Thursday, October 29, 2009

కొండా సురేఖా రాజినామా ఆదిష్ఠానానికి చెంపపెట్టు


అవును రాష్ఠ్ర మంత్రి కొండా సురేఖా తమ రాజినామాను ఏకంగా గవర్నరుకు సమర్పించారు.
వై.ఎస్. మరణానంతరం చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో సురేఖ ఇదివరకే రోశయ్య అనాయకత్వంలో ఇమడలేనని చెప్పిన మాట వాస్తవమే. కాని జగన్ సోనియా భేటి అనంతరం కాస్త మనస్సు గట్టి చేసుకుని మరి ఉన్న సురేఖను మీడియా రెచ్చ కొట్టిందిమాట మార్చిన సురేఖా అని హెడ్డింగులు పెట్టి మరి వ్రాసారు. డా.వై.ఎస్. ఉన్నంత కాలం ఆయన మోచేతి నీరు త్రాగి బ్రతికిన వారు నేడు తమ స్వంత భలంతో నెగ్గామని బీర వచనాలు పలుకుతుంటే సురేఖవంటి సునిత మనస్కురాలు ఎంత బాధ పడి ఉందేదో మనమే ఊహించుకోవచ్చు.

స్త్రీ మూర్తిలోని త్యాగం, అమ్మతనమే మూర్తిభవించిన సురేఖ రాజకీయంగా వదులుకున్నది ఒక్క పదవే కావచ్చు. కాని తఠస్థులు సైతం ఆమె త్యాగానికి తలవంచక తప్పదు.

ఒక మనిషి బ్రతికి ఉండగానే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఘనులున్న రోజుల్లో (ఉ. చంద్రబాబు) వై.ఎస్. మరణానంతరం కూడ ఆయన పట్ల గౌరవంతో ఇంతటి సాహసానికి దిగిన సురేఖలో నాటి ఝాన్సి లక్ష్మి కనిపిస్తుంది.

ఎవరితోను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పినప్పటికి దానిని చిన్న పిల్లలు సైతం నమ్మరు. పోని ఇంత కాలానికి జగన్ బాబులో ఈ తెగింపు రావడం హర్షణీయం.
రోశయ్యా ! నువ్వు దిగి పోయే ఘడియలు దగ్గర్లోనే.

వై.ఎస్.పేరు చెప్పి, వై.ఎస్. మానవీయ పథకాలతో ,సాక్షి టి.వి, దినపత్రికలు కూడ పెట్టిన మద్దత్తుతో కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఎం.ఎల్.ఏలై మంతౄలైన వారంతా రాజినామా చేస్తే వారి పేర్లు కూడ చరిత్రలో నిలిచి పోతాయి.

లేకుంటే చంద్రబాబు ఎలా అన్ పాపులర్ అయ్యారో, ఎలా విశ్వసనీయతను పోగొట్టుకునారో ఆ దుస్థితి వీరికి కూడ తప్పదు

1 comment: