Thursday, January 28, 2010

కృష్ణుడొచ్చాడు (Political Satire)

అర్ధ రాత్రి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. తమిళ బ్లాగును రోజుకి  వెయ్యి మందికి తగ్గక సందర్శించడమేంది.. తెలుగు బ్లాగు మాత్రం బోని కాక పోవడం ఏందని అదో వింత శోకం, ఎన్నికల సమయంలో కనిష్ఠంగా రెండు వందల మంది, గరిష్ఠంగా ఐదు వందల మంది చూసేవారు. మరి ఇప్పుడేమైంది?

 ఓ మంచి టపా కొట్టి హిట్స్ కొట్టడం ఎలాగబ్బా అని తల పట్టుకుని ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి  కమ్మని వేణు గానం వినిపించింది. దానిని వినగానే  వెన్ను లోపల ఓ వింత పులకరింత. కొంప తీసి గూర్కా సెల్ ఫోన్లోని రింగ్ టోన్ కాదుకదా అని ఆలోచిస్తుంటే ఎవరో తలుపు కొట్టారు.

లేచి వెళ్ళాను. తలుపు తీద్దామా వద్దా అని ఓ దర్మ సందేహం. కొంప దీసి ఎవడన్నా తాగు బోతు స్నేహితుడొచ్చి మెదదు తింటే ..అని ఓ సంశయం. ఇంతలోపే "నాయనా.. నీ కోసం చాలా దూరంనుండి వచ్చాను ..తలుపు తీ తండ్రి !" అంటూ మంత్ర స్థాయిలో ఒక గొంతు. ఆ గొంతులోని శృతికి ముగ్దుడనై తలుపు తీసేసాను.

భయిట నిలబడ్డది..సాక్షాత్తు శ్రీ కృష్ణ్డుడు. ఒళ్ళు జలదరించింది.

"సార్.. సార్ ఇదేంసార్ చెప్పా పెట్టకుండా వచ్చారు. రెండ్రోజులు ముందుగా చెప్పుంటే ఏవో నాకు చేతనైన రిసెప్షన్ అరేంజ్ చేసుంటానుగా" అంటూనే లోపలికి పిలిచి నా మీద వేసుకున్న టవల్ తీసి మరో చేర్ పై దుమ్ము దులిపి కూర్చో పెట్టాను.

"సార్ .. ఈ వేళకైతే గ్లాసు పాలు తప్పా మరేమి ఉండదు సార్.. తెమ్మంటారా?"
"వద్దు లేవయ్యా.. చిన్నప్పట్లోనుండి ఎడా పెడా పాలు,పెరుగు  త్రాగి గల్ల,జలుబు, ఆస్మాతో బాధ పడుతున్నా.. నీతో పని బడి వచ్చాను"
"నాతో మీకేం పని సార్ సిల్లిగా.."
"నువ్వో పత్రికా విలేకరివికదా నేను ప్రజలకో మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నీకు ప్రెస్ నోట్ ఇచ్చి పోదామని వచ్చాను"
"గురువు గారు ! మీరేమంటున్నారు. ప్రెస్ నోట్ ఇస్తే వార్తల్లో వచ్చే రోజులు పోయాయి. జూనియర్ ఎన్టి ఆర్ నిశ్చయతార్థ వార్తైతే హెడ్ లైన్స్ లో వస్తుంది గాని ..ఇంతకీ ఏమిటా మెసెజి"
"భూదేవికి వయోభారం పెరిగింది..దీంతో జన భారం మొయ్యలేక పోతూందట ..కాబట్టి మరో సారి దుష్ఠ శిక్షణ చేపడతామని నిర్ణయించాను"
" ఓ ఐ సీ.. గూగుల్ వారి సర్వర్లకు వత్తిడి ఎక్కువైతే ఇనేక్టివ్ గా ఉన్న మెయిల్స్,కంటేంట్స్ అంతా డెలిట్ చేయ బోతున్నారట ఆ విదంగా మీరు కూడ .."
"అచ్చంగా అంతేనయ్యా"
"చెయ్యడమేదో వెంటనే చేసి పారెయ్యొచ్చు గా ప్రజా స్వామ్యంలోనే ఆర్డినెన్సుల ద్వారా రాత్రికి రాత్రి చేసేస్తుంటే మీరేంది మెసెజి ఇవ్వాలి అది ఇదీ అంటున్నారు"
"అలా కాదు తంబి! కనీశం ఒక నోటీసన్నా ఇవ్వాలిగా.. "
"బలేవారు సార్ ! చావు చెప్పి వస్తుందా ఏం?"
"ఖచ్చితంగా చెప్పే వస్తుంది నాయనా.. సూక్ష్మ బుద్ది ఉన్నవారు గ్రహిస్తారు"
"ఇదేం సార్ వింతగా ఉంది"
"అవునయ్యా.. అండంలో ఉన్నది పిండంలోను ఉంది. ఈ అండ చరాచర ప్రపంచానికి ఏం జరుగనుందో మనిషికి తెలుస్తూ ఉంటుంది.అలాంటిది తనకేం జరుగుతుందో తెలియదా?"
"అదెలా తెలుస్తుంది సార్.."
"చచే వారికి తెలిసిందని మనకు తెలుస్తుంటుంది నాయనా..వై.ఎస్. అరవై ఏళ్ళ వయస్సుకు రిటైర్ అవుతానని చెప్పలే..అలాంటిదే"
"అమ్మ బాబోయి.."
"అంతే కాదు తంబీ ! చనిపోవడానికి ఆరు నెలలు ముందుగానే కను గుళ్ళు భయిట ప్రపంచమునుండి మెల్లగా యాంగిల్ మార్చుకుంటాయి.  క్రమేనా తన ముక్కు కొనను తాను చూసుకో లేక పోతాడు మనిషి"
"ఐ సీ.. బలే త్రిల్ గా ఉంది సార్..అలాగైతే మెసేజి ఇవ్వాల్సిందే.. మరి ప్రెస్ నోట్ సరిపోదే. అదీను యావద్ ప్రపంచానికివ్వాలిగా మెసేజి"
"యెస్ !"
"కష్ఠమే సార్ ! నాకు 24  గంటలు టైమిస్తే ఒక్క సారిగా యావద్ ప్రపంచానికి ఎలా మెసేజివ్వగలమో ఆలోచించి చెబుతాను సార్"
"అలాగే నాయనా ! రేపు కలుద్దాం"

2 comments: