నేను మొన్న ఒక టపాలో "యధా ప్రజా తధా రాజా" అన్నాను. దానిని పత్రికలవారి భాషలోనైతే పునరుద్ఘాటిస్తున్నాను. గాంథి అంతటి ఉత్తముడుగా ఉండగలిగాడంటే అప్పటి ప్రజానీకంలో కూడా ( మెజారిటి) అంతటి స్వచ్చత,పాప భీతి ఉండి ఉంటుంది.
నేడు మన నాయకులు ఇలా ఏడ్చారంటే అందుకు గల కారణాల్లో ప్రజల్లో ,వారి ఆలోచనా విదానాల్లో వచ్చిన మార్పే కీలకం.
నాయకుడన్నవాడు ఆకాశం నుండి దూకడు. ప్రజల మద్యనుండే వస్తాడు. అతనూ ప్రజల్లో ఒక్కడే. అయితే అతను కాస్త ముందు చూపుతో,విశాల దృక్పథంతో, భావితరాల పట్ల భాధ్యతతో ఆలోచించి ఉంటాడు అంతే .
కాసింత నిజాయితీగా ఆలోచిస్టే గతం అన్నది ఎప్పటికీ గర్వించ తగ్గదిగా లేదు. ఇటీవల రాజ రాజ చోళన్ పట్టాభిషిక్తుదై వేల సం.లు పూర్తైన సందర్భంగా తమిళ నాడు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది.ప్రతి వక్త చరిత్ర పుటలను తిరగేసి రాజ రాజ చోళుడ్ని ఆకాశానికి ఎత్తేసేరు. నిజమేమంటే అతని పరిపాలనలో కులవ్యవస్థ కారణంగా మరీ బాహుటంగా చెప్పాలంటే బ్రాహ్మణుల కులాహంకారానికి బహుజనులు ఎనలేని పక్షపాతానికి హింసకు, అనచి వేతకు, దోపిడికి గురయ్యేరు.
ఈ సత్యాన్ని ఎవరూ ప్రస్తావింఛ లేదు. అక్కడ చోళుడైతే ఇక్కడ కృష్ణ దేవరాయులు. గతాన్ని మనం నెమురవేసుకుని మురిసి పోవాలంటే ఇటువంటి మాయని మచ్చలను మరిచిపోయే సెలక్టివ్ అమ్నీషియా రొగానికి మనం గురై ఉండాలి.
వితంతువులను భర్తతో పాటు కాల్చాం ఇదీ గతమే. తదుపరి వారికి గుండు గీయించి , తెల్ల చీర కట్టించి అండర్ గ్రవుండ్లో ఉంచాం. ఇదీ గతమే.
కేవలం గతమే ఇటువంటిది అనుకోకండి బాబూ! వర్థమానం కూడ ఈ ఏడుపే. మరి ఏది గొప్పా అంటే భవిష్యత్తే గొప్ప. కాని అది బెటర్ గా ఉండాలో బిటర్ గా ఉండాలో , బెస్ట్ గా ఉండాలో నిర్ణయించేది వర్థమాన పౌరులే.
బెస్ట్ లీడర్:
* ప్రజల భంగారు భవితకు,రేపటి తరాల అభివృద్దికి తాను ఏది మేలని భావిస్తాడో దానిని ప్రస్తావించే దమ్ము ధైర్యం గలవాడై ఉండాలి , తన మాటలు ప్రజలకు రుచించదనిపించినా, ప్రజలె తనను బహిష్క్తరిస్తారేమోనన్న పరిస్థితి ఉన్నా తన మాటను నొక్కి చెప్పే ఆత్మ స్థైర్యం గలవాడై ఉండాలి. వీరు మొదటి రకం.
ఉ: చౌరి చౌరాలో హింస చలరేగడంతో తన సహాయ నిరాకరణ పిలుపును వెనక్కి తీసుకున్న బాపూజి
బెటర్ లీడర్:
తన విజన్ ఎలా ఉన్నా, తన అంతిమ లక్ష్యం ఏదైనా ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉంటే దానిని గౌరవించి తన వ్యక్తిగత అజెండాను వాయిదా వేసుకుని కార్యాచరణ రూపొందించుకునేవాడు బెటర్. అయితే అతని ప్రస్త్త్తుత కార్యాచరణకు అంతిమ లక్ష్యానికి మధ్య Contradiction ఉండదు మరి..
బిటర్ లీడర్:
తనకంటూ ఒక విజన్ లేక, కనీశం సామాన్యుల మనోగతాన్ని సైతం పసి కట్టలేక తన లోకంలో తానుంటూ దేశ వర్థమానాన్ని,భవిష్యత్తును,రేపటి తరాల అవకాశాలను సైతం నాశనం చేసేవాడు ఈ కోవకు చెందినవాడవుతాడు.
యధా ప్రజా:
ప్రస్తుతం ప్రజల మనోభావం ఎలా ఉందంటే ( సామాన్యులు, విద్యావంతులు) దేశంలో ఏం జరిగినా ఫర్వాలేదు తన దాకా రాకుంటే చాలు. కాలనిలో కార్పోరేషన్ వారు చెత్తలు తొలగించ లేదు. మురికికాల్వలు శుభ్రం చెయ్యడం లేదంటే తన ఇంటి కిడికీలకు మెస్ భిగిస్తామా? ఆల్ అవుట్ పెడతామా? దోమల వర్తి పెట్టుకుంటామా అని ఆలోచిస్తాడంతే. కాలనీలో వీథి లైట్లు వెలగడం లేదంటే రీ చార్జబుల్ టార్చ్ కొనుక్కుంటాడంతే. కాలనిలో అల్లరి మాకులు త్రాగుతున్నారని, ఆ దారిన వెళ్ళే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే తన ఇంటి మహిళలను భయిటకు వెళ్ళ వద్దని ఆజ్నాపిస్తాడు.
ప్రజల్లో అనేక మంది అమాయకులు. స్వంత వ్యక్తిత్వమంటూ ఏమీ ఉండదు. "తెలుగు దేశం పిలుస్తూంది ! రా కదిలి రా " అని ఎన్.టి.ఆర్ పిలుపిచ్చినా పరుగులు తీస్తారు. "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అని కే.సి.ఆర్ వాగినా అనుసరిస్తారు. సమాజంలో కొందరు లీడింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. వారిలో మంచివారూ ఉండ వచ్చు చెడ్డ వారూ ఉండవచ్చు. ప్రజలు వారిని అనుకరిస్తారు.అనుసరిస్తారు.
నేను కాలేజి యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసాను. తె.దే.పా, కాంగ్రెస్ పార్టీల అండతో అందరూ పోటీ చేస్తే నేను ఇండి పెండెంట్ గా పోటీ చేసాను. నేను పోస్టర్లు ముద్రించ లేదు, మందు పొయ్యలేదు, బ్లాక్ మెయిలింగ్ చెయ్యలేదు. అనుకోకుండా 468 ఓట్లు పడ్డాయి. గెలిచిన చేర్మెన్ అభ్యర్ధికన్నా నాకు అధిక ఓట్లు పడ్డాయి. తక్కిన వారు "అన్నీ" చేసేరు. నేను ఏమి చెయ్యలేదు. ఇది నా ఇప్పటి ఆలోచనా విదానానికి ఒక కారణం అయ్యుండ వచ్చు.
భారత దేశాన్ని సంపన్న దేశంగా తీర్చి దిద్దటానికంటూ ఒక పథకం రూపొందించాను. దానిని 1997 నవంబరు నుండి చంద్రబాబుకు, కేంద్ర పాలకులకు పంపుతూ వచ్చాను. 2004 అక్టోబరు దాకా ఈ విషయమై ఎన్నో రసవత్తర మలుపులు చోటు చేసుకున్నాయి.
వై.ఎస్. సి.ఎం అయ్యాక నా పథకం పై సి.ఎం పేషి నిర్లక్షయ వైఖరిని ఖండిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను.
ఆ సమయంలో నన్ను వచ్చి కలిసినవారిలో నూటికి 99.9 శాతం నా పై, నా ఆరోగ్యం పై శ్రద్దతో వచ్చిన వారే. 1987కి ( కాలేజి ఎన్నికలు), 2004 నాటికి ఇంత తేడా ఎలా వచ్చింది?
లీడింగ్ పెర్సనాలిటీస్ మారేరు. సామాన్యుల జీవన విధానం మారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది.జనాభా పెరిగింది. పోటీ తత్వం పెరిగింది. వనరుల్లో లోటు పెరిగింది. దీంతో ప్రజల జీవన విధానమే మారింది.
కేవలం ఏడు సం.ల్లోనే ఇంత మార్పు చోటు చేసుకుంది. నేను నా నిస్వార్థ మిషన్ ను కొనసాగించాలన్నా .. ప్రెస్ మీట్ ఫాలోడ్ బై డిన్నర్స్ ఏర్పాటు చెయ్యాలి.నేనూ నా చుట్టూ భజనపరులను చేర్చుకోవాలి. పనికొచ్చేవాడు, మేథావి మరొకడ్ని అనుసరించడు.పనికి మాలినవాడే ,మూర్ఖూడే మరొకరిని అనుసరించటానికి సిద్దంగా ఉంటాడు. అలా వచ్చినవారిని వారిని, వారి గత చరిత్రను,వారి వర్థమాన నేరాలను నేను మొయ్యాలి, నేనూ దోచుకోవాలి,దోచుకున్నదానిలో వారికీ భాగం పంచాలి.
ప్రతి నటుడూ రజనికాంత్ కాడు కదా? ప్రతి డైరక్టరు శంకర్ కాలేడు కదా? ప్రతి నటుడు,ప్రతి డైరక్టరుకీ రాష్ట్ర్రాన్ని దోచిన సొమ్ముతో ఒక కలానిధిమారన్ దొరకడుగా?
రోభో తీస్తేనే చూస్తామని ప్రజలు భీష్మించి కూర్చుంటే నెలకో డజను రోభో చిత్రాలొస్తాయి. అదే నేటి నాయకత్వ లోపానికి ( రాహిత్యానికి) అసలైన కారణం .
నాయకుడు ప్రజ చేతులు కలిపితేనే ప్రజాస్వామ్యానికి చప్పట్లు.. లేకుంటే తప్పవు ఇక్కట్లు
Very well written article.
ReplyDelete