Saturday, September 18, 2010

తమిళ బ్లాగ్ లోకంలో టాపర్ గా నా అనుభవాలు

2009 మే తరువాత మాలిక ద్వార తెలుగు పాఠకులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రపంచమే కాదు బ్లాగ్ ప్రపంచం కూడ కేవలం సక్సెస్ అయిన వారి మాటలకే ప్రాధన్యమిస్తుంది. అందుకే ఇలాంటి టైటిల్ పెట్టవలసి వచ్చింది. నిజానికి తెలుగులో  (http://www.blaagu.com/swamy7867) నెను అట్టర్ ప్లాఫ్ అయినవాడ్ని. ఇంతకీ 2008 నవంబరు నుండి 2009 మే లోపు 25,000 హిట్స్ సాధించాను. అయినా కొన్ని ప్రత్యేక కారణాల వలన నా బ్లాగు నిరాధారణకే కాక నిషేదానికి కూడ గురైంది. ఓటమి గాథ పక్కన పెట్టి విజయగాథ వినిపిస్తాను



2000 సం. జూలై 31 న కవిదై07 పేరుతో ఒక బ్లాగ్ ప్రారంభించాను. అప్పట్లో తేనె గూడు, తమిళ్ మనం తప్ప మరో అగ్రగేటర్ లేని రోజులవి. పైగా నాకు తమిళంలో టైప్ చెయ్యడం కూడ రాదు. అందిమళై సైట్ ద్వారా ఈ విద్య అలవరచుకున్నాను. కొద్ది కొద్దిగా టైప్ చెయ్యడంలో ప్రవీణ్యత ఏర్పడింది. అయితే సైట్ మీటర్ గురించిగాని అలెక్సా వంటి సైట్ ఇన్ఫర్మేషన్ సైట్స్ గురించి కాని ఏమీ తెలియదు. బ్లాగ్లో వచ్చే ప్రొఫైల్ వ్యూస్ మాత్రమే ఫాలో అయ్యేవాడ్ని. 2000 సం. జూలై 31 నుండి 2008 నవంబరుదాక వచ్చిన ప్రొఫైల్ వ్యూస్ కేవలం 2061 మాత్రమే. దీంతో విసిగి తెలుగు బ్లాగ్లోకం పక్క వాలాను. అయితే అదీ విషాదాంతమే అయ్యింది.



ఇక విధిలేక మళ్ళీ తమిళ బ్లాగ్లోకం వైపు తొంగి చూసాను. అది పెనుమార్పులు చోటు చేసుకుని కళ కళలాడుతుండే. ఒక డజనుకు మించిన సంఖ్యలో అగ్రగేటర్స్ ఉన్నారు. ప్రతి నెలకో కొత్త అగ్రగేటర్ వస్తున్నారు. అగ్రగేటర్స్ పై ఆధార పడవలసిన పరిస్తితి బ్లాగర్లకు లేదు కాని బ్లాగర్ల మీద ఆధారపడే పరిసిథితిలో అగ్రగేటర్స్ ఉన్నారు.



ఎంతగా విసిగి వాక్ అవుట్ చేసానో అంతగా వేసారి వెను తిరిగాను. కాని పరిస్థితిలోని మార్పుల కారణంగా నూతనోత్సాహంతో బరిలోకి దిగాను. తొలూత పెద్ద్ద ఆశలు లేక పోయినా ఆక్సిడెంటల్ గా ఓ సారి టమిళ టెన్ వారి రేంక్ లిస్టులో నెంబర్ వన్ గా తేలాను. దీంతో నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి.



నా విజయానికి జ్యోతిష్యం ,సెక్స్ బాగా దోహద పడ్డాయి. అయితే నేను సరసమైన కథలు వ్రాయడం అలవరచుకోలేదు. చెప్ప కూడని జోకులు వాటి వెనుక ఉన్న సైకాలజి అన్న శీర్షికతో ఒక సీరియల్ మొదలు పెట్టాను. ఒక అడల్ట్ జోకు - దానిని రూపొందించినవాడి సైకాలజి, చెప్పేవాని సైకాలజి, వినేవారి సైకాలజి, విని అసహించుకునే వారి సైకాలజి, విని ఆనందించే వారి సైకాలజి అంటూ అనలిటికల్ గా వ్రాసాను. ఎజుకేటివ్ గా వ్రాసాను. మంచి ఆధరణ ఎదురైంది.



కొన్నాళ్ళ తరువాత అక్రమ సంభంధాల మీదికి నా దృష్ఠి మళ్ళింది. అక్రమ సంభంధాలు X కర్మ సిద్దాంతం శీర్షికన ఒక సీరియల్. తదుపరి సెక్స్ & జ్యోతిషం , సెక్స్ & వాస్తు శీర్షికలతో సీరియల్ వ్రాసాను. ఇటీవల వైవాహిక జీవితం పై ఒక సీరియల్ వ్రాస్తున్నాను.



తెలుగు పాఠకులు నన్నాధరిస్తే ఇవే విషయలను ఇంకా పదును పెట్టి ,మరింత ఎజుకేటివ్ గా వ్రాయడానికి నేను రెడీ. మీరు రెడియా?

No comments:

Post a Comment