Wednesday, October 21, 2009

వై.ఎస్.అమర్ రహే !

మానవుడు అడవులను వదిలి ,సంచార జీవితం గడిపి ,ఆ పై స్థిరవాసం గైకొన్నాడు. అక్కడికి పరిపాలన వ్యవస్థ యొక్క అవసరం వచ్చింది. నాటికి నేటికి ఎన్నో పరిపాలనా వ్యవస్థలు వచ్చాయి. ఆధునిక మానవుడు ప్రజాస్వామ్యాన్ని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థగా గుర్తించాడు. రాజరికం , అరిస్టోక్రసి (మేధావుల గ్రూపు పరిపాలిస్తూంది) నియంత్రుత్వం ,సైన్యాధికారం ఇలా ఎన్నో వ్యవస్థలు చరిత్ర పుటల్లో కనిపిస్తాయి.

అది ఏ వ్యవస్థ అయినప్పటికి పాలకుడు/పాలకులు సామాన్యుల గోడు పట్టించుకుని ప్రతి పౌరునికి ప్రాణ రక్షణ, కూడు గుడ్డ, గూడులను అందించాలి. ప్రజలు స్స్వావలంభణతో గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా వ్యవసాయ,పరిశ్రమ రంగాలను , సదరు రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. అప్పుడే సమగ్రాభివృద్ది సాధ్యం. ఇవన్ని సాధ్యం చేసిన పాలకుడు రాజైనా, భంటైనా ( భంటులు కూడ పరిపాలించినారు .ఒట్టు !) కమేండరైనా, మేధావి అయినా, నియంత అయినా ,ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన నేత అయినా సరే చరిత్రలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖింప పడుతుంది.

అలా రాష్ఠ్రాభివృద్దికి ,రాష్ఠ్ర ప్రజల అభ్యున్నతికి పాటు పడిన నేత డా.వై.ఎస్.ఆర్. అందుకే ఆయన పేరు రాష్ఠ్ర రాజకీయ చరిత్రలోనేకాక ,దేశ ,ప్రపంచ రాజకీయ చరిత్రలోకెక్కింది. సుస్థిర స్థానం సంపాదించుకుంది. సరే ! వై.ఎస్. అమరులయ్యాక ఆయనగారి జీవిత చరిత్రను రచించడం ఏల ? ముద్రించడం ఏల ? దీంతో సమాజానికి ఏం లాభం అని కొందరు ప్రశ్నించవచ్చు.

ఈ బూమి పైకి వచ్చినప్పుడు మానవుడు ఎంతో పవిత్రతతో, స్వార్థం, కల్లా కపటాలకు ఏ మాత్రం తావు లేని వాడుగా ఉంటాడు. అతనలా పెరుగుతుంటే సమాజంలోని కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వంటివి అతనిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. కాని యవ్వనంలో తనలో ఉరకలేసే శక్తి కారణంగా ఏ మాత్రం అభద్రతా భావానికి గురికాక, సమాజంలో తాను చూసే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలను ఎండ కదుతుంటాడు. వ్యతిరేకిస్తాడు. పోరాడుతాడు. కాని యవ్వనం కరిగి పోతుంటే ,శక్తి తరిగి పోతుంటే తాను వ్యతిరేకించి పోరాడిన కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలకు లొంగి పోతాడు. (కొందరు యవ్వనంలోనే వీటికి లొంగి పోవచ్చు వీరు శ్రీ శ్రీ పేర్కొన్న పుట్టుకతో వృద్దులు )

ఈ సమయంలో యువత ఇదివరకే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వీడి తనవారికి కోసంసర్వస్వము అర్పించే వాడే అసలైన కథానాయకుడు అన్న నిర్వచనానికి ప్రాణం పోసి,ప్రజా సేవకే అంకితమై ,కారణ జనుములుగా, చారిత్రిక పురుషులుగా చరిత్రలో నిలిచి పోయిన మహానుభావుల చరిత్రలను అద్యయనం చెయ్యాలి. వారిలో ఏ ఒకరినైన తమ ఆదర్శ పురుషులుగా వరించుకుంటే వారి మనోభలం ఇరుముడిస్తుంది. దీంతో యువత మాతృ భూమి, మాతృ భాషల ,పేద బడుగు వర్గాల ,పరిరక్షణకు నడుంకట్టే వీలు దొరుకుతుంది. "మనుషులు రుషులై ఎదగాలంటే పుణ్య చరితలే ఆధారం."

"మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ.
పట్టుదలే ఉంటే కాగలడు మరో భ్రహ్మ "

అటువంటి పట్ట్దుదలను ఇవ్వగల పుణ్య చరత్ర డా.వై.ఎస్.గారిది. కేవలం బాంబులకే ప్రఖ్యాతి గాంచిందన్న అపఖ్యాతికి గురైన మాతృభూమిని యావత్ ప్రపంచమే కీర్తించే విదంగా చేసిన డా.వై.ఎస్. జీవిత చరిత్ర యువతకు ఆదర్శంగా , స్ఫూర్తి దాయికంగా ఉంటుంది అన్న ప్రగాడ విశ్వాసంతో ఈ చిన్ని గ్రంథాన్ని చిత్తూరు పట్టణ వ్యాపరస్తులు, కాంగ్రెస్ పార్టి ప్రముఖులు, రాజకీయ క్రికేట్లో ఫోర్ కొట్టిన బహదూర్ శ్రీ. సి.కె.బాబు గారి అభిమానుల సహకారంతో ఇండియన్ పొలిటికల్ క్లోసప్ తెలుగు పక్ష పత్రిక విడుదల చేస్తుంది. ప్రతి యువత వై.ఎస్.జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వై.ఎస్. పెంపకంలో ఆయన నేర్పి , నూరి పోసిన నిస్వార్థం, కర్తవ్య నిర్వహణ, త్యాగం, విశ్వసనీయత, మానవీయత ,ప్రజా సేవలతో వై.ఎస్.ప్రతిరూపంగా మన మద్య ఉన్న వై.ఎస్. తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని భలపరచాలని కోరుతున్నాను.

ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్ ,
ఎడిటర్,

No comments:

Post a Comment