Tuesday, October 6, 2009

జగన్ జూనియర్ ఎన్.టి.ఆర్ చేతులు కలపాలి

వై.ఎస్.ఆర్ ఎన్.టి.ఆర్ అభిమానులారా ఏకం కండి
తెలుగుదేసం పార్టి వరద బాధితుల కొరకు నిధులు శేకరిస్తున్నప్పటికి జూనియర్ ఎన్.టి.ఆర్ సూటిగా సి.ఎం.ను కలిసి రూ.20 లక్షల విరాళాన్ని సి.ఎం.సహాయ నిధికి ఇవ్వడం విదితమే. మరి ముందుగా వై.ఎస్. మితృలు కే.వి.పి రామచంద్ర రావు గారిని కలవడం మరింత ఉత్కంఠతను చెల రేపింది.

ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ఒకటే :
వై.ఎస్.ఆర్ నటుడు కానప్పటికి , ఎన్.టి.ఆర్ డాక్టర్ కానప్పటికి మానవీయ పరిపాలన, మానవీయ సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో ఇరువురు ఒక్కటే. మరీ రెండు రూపాయల్కే కిలో భియ్యం పథకం తో వై.ఎస్.ఆర్ తనే ఎన్.టి.ఆర్ అసలు సిసలైన రాజకీయ వారసులని నిరూపించుకున్నారు.

మహిళల పట్ల, రైతుల పట్ల , సేద్యపు నీటి కొరత పరిష్కారం పట్ల ఇద్దరికున్న చిత్త శుద్ది జగత్ ప్రసిద్దం. ఒకరు జాతీయ పార్టి, మరొకరు రాష్ఠ్ర పార్టి సి.ఎం.గా ఉన్నప్పటికి వై.ఎస్.ఆర్ ఎన్.టి.ఆరుకు సమానమైన స్వేచ్చను జాతీయ పార్టిలో సైతం అనుభవించారు. దానిని ప్రజా సంక్షేమం కొరకే వినియోగించారు.
మరో విషయంలో సైతం ఇద్దరికి పోలిక ఉంది. అదేమంటే ఇరువురుఇ వారసులకి న్యాయం జరుగలేదు. ఎన్.టి.ఆర్ లక్ష్యాలకు చంద్రబాబు గండి కొట్టినట్టే ఇప్పటి రోసయ్య ప్రభుత్వం వై.ఎస్. పథకాలను తుంగలో తొక్కడం ఖాయం. అటు ఎన్.టి.ఆర్ /వై.ఎస్.ఆర్ అనే ఇద్దరు కారణ జన్ములు ఇటు జగన్ , జూనియర్ ఎన్.టి.ఆర్ ఉత్సాహ వంతులైన, శక్తిమంతమైన యువ కిశోరాలు. ఈ రెండు శక్తులు కలవాలి. రాష్ఠ్ర ఆత్మ గౌరవాన్ని సమ్రక్షించాలి. సోనియా రాష్ఠ్ర ఎం.ఎల్.ఏ లను ఎల్.కె.జి. బాల బాలికల్లా దలచి నియంత్రించాలని చూస్తున్నారు.

ఇదే సరైన సందర్భం జగన్ జూనియర్ ఎన్.టి.ఆర్ తో చేతులు కలపాలి. వై.ఎస్.ఆర్. ఎన్.టి.ఆర్ ఆశయాలపై విశ్వాసం ఉన్న ఎం.ఎల్.ఏ ల భలాన్ని (Both in TDP & Congress)కూడ కట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి

No comments:

Post a Comment