Wednesday, January 27, 2010

నిందా స్థుతి

హే అంభికా పురవాసిని!
నీ అంభికాపురాన  అష్ఠ దిక్కుల్లోను ఉన్నది పరీక్షల పేరిట
నీవు ప్రదర్శించే నీ సేడిజమే..ఆ ప్రదేశానికి కేంద్ర  బింధువు కేవలం నీ అహంకారం

అందుకేనేమో నీ బిడ్దలు సైతం స్యేడిస్తులుగా ఉన్నారు
బలహీణుల పట్ల స్యేడిజంగా భయిట పడే కృరత్వం
భలవంతుల పట్ల మసాకిజంగా దర్శనమిస్తుంది
అందుకేనేమో..

పాలకులు పెట్టే హింసలను ఎంజాయి చేస్తూ వారిలోనే ఏదో ఒక  గ్రూపును ఎన్నుకుంటున్నారు. పార్టీల పేరు చెప్పి తన్నుకుంటున్నారు

నువ్వు అష్ఠైశ్వర్య ప్రధాయినివే
ఎవరికి?
అగ్ర రాజ్యానికి, స్వదేశి టాప్ టెన్ ట్రిల్లియనర్లకు
మత వైషమ్యాలను రెచ్చ కొట్టి
మరి ఈ దేశాన్ని విభజించ చూసే పొరుగు దేశానికి
కొమ్ము కాసే  మూర్ఖులకు
అరిచేత వైకుంటాన్ని చూపి స్వంత
మామకు భూలోకానే  యమలోకాన్ని సృష్ఠించిన
వెన్ను పోటు వెదవలకు

నువ్వు అనుగ్రహ ప్రధాయినివా..?
 ఎవరికి ?
 వడ్డీలు కట్నాలు లంచాలు దండుకుంటున్న
దగుల్ బాజీలకు,అధములకు

నీవు అఖిలాండేశ్వరివా?  కాదు
అఖిలాండాన్ని పాలించేది అగ్ర రాజ్యం
ఇక్కడి  దేశాధినేతలు ఏ బ్రాండు క్యేండోం వాడాలో కూడ వారే నిర్ణయిస్తారు

ఈ విషయాన మేము కాస్త అదృష్ఠవంతులం
మమ్మల్ని ఏలే అవకాశాన్ని ఆకలి దోపిడీలకు ఇచ్చావు.
నువ్వు అభయవరద హస్తినివా..
కాదు..
అభయమిస్తానని ఆశ చూపి ఆపదలోకి నెట్టి లౌకిక జీవితం
వరదై భక్తుడు శవమై కొట్టుకుపోతుంటే
చూస్తుండి పోయే చేత కానిదానివి

నువ్వు అమృతమయివా?
కాదు ఈ మాట నిజమైతే నీ ఈ సృష్ఠి కూడ అమృతమయమై ఉండి ఉండాలి
నీలో సగం శివుడున్నాడుగా అతడారగించిన అలాహలం నీలోను ప్రవహిస్తుందేమో?
అందుకే ఈ సృష్ఠి ఇలా ఏడ్చింది

నువ్వు ఆనందమయివా?
ఈ మాట నిజమే కాబోలు
అందుకే ఉన్నవాని దోపిడి, లేనివాని ఆకలి స్థూలంగా వేరే అయినా
ఇరువురిని ఆనందానికి చేరువగా అదే మరణలోక ద్వారానికి
దగ్గరగా నడిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఏం జరిగినా అతి త్వరలో  అంతా ఆనందంగా పరమానందంగా
మారక తప్పదు.
నువ్వు అన్న పూర్ణేశ్వరివా?
మా దేశ పరిస్థితిని పట్టి చూస్తేనే ఇందులో నలబై శాతం అబద్దముంది
అవును నా దేశాన నలబై శాతం మంది పస్తున్నారుగా

నువ్వు ఆద్యంత శివరూపిణివా
నాలా నమ్మి చెడి పడి చచ్చినవారి బూడిదలేగా నువ్వు వాడే టాల్కం పౌడర్
శివుని చిరునవ్వు ప్రమాద  సూచికైతే
నువ్వు జస్ట్ నీ ఉనికితోనే కునుకు లేకుండా చేస్తున్నావు
వనుకు పుట్టించేస్తున్నావు శభాష్ !

అన్నట్టు నీకన్నా  శివయ్యే బెటర్ అతను  చిరునవ్వుతో రాక్షసులనే భూడిద చేస్తాడు
కాని నువ్వు పట్టు వస్త్రాలు మోసిన  గాడిద చందాన నిన్ను నీ నామాన్ని మోసే నావంటి భక్తులను సైతం దగ్దం చేస్తావు

నువ్వు  ఆధార శక్తివా?
కాదు. ఈ బిరుదు
అసంబంధం
మా జీవన రథాన్ని నడిపే ఇందనం దనం. అదే ఇక్కడి ఆధార శక్తి
అదొక్కటే దర్మాన్ని సైతం నిద్ర లేప గలదు
ప్రళయ కాల దుర్గను సైతమ్ నిద్రింప చేస్తుంది.

నువ్వు ఆర్థ జన రక్షిణివా?
కాదు అర్ద రక్షిణివి
కన్నవానికి  కాసింత ప్రేమ చూపకున్నా తనకంటే ఉన్న వానికి బూట్లు మోసే అర్థ జనులకే రక్షిణివి.

నువ్వు బింధు స్వరూపిణివని మా వారు గుర్తించారులే
అందుకే మా వారు నిత్యం నిన్ను సారా బింధువుల్లో వెతుకుతున్నారు

నువ్వు చతుర్వర్గ భల  ప్రధాయినివా?
కాదు ఇక్కడ జరిగే పవర్ వార్లో మని,మాఫియా, మీడియాలే త్రివర్గ భలాలు.
వాటిని నువ్వు ఈయ జాలవు.

నువ్వు చంద్ర మండల వాసినివా?
మా వాళ్ళు చంద్రమండలం వెళ్ళినప్పుడు నువ్వు ఏదో యుగాన తాంబూలం దరించిన వేళ గిల్లి పారేసిన కిళ్ళి ముక్కలు సైతం వారికి కనిపించలేదెందుకు?

నువ్వు దివ్య సుందరివా?
ఏ అందాల రాశి పోటీలో పాల్గొని గెలిచావే .. నీ తరపున ఏ ఈవ్ టీజింగ్ కేసు మా పోలీసులకు అందలేదు..
నువ్వు దివ్య సుందరివా?
మా మునిముని టు ది పవర్ అఫ్ ట్రిల్లియన్స్ భామ్మవు నువ్వు
న్ఉవ్వు దివ్య సుందరివి కావడమేమిటే
నువ్వు దైత్య నాథ గృహిణివా?
ఏ గృహిణియన్నా తన శరీరంలో సగం, భర్త శరీరంలో సగం నరికి వేస్తుందా?
______________

No comments:

Post a Comment