Monday, September 27, 2010

శరీర దానం చేస్తే తదుపరి జన్మలో అంగ వైకల్యం?

శరీర దానం చేస్తే తదుపరి జన్మలో అంగ వైకల్యం వస్తుంది అని ఓ వింత ప్రచారం మొదలైంది. ఏ మొదర్నష్ఠపోడు దీనిని మొదలు పెట్టాడో కాని ,ఇది బాగానే ప్రాకి పోతుంది. మొన్న చిత్త్రు బ్లడ్ బ్యాంక్ నుండి ఫోనొచ్చింది " మీరు రెగులర్  వాలంటరి బ్లడ్ డోనర్ కదా.. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో రక్తమే లేదండి.మీరేమైనా వస్తారా?"

దీనిని ఇక్కడ నేను ప్రస్తావించడం కేవలం బ్లడ్ దొరకడమే ఇంత కష్ఠంగా ఉంటే , రక్త ధాతలే అరుదుగా ఉంటే ఇక శరీర భాగాలని దానం చేసే వారు ఎంత అరుదుగా ఉంటారో నొక్కి చెప్పడానికే.

ఈ దుస్థితిలో శరీర దానం చేస్తే తదుపరి జన్మలో అంగ వైకల్యం వస్తుంది అని ప్రచారం చేసే మూర్ఖులను ఏమనాలి? మన దేశంలో కొత్త వస్తువులు కనుక్కుంటారో లేదో గాని ఇటువంటి సొల్లు సెంటిమెంట్స్ కనుక్కోవడంలో మాత్రం దిట్టలున్నారు.

అసలు మతం,ఆథ్యాత్మికంలో శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. శరీరం అన్నది కేవలం కాటన్ షర్ట్ లేదా జీన్స్ ప్యేంట్ వంటిది. ఆత్మకే ఎనలేని ప్రాముఖ్యత. దానినే నేడు చాలమణిలో ఉన్న తప్పుల తడకగా ఉన్న , వక్రీకరించబడిన , ఎవరో బ్రాహ్మణ మేధావి ప్రజల మీదికి వదిలిన  కలుషిత భగవద్గీతలో సైతం ఆత్మ తడవదు, ఎండదు అనే చెప్ప బడి ఉంది.

ప్రతి మతం త్యాగానికి పెద్ద పీఠ వేస్తూంది. ఇక బతకడు, బతికినా రెఫ్రిజిరేటర్లో కేబేజిలా ఉండి పోవల్సిందే అన్న స్థితిలోనే శరీర దానం చేయబడుతుంది/స్వీకరించబడుతూంది. బక్త కన్నప్ప బతికుండగానే తన కళ్ళను కాళహస్తీశ్వరునికి సమర్పించాడన్నది ప్రురాణం.

శివుడు బైరాగి అవతారుడై భోజనానికి వచ్చి తన కొడుకును నరికి వండి పెట్టమన్నా వెనుకాడని భక్తుల గాదలు హిందూ పురాణాల్లో లభ్యం.

అటువంటిది శరీర దానానికి ఇటువంటి ఫిటింగ్ పెట్టడం ఎంతటి మూఢత్వమో మీరే ఆలోచించండి.

హిందూ మతంలో "పునరభి జననం పునరభి మరణం " అంటారు. అంటే  జనన మరణాలు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయని అర్థం. అలానే మన మతంలో   కర్మ సిద్దాంతం పై విశ్వాసం  భలంగా ఉంది. ఈ జన్మలో చేసిన పాప,పుణ్యాలకు ప్రతిఫలం తదుపరి జన్మలో లభిస్తుందని భావించటం.

అవే విశ్వాసాలు చెప్పటం ఏమంటే పాపాత్ములే అల్పాయువులో,దుర్మరణం పాలవుతారు.
( కొన్ని కేసుల్లో ఏ కొద్దిపాటి కర్మ మాత్రం బాకీ ఉంటే ఆ కర్మలు తీరేంత వరకు  కొంత కాలమే జీవించి వెళ్తారని కూడ చెబుతారు)

ఎటు చూసినా మరణానికి చేరువలో ఉన్నప్పుడు, ఇక బతకడం కల్లేనన్నప్పుడు  వారి శరీర భాగాలను దానం చెయ్యడమే వారి పుణ్యలోక యానానికి కాని,  ఆథ్యాత్మికాభివృద్దికి కాని, తదుపరి జన్మలోని అవకాశాలకు కాని  దోహద పడ్తుంది.

అలా కాక శరీర దానం చేస్తే తదుపరి జన్మలో అంగ వైకల్యం సంక్రమిస్తుందనడం మూర్ఖత్వం, మూఢత్వం, అధర్మం, అహేతుకం, నాస్తికం.

No comments:

Post a Comment