Thursday, September 30, 2010

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2
సాధారణంగా ప్రతి ఒక్కరు భావించేదేమంటే ఆథ్యాత్మికం , సెక్స్ పరస్పర వైరుధ్యము గల అంశాలని .నిజానికి ఇవి మానవుడ్ని ఉన్నత శిఖరాలకు చేర్చే , కనీశం జంతు స్థాయికి దిగజారిపోక చూసే మెట్లే. అవును మరి. మనిషి
తలచుకుంటే దేవుడు కాగలడు. లేదా జంతు స్థాయికి దిగ జారగలడు. ఈ రెండింటిని నిర్ణయించేది సెక్స్ పట్ల అతనుకున్న దృక్పథమే.

ఒక వేళ అతను సెక్స్ అంటే నేరమని, పాపమని, ఆయువును తగ్గిస్తుందని, శక్తి హీనుడుగా మారుస్తుందని , మాయలో పడవేస్తుందని ఇలా రక రకాలుగా భావించి తనలోని కామవాంచను అనగత్రొక్క చూస్తే ఏదో రోజున అతనిలో చాలా కాలంగా భంధించి ఉంచిన జంతువు సంకేళ్ళను తెంపుకుని భయిటకొచ్చి స్వైరవిహారం చేస్తుంది.

అలా కాక యాంత్రికంగా సెక్సును అనుభవిస్తూ , దానికే భానిసై పోయినా అతను జంతు మాత్రంగా మిగిలి పోతాడు. బుద్దుడు చెబుతాడు. సత్యం ఆ కోశాన లేదు, ఈ కోశానా లేదు. అది మద్యలో ఉంది. విడ మరచి చెప్పాలంటే జీవన వికాశం సెక్సులోను లేదు, బ్రహ్మచర్యంలోను లేదు.

బ్రహ్మచర్యం మనిషిని సెక్సుకు సిద్దం చేస్తుంది. లోడడ్ పిస్టల్ గా మారుస్తుంది. ట్రిగ్గర్ మీద చెయ్యి తగిలితే ప్రేలి పోతాడు. అలాగే సెక్సు బ్రహ్మచర్యానికి సిద్దం చేస్తుంది. అంటే మరో సారి సెక్సులో పాల్గొనే శక్తిని పుంజుకునేంత వరకు.

ఈ చట్రంలో తగులుకుంటే మనిషి కేవలం జంతువులాగే జీవించ వలసి వస్తుంది.  దీంతో మనిషి సెక్సు మీద చిన్న చూపు, బ్రహ్మచర్యమంటే గొప్పా అనే నిర్ణయానికొస్తాడు.   ఇటువంటి వారే సమాజాన్ని ముఖ్యంగా యువతరాన్ని తప్పు ద్రోవ పట్టించి సెక్స్ పట్ల అపరాధ భావాన్ని పెంపొందించారు. మానవశరీరం, సెక్సు  ఆథ్యాత్మికతకు అడ్డని భావించి ఎన్నో ఆంక్షలు విధించేరు.

ఓషో చెబుతారు. మానవ శరీరం అతనికి ఒక శతృవు కాదు. మితృడు కాదు.అదో పరికరం. కాని మానవ నైజం ఎట్టిదంటే ప్రతి దానిని వారు తమ నాశనం కోసమే వినియోగిస్తుంటారు. ఇది కేవలం తెలియని తనమే. ప్రేమ,దేశ భక్తి,దైవ భక్తి ఏదైనా మరి దేనినైనా తమ సర్వ నాశనానికి వినియోగించుకోవడంలో మానవులను మించిన జీవరాశులు  భూ ప్రపంచం మీద లేవు. అలానే సెక్సును సైతం తమ నాశనానికే వినియోగించేరు.  అత్యుత్సాహంతో చితికిన పడి సెక్సును దాదాపుగా నిషేదించేరు.

 నీళ్ళకు సంభందించి ఒక రూల్ ఉంది. నీటిని అదిమి దానిని పరిమానాన్ని తగ్గించలేము.దీనిని బాస్కలిన్ రూల్ అంటారు. కామవాంచ కూడ అటువంటిదే. భూమిలోనైతే విత్తనం వేస్తే/పడితే అది వృక్షమై ఫలితాన్నిస్తుంది. బొగ్గు సైతం వజ్రంగా పరిణితి చెంద కలదు. కాని మానవ మస్తిష్కంలో కామ వాంచను పాతి పెడితే అది హింసా ప్రవృత్తిగా పరిణితి చెంది భయిటపడుతుంది.

ఇక్కడ ఒక నిగూఢ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. ఈ జీవరాశులన్నింటికి మూలం ఏక కణ జీవి అయిన అమీబా. అది బలిసి సెల్ కాపియింగ్ ద్వారా రెండుగా విడిపడింది.  ఈ క్రమంలో కాపియింగ్ లో తారాసపడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు పుట్టుకొచ్చాయి. కోతి వచ్చింది. కోతినుండి మానవుడు వచ్చాడు.

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు కాలం,దూరం, అబధ్రత, సమాచార లోపం వంటి ఏ సమస్యా లేదు. ఈ తియ్యని స్మృత్లులు సెల్ కాపియింగ్ ద్వారా  సెల్ టు సెల్ కాపి అయ్యి  ప్రస్తుతం మానవ మస్తిష్కంలోను ఆ స్మృతులు ఉన్నాయి.

సాటి జీవరాశులతో మమేకం అయితే కాని తమలోని అబధ్రత పోదన్న తలంపు ప్రతి మానవుని మస్తిష్కపు పొరల్లోను దాగి ఉంది. అయితే ఇక్కడ చిన్న పొరభాటు జరిగి పోయింది . ఒకే ప్రాణం, ఒకే శరీరంగా ఉన్న తాము విడి పడడానికి, ఏకం కాలేక పోతుండటానికి  తమ శరీరాలే కారణం అన్న పోహ మనుషుల్లో వచ్చింది.

సైకాలజి చెప్పేదేమంటే " ప్రతి మానవుడు ఏం చేసినా ఆ చర్యకు అతనిని ప్రేరేపించేవి రెండే వాంచలు ఒకటి చంపటం, మరొకటి చావడం"

ఈ వాంచల గంగోద్రి ఏదో సైకాలజి చెప్పలేదు. దాని పని కూడా కాదది. అయితే యాధృచికంగా ఈ జిష్ఠును నేను పట్టుకో కలిగాను.  చావడం చంపడం దేనికి? శరీరాలను రాల్చుకోవడానికి ! శరీరాలను త్యజించాలనుకోవడం దేనికి?
శరీరాలు లేకుంటే  ఆత్మ స్వరూపంతో సాటి జీవ రాశులతో మమేకం  కావడం సులభతరమన్న భావం.

మాంసాహారం పై ప్రీతి, భరువు తగ్గించుకోవాలన్న ఆకాంక్ష అందుకోసం ప్రాణాల మీదికి తెచ్చుకునే దుస్సాహసం ఇవన్నింటికి కారణం కూడా చావడం, లేదా చంపడం పై ఉన్న జిలే. మరి దీనికి సెక్సుకి ఏమిటి సంబంధం అంటారా? ఉంది.

పురుషుని కోణంలో:
వీర్య స్కలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చచ్చే కోరిక నెరవేరుతుంది
స్త్ర్రీ కోణంలో:
పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే  కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చంపే  కోరిక నెరవేరుతుంది

చచ్చే చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సులోనే సుసాథ్యం కాబట్టె మానవులకు సెక్సు పట్ల ఇంత మక్కువ ఏర్పడింది.

బుల్లి మరణం:
పైగా స్త్ర్రీ పురుషులు ఇరువురు మెళకువతో, ప్రజ్నతో, నేర్పుతో, చైతన్యంతో సెక్సులో పాల్గొంటే ఇద్దరికి ఏక కాలంలో ఆర్గాజం ( భావ ప్రాప్తి) కలిగే అవకాశం ఉంటుంది. భావ ప్రాప్తి కలిగినప్పుడు కాలం తెలీని స్థితి ఏర్పడుతుంది.శరీరం, మనస్సు, భుద్ది అన్నీ స్విట్చ్ ఆఫ్ అవుతాయి. వీటికి అధనంగా తనకేదో మరో రూపం, వేవ్ లెంగ్త్ ఉందనే భావం మనిషిలో ఏర్పడుతుంది. ఈ స్థితిని ఆంగ్లంలో బ్లాక్ అవుట్ అంటారు. కాని నేను దీనిని బుల్లి మరణమనై వ్యవహరించ దలచాను.

ఈ బుల్లి మరణం యోగంలో కలిగే సమాధికి ట్రెయిలర్ వంటిది.ట్రెయిలరే చూడలేని వాడు సినిమా ఎలా చూడ గలడు. అందుకే  ఆథ్యాత్మికం వయా సెక్స్ అని పేర్కొన్నాను. సెక్సునుండి సమాధి అనేది వేరే స్కూలు. ఇది తాంత్రికానికి సంభంధించింది. ఇది సామాన్యులకు అసాధ్యం. కాని ఈ టపాలో నేను పేర్కొన్న ఆథ్యాత్మికం వయా సెక్స్ అందరికి సుసాధ్యం. దానిని ఎలా సాధ్యం చేసుకోవాలో తదుపరి టాపాల్లో వివరిస్తాను.

జీవరాశుతర తరాలుగా 

No comments:

Post a Comment