Monday, September 27, 2010

అత్తా కోడళ్ళ పోరు లైంగిక కారణాలు 2

1.కోడలి రాకతో అత్తమ్మ లైంగిక జీవితానికి తెరపడినట్టే.కనీశం భర్తతో  ఏకాంతం కూడ కల్లే మరీ మిడిల్ క్లాస్ కుటుంభ్హాల్లో నైతే  భర్త హాల్లో సర్దుకోవల్సింది ,తను ఏ స్టోర్ రూమ్లోనో తల దాచుకోవల్సిందే. తన బడ్ రూమ్ ఆక్రమించుకున్న కోడలి పై ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది?  వైవాహిక జీవిత ప్రారంభ దశలో రతిలో ఆర్గాజమ్ అన్నది సాధ్యం కాక పోయుండొచ్చు. ఆతర్వాత సంతానాలు,కుటుంభ భాధ్యతలు కారణంగా కొంత గ్యేప్ ఏర్పడి ఉండ వచ్చు. ప్రత్యక్ష సెక్స్  మీద పెద్దగా,ఆశ  కోరిక లేకున్నా జస్ట్ కొంత ఏకాంతం, కొంత కబుర్లు, కొంత ఫోర్ ప్లే కొరకు మనస్సు ఉవ్విళ్ళూరే సమయానికి కోడలి రాక ఈవిడలో అసహనాన్ని పుట్టించడంలో వింతేమి లేదు.

2.కోడలి రాకతో ఈవిడ పెద్దరికం నటించవలసి ఉంటుంది ( తన వయస్సు చిన్నదైనా)  నుదట బొట్టు సైజు పెద్దది చేసుకోవాలి, చీరల డిజైన్లు మార్చుకోవల్సి ఉండొచ్చు ( మరింత లైట్ కలర్స్, మరింత డమ్మి డిజైన్స్. మరీ పెళ్ళి జరిగిన వత్సరానికే కోడలు ఒక బిడ్డను కని పారేస్తే అత్తమ్మ కాస్త నాన్నమ్మ అయ్యి కూర్చోవాలి

3.మగవారి సైకాలజి ఏమంటే భార్య తప్ప ఏ స్త్ర్రీతోనైనా ఎంతో లిబరల్ గా , సృజణాత్మకంగా వ్యవహరిస్తారు. ఇదే ఫార్ములా మామ -కోడల విషయంలోను సాధ్యమే . తన విషయంలో కటువుగా ప్రవర్తించే భర్త కోడలి విషయంలో లిబరల్ గా ఉండటం చికాకు కల్గిస్తుంది

4.స్త్ర్రీ మరి దేనినైనా జీర్ణించుకో గలదు కాని తన వయస్సు పెరగడాన్ని మాత్రం జీర్ణించుకోదు. దీనికి కారణం లేక పోలేదు. తరతరాలుగా స్త్ర్రీ భర్త పైనే ఆధారపడి బర్తుకుతూంది. భర్తను లొంగ తీసుకోవాలంటే మరి తన అంద చందాలే సరైన అస్త్త్ర్రాలు. కోడలి రాకతో ఈవిడ ఫేడ్ అవుట్ అయిపోయే /ఈవిడకున్న ప్రాముఖ్యత తగ్గి పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమాజంలో స్త్ర్రీ ఒక భానిస. భర్తయొక్క నీడ. పరాన్న జీవిగానే కొన సాగుతూంది. ఒక భానిస ఎప్పుడు కూడ యజమాణి పై తిరుగుభాటు చెయ్యడు.అతని పోటి సాటి భానిసతోనే ఉంటుంది. తార్కికంగా ఆలోచిస్తే తన భర్త పట్టు సడలి పోతున్న తరుణంలో , కొడుకు కొత్తగా వచ్చిన భార్య మీద మోజులో ఉన్నప్పుడే సాటి భానిసను అప్రమత్తం చేసి,ఆవిడతో కలిసి హక్కుల కోసం పోరాడాలి. కాని అలా జరగక పోవడానికి కారణం వారి పెంపకం,ఎన్విరాన్మెంట్, మీడియా,సినిమా,టివిసీరియళ్ళు ఇలా ఎన్నో కారణాలున్నాయి.


(సశేషం)

No comments:

Post a Comment