Saturday, October 23, 2010
వ్యక్తి పూజ - లేదా ఐడియల్ హి -కొన్ని హెశ్చరికలు
మీరు ఏ గొప్ప వ్యక్తి చరిత్ర తీసుకున్నా వారికి స్ఫూర్తి ప్రధాతలుగా కొందరు గొప్పవారుండి ఉంటారు. ఎల్.టి.టి.ఈ అధినేత ప్రభాకరన్ నేతాజి నుండి ప్రేరణ పొందారు. మహాత్ముడు హరిశ్చంద్రుడినుండి,శ్రవణకుమారుని వద్దనుండి ప్రేరణ పొందారు. చత్రపతి శివాజి తన తల్లి జీజా బాయి చెప్పిన కథల్లోని కథానాయకులనుండి ప్రేరణ పొందాడు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ప్రేరణగా నిలుస్తారు. సాధారణంగా ఆడ పిల్లకు తల్లి, మగ పిల్లవానికి తండ్రి రోల్ మాడల్స్ గా ఉంటారు. ఇది కాస్తా మారినప్పుడు మరిన్ని అధ్భుతాలు జరుగుతాయి. ఉ. ఇందిరకు నెహౄ.
అలా తమర్ని ప్రేరేపించి ,స్ఫూర్తిగా నిలిచినవారికి థ్యాంక్స్ చెప్పే రీతిలో వ్యక్తి పూజ ఉంటే తప్పు లేదు. అలా కాక తమ వ్యక్తిగత, తాత్కాలిక, స్వార్థ లాభాల కోసం పనికిమాలినవారిని భుజాన వేసుకుని ఊరేగడం, భజన చెయ్యడం తప్పే.
వేటూరి సుందర రామమూర్తి అంటే నాకు ఎంతో ఇష్ఠం. ( గొప్ప విషయాలను సైతం అలవోకగా చిన్న చిన్న పదాలతో లాగించి పారేసే వారు)
మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
అని మొదలు పెట్టి " కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.మహా పురుషలవుతారు" అని వ్రాసిన వేటూరి మరో సినిమాలో "మనుషులు ఋషులై వెలగాలంటే పుణ్య చరితలే ఆధారం"అని వ్ర్రాసారు.
మనుష్య్లులే కారు చంద్రుడు సైతం రవి తేజాన్నేగా reflect చేస్తున్నాడు. పైగా మనుషుల్లో రెండు రకాలున్నారు. సూర్య వ్యక్త్లులు, చంద్ర వ్యక్తులు. సూర్య వ్యక్తులకు ఐడియల్ హీలు, స్ఫూర్తి ప్రధాతలతో అవసరం లేదు. కాని చంద్ర వ్యక్తుల పరిస్థితి అలా కాదు. వారికి ఖచ్చితంగా ఒక రోల్ మాడల్ అవసరం.
కాని ఈ ఎంపికలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ హెర్షత్ మెహ్తానో, ఏ శోబరాజినో ఎన్నుకుంటే షెడ్ అయ్యి పోతారు. అలానే ఈ అభిమానం హద్దులో ఉండాలి. తమ ఆదర్శ పురుషులను పూజిస్తున్నా వారిలోని చిన్న చిన్న లోపాలను గమనించి విశ్లేషించి అవి తమలోకి ప్రవేశించకుండా చూసుకోవాలి.
చంద్ర వ్యక్తులు పరిస్థితి ఎలా ఉంటుందంటే వారి అభిమానం కాస్తా ముదిరి దురాభిమానంగా మారడం, అదో అడిక్షన్ లా మారడం జరుగుతుంది. తమ ఆదర్శ పురుషునిలోని లోపాలను సైతం అంగీకరించి స్తుతించటం మొదలు పెడతారు. ఇంకా ఒక మెట్టు పైకి పోయి వాటిని సైతం అనుకరించటం మొదలు పెడతారు.
ఒక్కో వ్యక్తిత్వంలోను సారం అన్నది ఒక్కటుంటుంది.ఆ సారాన్ని తీసుకుని అభిమానించటం ,అనుకరించటం కూడ తప్పు లేదు. అలా కాక స్థూల విషయాలను అభిమానించడం ( హీరోలవలే క్రాపు చేసుకోవడం, బుడబుక్కలవానివలే డ్రెస్ అప్ చేసుకోవడం) వృధా.
గొప్ప వ్యక్తిత్వం అన్నది ఇందాక భూ ప్రపంచం మీద వెలిసిన దాఖలాల్లేవు.రాముడు,కృష్ణుడిలో సైతం లోపాలున్నాయి. మహాత్ముని మీద సైతం విమర్శలున్నాయి.
గొప్ప వ్యక్తిత్వమన్నది ఒక సంకలనం ద్వారే సాధ్యమవుతుంది. మంచి ఎక్కడున్నా తీసుకోవడం,చెడు ఎక్కడున్నా తిరస్కరించడమే బెస్ట్
Subscribe to:
Post Comments (Atom)
నేటికి మీకు తత్వం భోధపడినందుకు ఆనందంగా ఉంది శిష్యా.ఇకనుంచి మీ పోస్ట్లన్ని ఇదే పంధాలో,కొనసాగాలి మరి.
ReplyDelete