స్త్ర్రీ పట్ల చక్కని దృక్పథం రావాలంటే నాయకుడు యువకుడై ఉండాలి. ప్రేమ,పెళ్ళి,దాంపత్యం,సంసార జీవితాల్లోని మధురిమలను చవి చూసినవాడై ఉండాలి.
వాటితో పోల్చుకుంటే ఈ దనం,అధికారం ఇవన్ని గడ్డిపరకలేనన్న మనోభావం కలిగి ఉండాలి. అప్పుడే అతనికి సృష్ఠి పట్ల , సృష్ఠికి ప్రతి - నిధి -ప్రతి నిధి అయిన స్త్ర్రీ పట్ల Thankful ness ఉంటుంది. స్త్ర్రీల పట్ల సతరు నాయకుని దృక్పథం కూడ సహజంగా ఉంటుంది. కాని మన దేశానికి ఇటువంటి నాయకత్వం లభించలేక పోయింది. ఇదే స్త్ర్రీల పట్ల నాయకుల దృక్పథం ఇలా ఏడవడానికి అసలు సిసలైన కారణం. అగ్ర శ్రేణి నాయకులు ఎలా ఉంటే ఏం.. ద్వితీయ శ్రేణి నాయకులు ఎందరో ఈ నిభంధనలకు అర్హులై ఉంటారుగా వారెందుకు తమ దృక్పథాన్ని మార్చుకోలేదని మీరు ప్రశ్నించవచ్చు.
మన విద్యా విదానం అటువంటిది. మన సమాజం అటువంటిది. మన ప్రజల మనస్తత్వం అటువంటిది. ఎవరన్నా కొత్తగా ఏమన్నా చెబితే కనీశం పరిశీలించే పరిపక్వత సైతం లేని వారమయ్యారు కాబట్టి స్త్ర్రీ పట్ల తమ వాస్తవమైన దృక్పథాన్ని బహిర్గతం చేస్తే సతరు ద్వితీయ శ్రేణి నాయకుల ఉనికికే ప్రమాదం వచ్చేది. అందుకే వారెవరూ భయిట పడలేదు.
ఏ పదవిలోనూ లేకున్నా భారత దేశాన్ని ఒక త్రాటి పై నడిపిన మహాత్ముడు సైతం స్త్ర్ర్రీని ,సెక్సును సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం వీటన్నింటికి మూలం. మనం ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం,గణ తంత్ర దినోత్సవం నాడు మనలను భానిసలు చేసారని ఆడిపోసుకునే తెల్లవారే స్త్ర్రీ భానిసత్వపు సంకేళ్ళను సడలించి స్వేచ్చకు నాంది పలికారన్న సంగతిని ఎం చక్కా మరిచి పోతాం.
మహాత్ముడు జీవితాంతం తన కామవాంచల పై పోరాడుతూనే ఉన్నారు .( ఈ విషయం పై మరిన్ని వ్రాస్తే సాంబార్ గాడులో మీరు చదివే చిట్ట చివరి పోస్టు ఇదే అవుతుంది కాబట్టి వివరించడం లేదు)
నేనిదివరకే ఒక మితృని వ్యాఖ్యకు స్పందిస్తూ స్త్ర్రీ ద్విపాత్రాభినయం చేస్తుంటుందని. కృష్ణుడు ఎలా ఏ రూపాన కొలుస్తే ఆ రూపాన కరుణిస్తాడో అలానే స్త్ర్రీ కూడ వ్యవహరిస్తుంటుందని చెప్పాను.
ఆవిడ పోషించే పాత్రలు రెండు ఒకతి కామిని మరొకటి జనని. పురుషులు సారి పురుషోత్తములు / అంటే మన నాయకులు స్త్ర్రీని కేవలం కామినిగా చూస్తే బ్రహ్మచర్యం , కామవాంచలను అనచుకోవడం , పబ్ లను నిషేదించటం ,వ్యేలెంటెన్స్ డేను అడ్డుకోవడం వంటి వాటిని ఉపదేశిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతారు. ఇదో రకం సంకేళ్ళు.
స్త్ర్రీని జననిగా చూసే నాయకులు (కామినిగా చూస్తే తివారిలై పోతామని భయం) ఆవిడను తల్లి చెల్లి అంటూ మరో రకం సంకేళ్ళతో బంధిస్తారు. స్త్ర్రీ అభినయించే పై రెండు పాత్రలకు అవతల సత్యం ఉంది. అదేమంటే జీవన పోరాటంలో ఆవిడ సహ యోధురాలు.
సెక్సును జయించటానికి ఏకైక మార్గం చట్ట బద్దమైన,దర్మ బద్దమైన, స్పృహతో కూడిన లోతైన , పొడవాటి రతి మాత్రమే. బ్రహ్మచర్యం మనిషిని సెక్సుకు సిద్దం చేస్తుంది. సెక్స్ బ్రహ్మచర్యానికే సిద్దం చేస్తుంది (ఓషో) ఈ చిన్న కిటుకు మన మహాత్మునికి తెలిసి ఉంటే స్త్ర్రీ పట్ల ఆయన దృక్పథం ఎటో మారి పోయేది. కాని దురదృష్ఠవాశాస్తూ అలా జరగలేదు.
తదుపరి మన దేశ సారథిగా ఉన్నవారు జవహర్లాల్ నెహౄ. పాపం ఆయన గారి ఆంతరంగిక జీవితం చాలా ప్రేలవమైనది. అతను హోమో సెక్సువల్ అని కూడ ఆరోపణలున్నాయి.
ఈ పరిస్థితిలో స్త్ర్రీ పట్ల ఆయన్ దృకపథం ఎలా ఏడుస్తుంది. ఇక ఇందిర . శారిరకంగా ఆవిడ స్త్ర్రీ కావడం చేత స్త్ర్రీ పట్ల ఎటువంటి ఆకర్షణ ఆవిడకు కలిగి ఉండక పోవచ్చు. పైగా మానసికంగా ఆవిడ ఏ పురుషునికి తీసి పోదు. ఈ మగతనం కృత్రిమం కాబట్టి తన సహజత్వం భయిట పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలోనే ఆవిడ కాలం గడిచి పోయింది.
తదుపరి వచ్చిన రాజీవ్. ప్రేమించిన వారు. ప్రేమించిన అమ్మాయినే వివాహమాడినవారు. దాంపత్యం,వైవాహిక జీవితాలను అనుభవించినవారు. కొద్దిగా కాలం కలిసొచ్చుంటే మహిళల విషయంలో అధ్భుతాలే జరిగేవి.
కాని అప్పటికే తుప్పు పట్టి పోయిన ప్రభుత్వ యంత్రాంగం అతని మనోవేగం ,వాయు వేగాలకు సహకరించ లేక పోయింది. దీనికి తోడు కిచెన్ క్యేనినెట్, డూన్ పాఠశాల సహపాఠులు ఆయనను చుట్టు ముట్టించి నాయకులు, ప్రజల్లోనుండి అతన్ని దూరం చేసేసేరు.
అంత కాలం కాచుక్కుర్చున్న ముసలి నాయకులకు రాజీవ్ దూకుడు విదానం మింగుడు పడక బెంబేలెత్తి పోయేరు. కర్ణుని చావుకున్నన్ని కారణాలు రాజీవ్ ఓటమికున్నాయి. బోఫర్స్ అన్నది చిట్ట చివరి గడ్డి పరక మాత్రమే.
శ్రీలంక తమిళుల విషయంలో ఆయన్ని తప్పు ద్రోవ పట్టించిన వారు అతని మరణానికే దారి తీసేరు. తదుపరి వచ్చిన వి.పి సింగ్ యవ్వనంలో లేక పోయినా దాంపత్య జీవితంలో ఉన్నవాడు . వ్యేక్కువం ఉన్న నాయకుడు. దురదృష్థ వశాస్తూ మండల్ కమిషన్-
అద్వానిజి రథ యాత్ర -అర్స్ట్ పుణ్యమా అంటూ గద్దె దిగాల్సి వచ్చింది.
చంద్ర శేఖర్,నరసింహరావు,దేవిలాల్ ,చరణ్ సింగ్ ఇలా ఎవరిని చూసినా అందరూ నేను ఈ టపా మొదటి పారాలో చెప్పిన ఏ నిభంధనకూ సరిపోరు. ఇప్పటి సోనియా అంటారా? వైధవ్యం,అభధ్రతలతో సతమతమయ్యే ఆవిడ దాదాపు ఇందిరమ్మ స్థాయికి చేరుకుంది.
నాయకుల కథ పక్కన పెడతాం . ఇంతకీ స్త్ర్రీని జీవన పోరాటంలో సహయోధురాలుగా పురుష ప్రపంచం గుర్తించాలంటే ,గౌరవించాలంటే స్త్ర్రీలేం చెయ్యాలి? పురుషులు ఏం చెయ్యాలి అన్న సంగతిని తదుపరి టపాలో చూద్దాం.
No comments:
Post a Comment