Tuesday, November 3, 2009

మమ్ము ఆసు కవులు చేసావు : 2

చేతికొచ్చిన కొడుకు
చేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే
మందలించావు
అతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తే
పగ అలవాటు లేని నీ గుండెకు
పొగను సైతం దూరం చేసావు
నాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని
కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన
రామ కౄష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్

పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి
ఆ పేరు భయిట పడటానికి ముందు "ఏం షార్" అని పలకరించి
వెన్ను తట్టి కౌగిలించుకునే నాన్నతనం మమ్ము పులకరింప చేస్తుంది

నాడు ఏ కొత్త పథకం అమలు కాకున్నా
ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకున్నా
ఉన్నవి సైతం ఊద్చుకు పోయినా అధికారులకు మాత్రం గుండెల్లో రైళ్ళ పరుగులు తప్పేది కాదు
నువ్వు అన్ని సంవత్సరాలు ఎన్నికల సం. వలే పథకాలు అమలు చేస్తున్నా
ప్రాజెక్తులు చేపడుతున్నా వారిని కంటి నిండా నిద్ర పోనిచ్చావ్
పరిపాలన పై నీదైన చెరగని ముద్ర వేసావు

పుట్టనున్న పిల్లల కోసం జననీ సురక్ష పెట్టావ్
గిట్టిన వారి సతీమణుల కోసం వితంతు పించన్లు
వరసులచే సైతం తిరస్కరింప బడిన వౄద్దులకు పించన్లు
కకా వికలమైన వికలాంగుల బతుకుల్లో వెలుగును నింపే పించన్లు
నువ్వు లెక్కలేని పథకాలు పెట్టి నీకు ఏడేడు జన్మలకు రుణపడేలా చేసి
ఒక పథకం ప్రకారం శోక సముద్రాన ముంచి వెళ్ళావ్

60 కి విరమిస్తానని
ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం 10 సం.ల శ్రమ 5 సం.ల్లో చేసి ఇలా వెళ్ళి పోతావా రాజన్నా!

నాకో అనుమానం. అస్తమానం సోమ పాన సేవనంతో స్వర్గ శీమ నరకమైతే
దానిని మళ్ళీ స్వర్గం చేసేందుకు నీకు పిలుపందిందేమో ?
హ..! అదెంత పని నీకు. మూన్నెల్లో పూర్తి గావించి కీర్తి గాంచి
తిరిగి వచ్చేస్తావుగా రాజన్నా !

ఏళ్ళ తరబడి ఉద్యోగ ఖాళీల భర్తి పై నిషేదం ఉంటే
నిర్వేదంతో నీరశించిన నిరుధ్యోగుల మనసుల్లో కొత్త ఆశలు రేకెత్తించినావు

పంచె కట్టుతో వ్యవాసయ రంగాన్నే కాదు. కట్టలు తెంచుకున్న అభివౄద్ది పై వాంచతో
పారిశ్రామీకరణ చే పట్టావ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసావు
పొరుగు రాష్ఠ్రాలు తన్నుకు పో చూసిన పరిశ్ర్మలను ఇక్కడికి తెచ్చావ్
నీ లెక్క లేని పథకాలను ప్రస్తావించటంతో
ఈ కవితాంజలి న్యూస్ బుల్లిటిన్లా ఏద్చింది

రాజన్నా ! నువ్వు అప్పట్లో ఎం.పి. వి.
పొరుగు రాష్ఠ్రపు టైర్ కంపెని సేల్స్ రెప్ నిన్ను కలవాలని కడప వచ్చాడు
టీ కొట్టులో వాకబు చేసాడు
"ఎం.పి. ఇల్లెక్కడని"
టీ కొట్టువాడు అన్నాడు. అందాక ఎందుకు కాసేపాగు. ఆయనే వస్తాడన్నాడు

అప్పుడు అక్కడికి దూసుకొచ్చింది ఓపెన్ టాప్ జీపొకతి.
దానిని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు

అదీ మా రాజన్నంటే .

ప్రజా స్వామ్యమంటే అది నాలుగు స్థంబాలాట
లెజిస్లేచర్, ఎగ్సిక్యూటివ్, జుడీషియరి.
నాలుగో స్థంభం మీదియా.
ప్రజాభిప్రాయాన్ని మాత్రమే తెలుప వలసిన పత్రికలు
ఏకంగా తమ కోరికలను ,ప్రజా భిప్రాయాలుగా సమాజం పై రుద్దే
ప్రయత్నం చేసినప్పుడు
ఊళ్ళో బిడ్డలను భావిలో త్రోసి లోతు చూడక మీడియా దూకుడుకు నీ బిడ్డతో వేసావు అడ్డు కట్ట
ఆంథ్ర రాష్ఠ్ర ప్రజల మన: సాక్షిగా సాక్షి భూతమై నిలిచింది సాక్షి

ఒంటరి సిమ్హం పై అథవి పందుల దాడి చందాన
ఎన్నికల పోరు సాగితే నీ చేతి కరవాలంగా తిరింగింది సాక్షి

రాజన్నా !
తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు
వరి అభిమానులు
మరి నువ్వు రాజకీయ రణ రంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు.
అపర చాణక్యుల వ్యూహాలు బెడిసి కొట్టాయి.

No comments:

Post a Comment