Wednesday, October 7, 2009

రూ.కోటితో వరద బాధితులకు నిధి - జగన్

మొన్న మొన్న రూ.20 లక్షలు వరద బాధితులకు తక్షణ సాయంగా సి.ఎం. సహాయ నిధికి ఇచ్చిన జగన్ ఈ రోజు ఒక కోటి రూపాయలతో వరద బాధితులకు నిధి ఏర్పాటు చేసారు. ఇందుకు సాక్ష్ గ్రూప్ ఉధ్యోగులు తమ ఒక రోజు వేతనన్ని ఇవ్వటం తో ఇది కోటి ఎనభై వేలకు చేరింది. నేనిది వరకే ఒక టపాలో పేర్కొన్నాను "జగన్ ! మీరు కేవలం కడప ఎం.పి.కాదు భావి ముఖ్యమంత్రి" అని గుర్తుచేసిన సంగతి విదితమే.

నా టపా చూసి అని కాకుండా నా ఆలోచనా తరంగాలు వై.ఎస్. ఆత్మ ద్వారా జగన్ బాబుకు చేరినట్టుందనే భావిస్తా. కీప్ ఇట్ అప్ జగన్ ! హేట్స్ ఆఫ్ !

ఈ నేపద్యంలో సి.ఎం.గా రోసయ్య పరిపాలన పై పట్టు సాధించాలని కక్రుతి పడో ఏమో కొన్ని కీలక మార్పు చేర్పులకు ఉపక్రమించారు. ( డి.జి.పి.బదిలి గురించి కాదు నా ప్రస్తావన. అది దాదాపుగా వై.ఎస్. నిర్ణయమే.దానిని రోసయ్య అమలు చేసారంతే) నేను సూచిస్తున్నది మంత్రి వర్గ విస్తరణ.

పాపం రోసయ్య ! చంద్రగుపుతుడైతే కొంత ఓపిక చేసుకుంటే చానక్యుడు కాగలడేమో గాని చానక్యుడు చంద్ర గుప్తుడు కావాలనుకోవడం ఉత్త కలే. అది కాంగ్రెస్ పార్టికి పీడ కల కాకూడదని ఆశిస్తాం.

సభాష్ కే.సి.ఆర్ :
కే.సి.ఆర్ గతంలో తలకు మాసిన ప్రకటనలు ఎన్ని చేసి ఉన్నప్పటికి దిల్లిలో నేడు చేసిన ప్రకటన ఒక రాజకీయ మలుపు. శాసన సభను సమావేశపరచాలని కోరారు. కీప్ ఇట్ అప్ కె.సి.ఆర్

No comments:

Post a Comment