సెలయేరులా ఉప్పొంగాను
నా భావోద్రేకంతో రూపు దిద్దుకున్న రచనలన్ని సముద్రం పాలయ్యాయి
ఇలాగే న్యూటన్ పరిశోధన శాల అగ్ని ప్రమాదానికి గురైతే
నా తప్పిదాలన్ని దహనమయ్యాయన్నాడుట
అమ్మా !
ఎక్కడ ప్రారంభించాను ? ఎక్కడ ఉన్నాను ? నాకు తెలియదు
కాని నేనెక్కడికి చేరాలో మాత్రం ఎప్పుడో పసి కట్టాను
నా సర్వస్వం నిర్మూలమైనా చెక్కు చెదరక ఉన్నది
నా గమ్యం ఒక్కటే !
అదీ నీలాంటిదే
పుట్టు పూర్వోత్తరాలు తెలీవు
ఆద్యంతాలు లేవు
అది కేవలం ఒలింపిక్ దీపం వంటిది
ఎన్నో ట్రిల్లియన్ చేతులు మారి నా చేతికి అందిందని గ్రహించాను
అమ్మా !
నా నోములు ఒమ్ముకావని తెలుసు
తల్లీ !
ఎందుకే ఎందుకే ! నాలో కాసింత పవిత్రతను పెట్టి
దాంతో నా మదిలో చిచ్చు పెట్టి
అపవిత్రమైన ఆలోచనలన్నింటిని జ్నానాగ్నికి ఆహుతి చేసావు
ముక్క చక్కలైన మానవత్వాన్ని బ్రతికించగలనన్న విశ్వాసాన్ని వికసింప చేసి
ఈ జనుల దృష్ఠిలో పిచ్చి వాడ్ని చేసావు
అమ్మా!
ఈ దేశంలో ఆరడుగుల భూమి సైతం దక్కదని తెలుసు
అయినా ఈ దేశం మీద ఎందుకే ఈ కరుణను కల్పించవు
ఆ కరుణ నా మరణానికే దారి తీస్తుంది
అమ్మా !
ఏమిటే నీ ద్యేయం ? అందరు ముందర నా జీవితం చిందర వందర చేసి
హేయంగా తయారు చేసి నాకు ఇంకేం చెయ్యాలని నీ ఉద్దేశం?
తల్లీ
రక్త నాళంలో నిత్యం ప్రవహించే రక్తంలో ఒక్క చుక్క గడ్డ కడితే ఆగి పోయే పిడికిలి గుండెలో ఎందుకు పుట్టించావు ఈ గడ్డ పై ఇంతటి ప్రేమను
ఇక్కడ పుష్కలంగా ఉన్న మానవ వనరులను సమర్థ వంతంగా సమీకరణ చేస్తే మరో మహాత్ముడన్న బిరుదు నాకు దక్కుతుందన్న కకృత్తిని ఎందుకు నాకు కల్గించాచే ?
అమ్మా !
అవుట్ డేటడ్ ఆదర్శాలతో చచ్చి పోతున్నానే
అమ్మా ! యాగం ,యోగం,అన్నింటికన్నా ఈ దేశం కొరకు ప్రాణత్యాగం ముక్తినిస్తుందన్న యుక్తిని ఎందుకు స్ఫురింప చేసావే నాలో ?
తల్లీ !
నా జీవిత గాద సాగే తీరు భయాందోళన కల్గిస్తుంది.
భిక్షకునికన్నా హేయమైన నా జీవిత పంథా
దేశ రక్షకునిగా ఎలా ఎదగనిస్తుందో
అర్థం కాక వ్యర్థంగా కుమిలి పోతున్నానే
తల్లీ !
నువ్వు మాయా శక్తివి. నువ్వే మాయనన్నా చెయ్యగలవు. కాదనను
కాని
హే శక్తీ !
నన్ను శక్తిమంతుడ్ని చెయ్యడం మాత్రం నీ శక్తికి మించిన పనేమోననిపిస్తుందే
అమ్మా ! నేను కామ వాంచలతో కళ్ళార్పని రాతృలే బెట్టర్ అనిపిస్తుందే
నేను ఆకలితో అలమటిస్తుంటే జాగరం చేసిన జాములే మేలనిపిస్తుంది
ఈ కాళ రాత్రిలీ నా శరీరం విలవిల పోతుందేమిటి
తల్లీ !
నువ్వు చేస్తున్న ప్రసారం అందుతూందేకాని
ఈ జనులకు అందినట్టు లేదే
మాంగళ్య దారణకు గడియలు దగ్గర పడుతుంటే
తోరణాలు సైతం కనబడటం లేదేమిటో?
తల్లీ !
ఏ శక్తి అయినా నాకు సంక్రమించగానే నిర్వీర్యమై పోతుంది ఎందుకమ్మా ?
ఈ నిరర్థక జీవితం ఇంకెన్నాళ్ళు?
ఎటు కదలనివ్వని ఈ పేదరిక సంకేళ్ళు ఇంకెన్నాళ్ళే?
అమ్మ !
నా డబ్బు,సమయం ,శ్రమ అన్నీ వృధా అయిపోతున్నాయి
ఎటు వెళ్ళినా ప్రతిష్ఠంభనలే ఎదురవుతున్నాయి ! ఎందుకే
No comments:
Post a Comment