Wednesday, October 6, 2010

జగ(మె)నెరుగని కొన్ని సత్యాలు


నెంబర్ వన్ అంటే బిరుదు కాదు ..భాధ్యత . భాధ్యత మాత్రమే కాదు. భాధా. ఓటమి ఎదురైతే దాని తాలుకు పూర్తి భారం నాయకుడిపై పడుతుంది. విజయం ఎదురైతే మాత్రం ప్రతి ఒక్కరు అందులో భాగం కోరుకుంటారు.

నాయకుడంటే పదవులకే కాదు శిక్షలకు కూడ ముందుండాలి. అదిష్ఠానం అయినవారి పై వేటు వేస్తూ పోతుంటే అరిగి పోయిన రికార్డులా కేవలం వై.ఎస్. జపానికే పరిమితమవుతూ   ఓదార్పు యాత్రకు పరిమితం కావడం మంచి నాయకుని లక్షణం కాదు.

భోజనం వేళలో ఏ ఇంటికి వెళ్ళినా భోంచేసి వెళ్ళండి అంటారు . సరే పెట్టండి అంటూ కూర్చుంటే పెట్టేవారు ఒకరో ఇద్దరో.

ఎందరో మగ రాయుళ్ళు, మదధీరులు ఉత్తర కుమార ప్రగల్బాల్ పలికేరు. అందులో మంత్రులూ ఉన్నారు. జగన్ సి.ఎం కాకుంటే రాజీనామాలు చేస్తామని బాహుటంగా చెప్పేరు. కాని నిజంగా అట్టి త్యాగాన్ని చేసింది కొండా సురేఖ మాత్రమే.

నాయకుడన్నవాడు యుద్దరంగంలో తాను ముందుండి పోరాడితే ఎంతటి చిన్న సైన్యమన్నా మూడింతల ఉత్సాహంతో విజయాన్ని కైవశం చేసుకోవడం తధ్యం. కాని జగన్లో ఈ తెగింపు ఇప్పటికీ రాలేదు.

అంతటి త్యాగం చేసిన కొండా సురేఖకు జగన్ ఇచ్చిన భరోసా ఏంది?  ఆమె పరిస్థితి చూసినవారెవరన్నా నోరు జారుతారా?

ఒక నాయకుడిగా జగన్ అప్పుడే పార్టికి అల్టిమేటమ్ జారి చేసి ఉండాలి. యుద్దమైనా శాంతి అయినా అందులో తిరకాసులు, నాన్చుడు,డొంక తిరుగుళ్ళు ఉండ కూడదు.

లీడర్ అంటే " వన్ హూ లే డౌన్ హిస్ లైఫ్ ఫార్ హిస్ పీపుల్" తన వారికోసం తన జీవితాన్ని అర్పించే వాడు నాయకుడు. కాని ప్రస్తుతం జగన్ వైఖరిలో ఈ లక్షణం కనబడటం లేదు.

వై.ఎస్ పోయిన తరువాత ఆయన గురించి నాయకులు చెప్పిన మాటలకు జగన్ మురిసి పోయి తన తండ్రి అజాత శతృవు అనుకున్నట్టుంది. భగవంతునికి సైతం శతృవులున్నారు. వైఎస్ దేవుడేమి కాడు కదా?

కొందరికి దేవుడు అనిపించాలంటే మరి కొందరికి దానవుడనిపించక మానదు. మరి ఎందరికో దేవుడైన వై.ఎస్. ఎందరికి దానవుడనిపించారో అర్థం చేసుకోని ఉండాలి. వై.ఎస్. మరణాంతరం ఉన్న వాతావరణం జగన్ కు పూర్తిగా అనుకూలంగా ఉండే. అప్పుడు వారేమనుకుంటారు ..వీరేమనుకుంటారని తికమక పడక భాగా కాలి,ఎరుపెక్కి ఉన్న ఇనుములా ఉన్న రాష్ఠ్ర్ర్ర రాజకీయం పై ఒక్క ఏటు వేసి ఉంటే ఈ రోజు జగనే సి.ఎం.

తొందర పడవలసిన సందర్భంలో మౌనంగా ఉండి, వేచి చూడాల్సిన పరిస్థితిలో ఓదార్పు పై పట్టు పట్టి గజి బిజి చేసేరు. ఒక తండ్రికి కొడుకై పుట్టిన మాత్రాన కొడుక్కి అతని ప్రతిభలన్ని వారసత్వంగా వచ్చి పడదు అనడానికి జగన్ ఒక్క ఉదాహరణ.

ఏనాడు వై.ఎస్ తన వర్గాన్ని భలి పెట్టలేదు. వారి వలన అపఖ్యాతి వస్తుందన్నా వెనక్కి తగ్గ లేదు. కాని జగన్? 
ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. బెటర్ లేట్ దేన్ నెవర్. సమరమో? శాంతియో? తేల్చుకోవాలి . ఈ స్థితిలో శాంతిని కోరుకుంటే సిగ్గు,లజ్జా,మానం,పరువు,ప్రతిష్ఠ అన్ని బలి పెట్టి కేవలం తన నియోజక వర్గానికి పరిమితం కావల్సిందే.

సమరమే కోరుకుంటే.. వెంటనే ఓదార్పు యాత్రకు ముగింపు పలికి అదిష్ఠానానికి అల్టిమేటమ్ జారి చెయ్యాలి 48 గంటల్లో ఇందాక తన వర్గం పై తీసుకున్న అన్ని చర్యలను ( షో కాజ్, సస్పెండ్) వెనక్కి తీసుకోవాలి.లేకుంటే  మూకుమ్మడి రాజినామాలకు సిద్దమవుతామని ప్రకటించాలి.

ఇతర టి.వి.చేనళ్ళు,press Meet,  ప్రింట్ మీడియా, బ్లాగు,టివిటరు, ఫేస్ బుక్ ఏదైతేనేంఅదిష్ఠానాన్ని విమర్శనాస్థ్ర్రాలతో ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. అదిష్ఠానం దిగి రాకుంటే స్వంత కుంపటి పెట్టుకోవాలి.అదిష్ఠానాన్ని,కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ఠ్ర్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండ కట్టాలి.

శతృవుకు శతృవు మితృడన్న చందాన తెలుగు దేశం, భాజాపా మినహా  ప్రతి పక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలి ( వై.ఎస్. సంక్షేమ పథకాలకు కోతలు,తూట్లు) .

ఆంద్ర రాష్ఠ్ర్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ప్రజల అభిమానాన్ని చొరగొన్నవారు ఇద్దరే. ఒకరు ఎన్.టి.ఆర్ మరొకరు వై.ఎస్. ఆర్.అన్యాయం జరిగింది కూడ వారి వారసులకే జూనియర్ ఎన్.టి.ఆర్ ,హరి కృష్ణలకు ఆహ్వాణం పలకాలి. వరు స్పందించి వస్తే వారికి సముచిత స్థానం కల్పించాలి. వారు రాకున్నా సమస్య లేదు. ఎన్.టి.ఆర్ అసలు సిసలైన రాజకీయ వారసుడు వై.ఎస్. ఆరే అని గొంతెత్తి చాటాలి.

ఈ వ్యూహంతో ఎన్.టి.ఆర్ నినాదాలు ( తెలుగు గౌరవం, తెలుగు ప్రజల  ఆత్మాభిమానం వంటివి)  స్వంతమవుతాయి. పైగా చంద్రబాబు నాయకత్వంలో విసిగి పోయిన తె.దే.పా ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలు జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడుతుంది.

తెలంగాణా విషయం పై రాష్ఠ్ర్ర వ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చెయ్యొచ్చు. ప్రజలు కోరుకుంటే తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పాలి.

సాక్షి దినపత్రిక, సాక్షి టివి పై ఇవి జగన్ వి అన్న  ముద్ర పడిపోయింది కాబట్టి  తఠస్త వైఖరి గల దినపత్రిక,టివి నెలకొల్పాలి.లేదా కొనాలి. వాటిని ప్రజా ఆకాంక్షల మెరకు నడపాలి. కేవలం ప్రజా  పక్షం వహించి ప్రజల అభిమానాన్ని చొరగొనేలా చెయ్యాలి.

జీవితం చాలా కృరమైంది. దేనినైనా పొందాలంటే మరి దేనినో పోగొట్టుకోక తప్పదు. అన్నీ పొందాలంటే అన్నీ పోగొట్టుకోవడానికి సిద్దం కావాలి. నేనేది పోగొట్టుకోను కాని అన్నీ పొందాలని కాచుకు కూర్చుంటే చరిత్రహీనులుగా తయారవుతాం.

వై.ఎస్. పై వస్తున్న ఆరోపణల పై ధీటుగా స్పందించాలి. వై.ఎస్. పరిపాలనతో పాటుగా నాటి 9 సం.ల బాబు పరిపాలనై పై సైతం విచారణ కోరుతూ ఆందోళనలు చేపట్టాలి. వై.ఎస్. అవినీతి పరుడంటున్నారుగా , దానిని అదిష్ఠాణం సైతం మౌణమే అర్థాంగీకారం రీతిలో సమర్థిస్తూంది కాబట్టి అందరు రాజినామాలు చెయ్యండి. ప్రజా తీర్పు కోరండి అంటూ వత్తిడి తేవొచ్చు.

నాడు వై.ఎస్. రాష్ఠ్ర్ర ప్రజా దనాన్ని సోనియాకు దోచి పెడుతున్నారని చిరంజీవి ఆరోపించారు. కాని అతనిని రెడ్ కార్పెట్ పరచి మరి దిల్లికి పిలిపించి మంతనాలు నడుపుతున్నారే .. చిరంజీవి తమ ఆరోపణకు క్షమార్పణ కోరారా? లేక ఆయన ఆరోపణను మీరు అంగీకరిస్తున్నారా? అని నిల దీయాలి.

ప్రస్తుతం అసెంబ్లి ఎన్నికలు జరుగనున్న రాష్ఠ్ర్రాల్లోని ప్రతిపక్షాలతో అవగాహణ కుదుర్చుకుని అక్కడ కూడ కాంగ్రెస్ పార్టికి వ్యతిరేకంగా  ప్రచారం చేపడతానని ప్రకటించాలి.చెయ్యాలి.

ఒకే సమయంలో అన్ని దిక్కుల్లోనుండి ముష్ఠి గాతాలు కురిపిస్తే సోనియా తలలో జేజమ్మ దిగొస్తుంది. కాని ఎట్టి పరిస్థితిలోను పార్టిలో మళ్ళీ చేరకూడదు. ఎన్.సి.పి పంథాలో పొత్తులకైతే అభ్యంతరం లేదు.

3 comments:

  1. dnt worry u wil b the CEO cum chief editor for those new daily nd tv channeells.

    ReplyDelete
  2. Hi,
    Good Joke. I may be writing some useless things. But I am not that much useless fellow. As Jaganmohan Reddy is sound enough there are 1000s of useless fellows around him

    ReplyDelete
  3. As Jaganmohan Reddy is sound enough there are 1000s of useless fellows around him
    --లెస్సగా పలికితివి నాయనా.మరి మీరు పత్రిక+చానెల్ పెట్టమని సలహా ఇచ్చింది ఆ వెయ్యి మందిని తయారుచేసుకోమని చెప్పడానికా సారూ ...ఏమో నాకైతే మీరె ఆ పోస్టులకు తగినవారని నా అభిప్రాయం మరి.

    ReplyDelete