అమ్మా అమ్మోరు తల్లి !
వీరు ప్రతి మార్చికి తేల్చుతారు లెక్కలు
కాని నేను డొక్క ఎండిన ఆ రోజుల్లోనే ప్రతి రాత్రికి
టాలి చేసుకుంటా బ్యాలెన్స్ షీట్
నా గతానుభవమే కాదు భవిష్య జ్నానం కూడ
చెబుతూంది ఇక్కడ ఏదీ శాస్వతం కాదని
నువ్వెక్కడో నింగినుండి తొంగి చూడటం లేదని
ఏ కోణంలో ఆలోచించినా మేమందరం
ఏదో ఒక అరుదులో అరుదైన ఒక్క నిర్ణిత క్షణాన
ప్రాణం పోసుకున్న ఒక్క కణంలోనుండి పుట్టిన వారమే
ఆలా ప్రాణం పోసింది నువ్వని లేదా ఆ ప్రాణమే నీవని భావిస్తా
ఇక్కడి మానవులమే కాదు ప్రతి జీవి ఒక్క తల్లి బిడ్డలమని
ఆ తల్లివి నీవని భావిస్తా !
నీ పిల్లలు దోపిడికి గురై ఆకలితో అలమటిస్తుంటే
నీ ఉనికినే వారి శంకిస్తుంటే నా మేథోశక్తి బ్రహ్మంగారి
కాలజ్నానానుసారం ప్రాణం పోసుకున్న( హంపి ) ఆంబోతులా రంకె వేస్తుంది.
అమ్మా అమ్మోరు తల్లి !
ఈ భువి పై ఆకలి దోపిడి ఉన్నంత కాలం
ప్రతి శ్వాసలో ఓంకారం ద్వనించినా, ప్రతి అడుగులో నీ కాలి గజ్జల చప్పుడు
వినబడుతున్నా ప్రతి స్త్రీ) లోను నువ్వే కనబడుతున్నా
నేను నాస్తికునిగనే కొనసాగుతా
ఈ దుర్బర పరిస్థితిలో నేను ఆస్తికునివలే కులికితే
నన్నేదో నీ పి.ఏగా భావించి నీ ఆడ్రసు కోసం నన్ను వాకబు చేస్తారు.
నేను ఏ దిన పత్రికలోనో కనబడుట లేదు నీవని ప్రకటన ఇవ్వమని సలహా ఇవ్వాల్సి వస్తుంది
నో.. అతిత్వరలో నన్ను నేను ఆస్త్రికునిగా ప్రకటించుకోవాలనే ఆకలి దోపిడీల పై
ద్రుష్ఠి సారించా.
No comments:
Post a Comment