Sunday, January 10, 2010

జగన్ తక్షణ కర్తవ్యం

1.మెజారిటి ఎం.ఎల్.ఏ ల మద్దత్తు ఉన్నప్పటికి సి.ఎం చెయ్యక పోవడం.
2.తొలూత ప్రమాదానికి గురైన హెలికాప్టరును గుర్తించటంలో, తదుపరి వై.ఎస్. పార్థివ దేహాన్ని రెస్క్యూ చెయ్యడంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎం చెయ్యడం,
3.మృతి చెందిన దివంగత నేతకు దహన సంస్కారాలు సక్రమంగా నిర్వహించటంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
4వరదలవలన నాలుగు జిల్లాల్లోప్రజా జీవణమే స్థంభించినా కిమ్మనని రోశయ్యను సిఎంగా కొనసాగించటం
5.కేసిఆర్ ఒక కాగితపు పులి. అతనిని చూసి తాను బెదరి, అదిష్ఠానాన్ని భయపెట్టి సమస్యను జటిలం చేసిన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
6 .ఎవరో రేణుకా చౌదరి ఫ్లెక్సిని చించితే దానికి గగ్గోలు పెట్టిన వైనం
7 పులి వేందుల సీటులోంచి పోటి చేసే యోచనలో జగన్ ఉన్నప్పటికి దానిని వై.ఎస్.సతీమణికి కేటాయించటం
8 వై.ఎస్.అర్ అవినీతి సొమ్మును సోనియాకు దోచి పెట్టాడని ఆరోపించిన పి.ఆర్ .పి ముంగిట చేయి చాచటం
9.వై.ఎస్.మృతితో గుండె పగిలి చచ్చిన వారి మరణాలను సైతం కించ పరచిన ముసలి నాయకులను కట్టిడి చెయ్యక పోవడం
10. ఏదో ఆంగ్ల పత్రికలో వై.ఎస్.తదననంతరం జరిగిన మరణాలు ఫేక్ అని వ్రాస్తే దానిని ఉటంకించి మాట్లాడిన ముసలి నాయకుల పై చర్యల్లేవు. రష్యన్ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా చర్చ నిర్వహించిన టి.వి.చేనల్స్ పైన మాత్రం కేసులు, అరెస్టులు
11.తివారి ఎటువంటివారని, ఆయన నైజమేమని కాంగ్రెస్ పార్టిలో ప్రతి ఒక్కరికి తెలుసు.తొలూత జగన్ను సి.ఎం చెయ్యాలన్న కోరిక భలమైనప్పుడు అతనిని విదేశాలకు పంపేరు. జగన్ పార్లెమెంటులో సమైఖ్యవాదం వినిపించిన కొన్ని రోజులకే తివారిని ఉచ్చులో దింపి రాజినామా చెయ్యించారు. తివారికి ,వై.ఎస్.కి ఉన్న సత్సంభంధాల దృశ్యా ఆయన జగన్ సి.ఎం కావడానికి సహకరిస్తాడేమోనన్న నెపంతోనే ఈ ఉదంతం జరిగింది.
12.గాలి జనార్థన రెడ్డి వై.ఎస్.కి పుత్ర సమానుడు, జగన్ కి సోదర సమానుడు .జగన్ సి.ఎం కావడానికి అతనెక్కడ సహకరిస్తాడోనని అతనిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు
13. గత ఎన్నికల్లో బాబు మహా కూటామి కడితే కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తే జగన్ సాక్షి టివి,సాక్షి దినపత్రిక ద్వారా కాంగ్రెస్ విజయానికి ఎంతగానో దోహదపడ్డారు. గత ఎన్నికల్లొ మహా కూటమికంటే కాంగ్రెస్ పార్టికి అదనంగా వచ్చింది కేవలం ఒక్క శాతం ఓట్లే . సాక్షి దినపత్రిక,టివి ల రీడర్ షిప్, వ్యూయర్ షిప్స్ లెక్కిస్తే అప్పుడర్థమవుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయం ఎవరు పెట్టిన భిక్షో. కనీశం ఆ కృతజ్నత సైతం లేక సాక్షి పై కేసులు పెట్టారు.అరెస్టులకు సైతం తెగించేరు

తక్షణ కర్తవ్యం;
"ఇక మంచి లేదు,మానవత్వం లేదు యుద్దమే" జగన్ ఎన్నికల శంకారావం పూరించు. తొలూత కొత్త పార్టికి అంకురార్పణ చెయ్యి. రాష్ట్ర) వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చెయ్యి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో ఎన్నికలు జరిగేలా చెయ్యొచ్చు. అందాక వై.ఎస్. పథకాల అమలుకు, వై.ఎస్. మరణము వెనుక కుట్రలేమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తుకు వత్తిడి చేద్దాం.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.రాజకీయంలో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నామన్నది ముఖ్యము కాదు. ఎంత త్వరగా తీసుకున్నాం. ఎంత చక్కగా అమలు చేసామన్నదే ముఖ్యం.

వై.ఎస్. అమర్ రహే ! జగన్ కో సి.ఎం బనేంగే

1 comment:

  1. babu karan...JAGAN anna ante neeku bad impression unnnatu undii...dayachese ma nirnayam ni marchukoo...lekha pothee nevve loss avtavu...

    ReplyDelete