Monday, February 22, 2010

విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన

అమ్మా అమ్మోరు తల్లి !
నాతో కల్లు తాగినవారు
కల్లు కుండలో ఈగల్లా పడి రెక్కలు తడిచి చచ్చారు
నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి
అది నీ కడకంటి చూపుతోనే సాధ్యమైంది

నాతో బ్రాంది త్రాగిన వారు
ఆ బ్రాంతినుండి భయిట పడ లేక పోయారు
నేనైతే క్రాంతి వైపు దృష్ఠి మళ్ళించుకో కలిగాను
అది హే చాముండీ !
నీ అండ దండలతోనే సాధ్యమైంది

నాతో పాటు గంజాయిని ఎంజాయి చేసినవారు
ఆ మైకంలోనే మకాం పెట్టేసేరు
కాని కకా వికలం కావలసిన నా జీవితాన్ని
నిర్జీవమై , నీరు కారి పోవలసిన నా జీవితాన్ని
బతికించి, నన్నుఇలా బ్రతకనివ్వడమే
నీ అమ్మతనానికి ఆధారం

నాతో పాటు విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన వారు
ఇందాక ఆ ఆటకు ఆట విడుపు ప్రకటించ లేదు
కాని చాలా మంది పుణ్యపురుషుల్లా కాక
వారిని కేవలం రంద్రాలుగా చూసే మృగత్వంనుండి
విముక్తినిచ్చావు
వారిని సైతం మనుష్యులుగా పరిగణించి
వారి బాగోగులను సైతం ఆలోచించి
గళం విప్పేంతగా నా మనస్సును వైడన్ చేసిన
నీ వైనం రమణీయం. చిరస్మరణీయం

నేనూ వారిలాగే ఆగి పోయేవాడ్ని
హే శక్తీ .. నువ్విచ్చిన శక్తితో సాగి వ్యూహ భంగం చేయగలిగాను

హే శ్రీ విద్యా !
అవన్ని నాలో నదిలా ఉప్పొంగే శక్తి ప్రవహించ చూసే తప్పుడు
పరివాహక ప్రాంతాలన్న జ్నానాన్నిచ్చావు.
ఈ నది నడవ వలసిన పథమేదో
స్ఫురింప చేసావు

నీ పాదాల చెంతకు చేరుకోనిచ్చావు
ఈ అధ్భుతం సాధ్యం కావడానికి నేను పొడిచిందేమి
అన్న అనుమానం వీరికి కలుగ వచ్చు.
నీ రూటే వేరు ! నీ స్కూలే వేరు !
ఇక్కడ భక్తుడు ఏంచేస్తాడన్నది ముఖ్యం కాదు
ఏ భావంతో చేస్తాడన్నదే ముఖ్యం
అసలు ఏది చెయ్యాలనీ లేదు
చెయ్యాలనుకుంటే చాలు

అమ్మా! అమ్మోరు తల్లి !
ఆ అనుకోవడాలు కూడ నీ ఆజ్నతోనే సుసాధ్యమంటే
నేనో బొమ్మను !
నువ్వు నన్నాడించే అమ్మవు!!

త్యాంక్యూ ! త్యాంక్యూ ఫార్ ఎవర్ !!

No comments:

Post a Comment