పోతుండటం ఒక శుభ పరిమానమే.
కొడుకు తల్లి పై ఆధారపడటం నార్మల్ ( ఆపోజిట్ సెక్స్ కాబట్టి) , కాని కూతురు తల్లిపై ఎక్కువగా ఆధారపడటం అబ్ నార్మల్ దీంతో ఆవిడ లెస్బియన్ గామారిపోయే ప్రమాదం ఉంది.
కొడుకు తల్లి పై ఆధారపడటం నార్మల్ అన్నప్పటికి క్రమేణా అతను తన దృష్టిని ఇతర స్త్ర్రీల పై మళ్ళించాలి లేకుంటే ఈడిఫస్ కాంప్లెక్సుకు గురవుతాడు. ( తల్లిపై అప్రకటిత కామవాంచ కలిగి ఉండటం - తండ్రిపై అకారణ వైరుధ్యం) . భాల్యంలో తల్లిపై ప్రేమ ఆరాధ్య భావం ,ఆమె పట్ల విధేయ భావం ఉండడం మామూలే. (పిల్లల్లో పెద్దగా చైతన్యం లేనివారే ఇలా ఉంటారు -చైతన్య వంతులు తండ్రిని తమ రోల్ మాడల్గా ఎంచుకుంటారు)
భగవంతుడ్ని తల్లిగా, తండ్రిగా భావించడం ఇమ్మెచ్యూర్డ్ మైండుకు తార్కానం. శాక్తేయమే కాదు భగవంతుడ్ని తల్లిగా ,తండ్రిగా భావించి ఆరాధిచే ఏ వ్యక్తి కూడ 100శాతం మెచ్యూర్డ్ మైండ్ గలవాడని చెప్పలేం.
దసరా ఉత్సవాల్లో,ఆ పది రోజుల్లో అమ్మవారిని రకరకాలుగా అలంకరించి పూజించినా "తల్లి!" అన్న భావం,సంభోదన,పిలుపు మాత్రం మారదు. ఇది ఇందాక చెప్పినట్టుగా ఇమ్మెచ్యూర్డ్ మైండుకు తార్కానం.
మరేం చెయ్యాలి?
నారధ భక్తి సూత్రంలో రకరకాలైన భక్తి మార్గాలు ప్రస్తావించ బడ్డాయి. భవంతుడ్ని స్నేహితునిగా( కుహుడు,శుగ్రీవుడు,విభీష్ణుడు), శతృవుగా( రావణేశ్వరుడు) ఇలా ఏదో విదంగా పరిగణించి భక్తి చూపొచ్చట. కాని సైకాలజి పట్ల కాసింత అవాగాహన ఉన్న వ్యక్తిగా నా సలహా ఏమంటే స్త్ర్రీలు భగవంతుడ్ని పురుష రూపంలో , కొడుకుగా (యశోధ, కౌశల్యా) పరిగణించి,ఊహించుకుని, భావించి భక్తి చూపితే బెటర్. అవివాహితులు ప్రేమికుడిగా కూడ ఊహించి భక్తి చెయ్యొచ్చు.అలా చేస్తే త్వరిత గతిన మనస్సు లగ్నమవుతుంది.(రాధలా)
పురుషులైతే స్త్ర్రీ రుపాన్ని ఎంచుకోవడం బెటర్. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే అమ్మవారిని శ్రీబాలా త్రిపుర సుందరి రూపాన కన్న కూతురిగా పూజించి,ద్యానించడం బెస్ట్. ఇదే మెచ్యూర్డ్ మైండడ్ పీపుల్ గా ఎదిగే మార్గం. ఇది మనలను మరింత భాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment