Note: "శక్తి పూజ" - సైకో అనాలసిస్ శీర్షికన వ్రాసిన టపాను ఇక్కడ క్లిక్ చేసి చదవండి
ఒక తల్లి నలుగురు బిడ్డలను పోషిస్తుంది.
కాని ఆ నలుగురు కలిసి ఒక తల్లిని పోషించ లేక
ఓల్డేజ్ హోమ్ పాలు చేస్తారు
హే మహోదరి!
ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా
కడుపులో ,కళ్ళల్లో పెట్టుకుని
దాచుకుంటున్న నిన్ను వీరిలో ఏ ఒక్కరన్నా
తమ గుండెలో దాచుకోలేక
నాలుగు గోడల మద్య భంధించడం విడ్డూరం
త్యాగేశుడు అని శివయ్యను కీర్తించే ఈ లోకంలో నిన్ను
త్యాగేశ్వరిగా ఎందుకు గుర్తించటం లేదు?
రా ..నీ విశ్వరూపంకన్నా విశాలమైన నా గుండెలో దాచుకుంటా..
ఆ నాలుగు గోడల మద్య ఉండి నువ్వు సాధించిందేమి
వాస్తు దోషాలు,గ్రహ దోషాలు అంటని నా గుండెలో స్థిర వాసం చెయ్యి
నా గుండెలో ఉప్పొంగే కవితామృతాన్ని కడుపారా త్రాగు
నా శతృవులు,ద్రోహాలు, నా పేదరికం నా గుండెలో ఉన్న రక్తాన్ని పూర్తిగా పీల్చి వేసినా హిమాలయంతో పోల్చ తగ్గ తెల్ల దనం ,చల్లదనం, నువ్వైనా ఊహించలేని కొత్తదనం, ఉట్టిపడే గట్టి గుండె ఇది.
నువ్వు సరదా పడే త్రిశూలం చేత బట్టి ,ప్రళయ కాల రుద్ర నాట్యం చేసినా అదరదు,బెదరదు.చెదరదు
నేను వ్రాసిన పిచ్చి గీతలకే మురిసి పోయి కాలాగ్నిలో సైతం
స్వర్ణంలా మెరిసేట్లు చేసావు
నా పేదరికానికి కోత విధించావు
వ్రాత మార్చావు
ఈ ప్రపంచమే వినాశానికేసి బుల్లెట్ లా దూసుకుపోతున్నా
నా గుండె ద్రోహాలతో బండ బారినా కొండ శిఖరాల ఇరుకునుండి ఉరకలేస్తూ పరుగు తోసే నదిలా దిగి వచ్చావు
నా కవిత ఈ భూతలం పై చెవిటి రాజ్యమే సాగుతున్నా
సమస్త ప్రజానీకం సృష్ఠి పరిసమాప్తికే సాయ శక్తులా కృషి చేస్తున్నా
ఋషిలా బ్రతకనిచ్చావు
బతుకు నా ద్యేయం కాదు.
జీవించడం నా లక్ష్యం కాదు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా మానవత్వాన్ని జీవింపచెయడమే నా లక్ష్యం.
కక్ష్య దాటుతున్నానని, తక్షణం నీ తీర్పు అమలు చెయ్యాలని అనిపిస్తూందా రా!
ఈ జనులు ఏ ప్రమోషన్ కోసమో, ఇన్ క్రిమెంట్ కోసమే ఇబ్బంది పెడతారని భయపడకు. వీరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి.
నువ్వు సర్వాలంకార భూషితురాలై, సింహ వాహణమెక్కి, త్రిశూలం చేతపట్టి సిటి జంక్షన్లో కనబడినా పగటి వేషగత్తెని పక్కకు పోతారు.
నా కథ వేరు..
నువ్వే రూపాన వచ్చినా గుర్తు పడతా .. శిరస్సు వంచుతా
తరచూ రాక్షసులనే వధిస్తుంటే
ఏమున్నది మజా..వెరైటిగా నా తల నరుకు.
నా మస్తిష్కమంతటా నిండి ఉన్న విశ్వప్రేమ రక్త రూపేణా నీకు పాదాభిషేకం చెయ్యనీ
ఆ చల్లదనంతో కలి పురుషిని కేకలతో గమ్యం మరచిన వ్యర్థ మానవుల ,వ్యర్థ జీవితాలతో వేడెక్కిన నీ శిరస్సు చల్లబడనీ ! ఆ చల్లదనంతో, నీ తల్లి గుండే కరగనీ !
సరి కొత్త ఉషస్సును ప్రసాదించు నా జాతికి
పట్టం కట్టు నీతికి
No comments:
Post a Comment