Monday, October 12, 2009

NTR చరిత్రను వక్రీకరించిన మహా టి.వి

Yes .పుట్ట గొడుగుల్లా టి.వి.చేనల్స్ రావడంతో మీడియా రంగంలో అర్హులకు మెగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మహా టి.వి. వంటి బోని కాని చేనల్స్ దొరికిన వారితో ఎలాగో అలా నెట్టుకొస్తున్నట్టనిపిస్తుంది. షిట్. నేను అంటూ ఒక సీరియల్. ఇందులో ప్రముఖులను అన్ని కోణాల్లోనుండి చూపిస్తారట. నా గ్రహం భాగా లేక ఈ రోజు ఇప్పుడే తగులుకుని భయిట పడి వచ్చాను.
రావణేశ్వరుడు లేని రామాయనం ఎప్పుడైనా చూసారా ? శుయోధనుడూ లేని భారతం ఎప్పుడన్నా చూసారా? నేను చంద్రబాబు గురించిన ప్రస్తావనే లేని ఎన్.తి.ఆర్ జీవితాన్ని చూసా. నేను ఎన్.టి.ఆర్ వీరాభిమానినే కావచ్చు కాని ఆయనలోని లోపాలేమిటో నాకు తెలుసు. వాటిని భహిరంగంగా అంగీకరిస్తాను కూడ. కాని పై కార్యక్రమంలో జె.పి.ఎన్.టి.ఆర్ పై చేసిన విమర్శలకు ఎంతగా చిర్రెత్తిందంటే అంతగా చిర్రెత్తింది. అతనో బ్యూరాక్రెట్ మాత్రమే . తను ఎం.ఎల్.ఏ గా గెలిచి ఉండొంచ్చునుగాక . అయినా అది కేవలం ఒక స్వచ్చంద సేవా సంస్థ మాత్రమే .

త్లుగు విశ్వ విద్యాలయానికి ఎన్.టి.ఆరె చేన్సలరుగా కొనసాగారన్నది నిజంగా నాకు వార్తే అందుకు మహా టివి కి కృతజ్ఞతలు. అయితే చంద్రబాబు వెన్ను పోటుకు ఎన్.టి.ఆర్ లోని "నేను" కౄంగి కృశించి పోయినట్టు, అదంటూ ,ఇదంటూ వ్యాఖ్యాణాలు ఎంత సత్య దూరమంటే వంటి మీద మంటలు పుట్టాయి. ఎన్.టి.ఆర్ పదవీచ్యుతుడయ్యాడంటే అందుకు కారణం మన రాజ్యాంగం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించి ఉండటమే. అతనికి పార్టి పేరు, సింబల్ లభించక పోవడానికి కారణం మన న్యాయ వ్యవస్థలోని లొసుగులు మాత్రమే. ఏ పేరుతో పిలించినా రోజా రోజాయే . ఆవిదంగా ఎన్.టి.ఆర్ ఏ పేరుతో పార్టి పెట్టినా అది నెగ్గి తీరాల్సిందే. ఏ సింబల్ మీద పోటి చేసిన గెలిచి తీరవలసిందే .

ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ పక్షాన లేనిది కేవలం ఎం.ఎల్.ఏ లు మాత్రమే. ప్రజలు ఎప్పుడూ అయన పక్షమే. నల్ల దుస్తులు దరించి చైతన్య రథం ఎక్కిన ఎన్.టి.ఆర్ ఎక్కడ ? చంద్రబాబ్య్ నక్క జిత్తులను భట్ట బయిలు చేసిన ఎన్.టి.ఆర్ సిమ్హ గర్జణ ఎక్కడ ?
రాజ కీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్.ఆర్ .చేత సైతం జేజేలు కొట్టించుకున్న అంశం ఎక్కడ ? చచ్చి ఏ లోకాన ఉన్నా నేటికి రైతులకు ఉచిత విద్యుత్, రెండు రూపాయలకే కిలో భియ్యం , మహిళలకు పావలా వడ్డి రుణాలంటూ రాష్ఠ్ర రాజకీయాన్ని, పరిపాలనా వ్యవస్థను ప్రభావితం చేస్తున్న వైనం ఎక్కడ.
షిట్ !
ఇప్పటికైనా మహా టివి నేను ప్రస్తావించిన అంశాలను కలిపి సతరు కార్య క్రమాన్ని పున; ప్రసారాం చెయ్యాలి

No comments:

Post a Comment