Tuesday, October 5, 2010

జ్యోతిష్యం పేరుతో మోసాలు

ఒక జ్యోతిష్కునిగా ఉంటూ "జ్యోతిష్యం పేరుతో మోసాలు" శీర్షికన టపా వ్రాయడం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కాని బేసికల్ గా నేనో రచయితను. మరి సామాజిక భాధ్యత గల రచయితను. అదెలా కుదిరిందో కాని నా మార్గ దర్శకాల కోసం నన్ను సంప్రదించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

నా సలహాలను వారు పాటిస్తారో లేదో తలీదు గాని అర్థిస్తారు. సమస్యను అన్ని కోణాల్లోనుండి విశ్లేషించటం నా స్పెషాలిటి.  1989 దాకా నా అనుభవాన్ని పట్టి జ్యోతిష్యం వాస్తు కోణాల్లో సమస్యలను విశ్లేషించే వాడ్ని కాను.అన్నీ హేతుబద్దంగానే ఆలోచించే వాడ్ని.సలహాలిచ్చే వాడ్ని.కాని నా అనుభవం జ్యోతిష్యం యొక్క గొప్పతనాన్ని నాకు చాటింది.

నన్ను సంతృప్తి పరచాలంటే మరీ కష్ఠం. నేను గాంథి, నెహృలను సైతం విమర్శించే వాడ్ని ( అట్ ది సేమ్ టైమ్ గౌరవిస్తాను కూడా) . జ్యోతిష్యం నేను పెట్టిన అగ్ని పరీక్షల్లో నెగ్గింది. అందుకే ఆర్థుల సమస్యలను జ్యోతిష్య కోణంలో కూడా విశ్లేషించటం మొదలు పెట్టాను.

జ్యోతిషం భూటకమని చెప్పేవారికంటే, జ్యోతిషాన్ని వృత్తిగా ఎన్నుకున్న వారికి జ్యోతిష్యం గురించి  తెలిసిన విషయాలు చాలా తక్కువంటే బిత్తర పోతారు. కాని ఇది నిజమే. నూటికి 99.9 శాతం మంది జ్యోతిష్కులకి జ్యోతిష్యం యొక్క అసలు సిసలైన  పునాది ఏమిటో , దాని అసలైన ఉద్దేశం,లక్ష్యం  ఏమిటో కూడా తెలీదు.

జ్యోతిష్యం యొక్క అసలైన పునాది మానవుడు ఈ సృష్ఠిలోనుండి  విడదీయలేని ఒక భాగం. అసలు ఈ సంస్థ సృష్ఠికి మానవుడు ఒక మీనియేచర్. సృష్ఠి అసలైన మర్రె చెట్టైతే మానవుడు పోన్సాయిక్ ట్రీ.

అండంలో ఉన్నది పిండంలో ఉన్నది. ఈ అండం పిండాన్ని ప్రభావిస్తుంది .ఇది ప్రిలిమినరి. ఈ సత్యం మీద ఆధార పడే జ్యోతిష్యం పుట్టింది. కాని మనం ఇక్కడితో ఆగిపోకూడదు.

ఈ పిండాన్ని మైండుని సక్రమంగా ట్యూన్ చేసుకో కలిగితే ఈ పిండంతో ,పిండంలోని మైండుతో ఈ అండాన్ని ప్రభావించ వచ్చు అన్నది ఆథ్యాత్మికం.

క్రమేణా ఎదిగి తదుపరి స్థాయికి చేరుకోవాలి. అందుకే నేనప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. జ్యోతిష్యం ఆథ్యాత్మికానికి తొలి మెట్టు అని.

జ్యోతిష్కులు ఇంత దూరం ఆలోచించక పోయినా కనీసం జ్యోతిష్యం మీద విశ్వాసంతోనన్నా మెలగొచ్చుగా. అదీ జరగడం లేదు. అల్లోపతి వైద్యం చెయ్యించుకునే సిద్దా ,హోమియో డాక్టర్ల వలే, ఊళ్ళో వారికి తన గూండాలను కాపలా పెట్టి తమకు మాత్రం ప్రభుత్వ గన్ మ్యెన్లను పెట్టుకునే రౌడీల్లా తమ క్లెయింట్స్ కి గ్రహ పీడల గురించి కథలు కథలుగా చెప్పి బెంబేలెత్తించే జ్యొతిష్కులు వ్యక్తిగతంగా " గ్రహాలదేముంది బాసు.. డబ్బులుండాలి" అనడం విడ్డూరం.

మా ఊళ్ళో పెద్ద పేరు మోసిన జ్యోతిష్కులు ఒకతనున్నాడు. నిజానికి ఆయనలో ఎంతో గొప్ప సత్తా ఉంది. కాని సదా సర్వ కాలం డబ్బు ద్యాసతోనే ఉంటాడు. ఇంతకీ రోజుకి వెయ్యి రూపాయలకు తగ్గకుండా సంపాదిస్తాడు. కొంత కాలం సంపాదించడం ఏదో రూపంగా నష్ఠపోవడం మళ్ళీ సంపాదనకు పూనుకోవడం ఇదే ఆయిన జీవిత సారం.

తొలూత ఒక సినిమా తయారిలో భాగస్వామి అయ్యాడు.నిలువునా మునిగాడు. కొంత కాలానికి అయిన దబ్బంతా ప్రైవేటు చిట్ ఫండ్ లో దాచాడు. అది మునుగుద్దని తెలిసి ఆ డబ్బులన్ని అరా కొరగా వెనక్కి తీసి లారీల పై పెట్టుబడి పెట్టాడు.అదీ నష్ఠాల బాట పట్టడంతో వాటిని అమ్మేసి (నష్టానికి) ఒక ఆస్తి కొన్నాడు. తన చేతిలో ఉన్న సొమ్ముకు తగ్గ ఆస్తి కొని ఉంటే  గట్టెక్కేవాడు. తన భావమరదిని భాగస్వామి చేసి పెద్ద ఆస్తి కొన్నాడు. జాయింటుగా రెజిస్టర్ చేసి ఉంటే ఎవరూ ఎవరికీ వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చేది కాదు. అతను ఎవర్నీ నమ్మడు. తన పేరిట రెజిస్టరు చేసుకుని భావ మరదికి వడ్డీలు కడుతూ వచ్చాడు.
బావమరది  ఆయన కూతురి పై కన్నేసాడు. కూతురు పెద్ద చదువులు చదివింది.భావమరదేమో నిషానిగాడు. దీంతో ఐదు రూ వడ్డీకి అప్పు చేసి భావమరదికి సెటిల్ చేసాడు.

రోజుకి వెయ్యిదాక సంపాదిస్తాడు కాబట్టి లక్ష రూపాయల దైలి ఫైనాన్స్ తీసేసుకుని కడుతుంటాడు. వడ్డీ మాత్రం పది వేల రూపాయలు.  అదేదో ఒక హనిబీ అకవుంట్ తెరచుకుని కడితే ఆ పదివేలు మిగలడం సరికదా వడ్డీ కూడ లభించేది. ఇటువంటివారు సమాజంలో మస్తుగున్నారు.

ఒక డాక్టరు ఏం ఫీలవ్వాలి? హమ్మయ్యా డబ్బులదేముంది.. ఏ రోగం రాకుండా ఉంటే అదే పదివేలన్న భావనతో ఉండాలి. అతను డబ్బు పిశాచిగా వ్యవహరిస్తే అతను తన వైద్య వృత్తి లోతు పాతులను తెలుసుకోలేదనే గా లెక్క.

జ్యోతిష్కుడన్నవాడు తొలూత తాను జ్యోతిష్యం పై విశ్వాసం కలిగి ఉండాలి. డబ్బుకన్నా గ్రహ భలమే గొప్పదన్న ప్రగాడ విశ్వాసం అతనిలో ఉండాలి.

ప్రస్తుతం చలామణిలో ఉన్న జ్యోతిష్య గ్రంథాలన్ని అవి వ్రాయ బడిన కాల,దేశ,వర్థమానాలకు అనుగునంగా వ్రాయ బడ్డాయి. జ్యోతిష్యాన్ని అప్ డేట్ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

గ్రంథాలను బట్టీ కొట్టి, వాటిలోని అంశాలను గుడ్డిగా చెబుతూ, చిలక  పలుకులతో డబ్బు చేసుకోవడం విద్యకు చేసే ద్రోహం.ఒక గ్రంథంలో ,ఒక గ్రహ స్థితికి  ఒక ఫలితం చెప్ప బడి ఉంటే అది ఎందుకు అలా చెప్పబడింది, ఆ ఫలితం ఎలా మెటీరియలైజ్ అవుతుందన్న ఆలోచనే లేక, పరిశీలన,విశ్లేషణలకు తావు లేకుండా పబ్బం కడుక్కోవడం పొరభాటు.

ప్రస్తుతం చలామణిలో ఉన్న గ్రంథాలన్ని (మూల గ్రంథాలు సైతం) కేవలం ఒక భవనం యొక్క శిధిలాలవంటివి. ఈ మూల గ్రంథాలకు మూలం ఏదని ఎవ్వరూ చెప్పలేరు. ఇవన్నీ రీ ప్రొడక్షన్స్ మాత్రమే. వీటికి మూలం ఎందరో రుషులు మహర్షుల కృషి ఫలం. దశాబ్దాల అద్యయన ఫలం. అనుభవ సారం.

ఎంత గొప్పవారైనా సరే మరొకరి అనుభవం అన్నది సద్ది మూట వంటిది. అది పాచి పోవడం ఖాయం. మన ప్రయత్నంతో,మన కృషితో,అద్యయనంతో దానిని అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి.  ఎంత మంది జ్యోతిష్కులు ఈ పని చేస్తున్నారు?  ఇది మోసం కాదా?

మానవుల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అప్పట్లో భాల్య వివాహాలుండే. ప్రస్తుతం 40 దాటినా పెళ్ళి కాని వారున్నారు. అప్పట్లో కు.ని లేదు. ఇప్పట్లో  కు.ని పాటించని వారే లేరు. అప్పట్లో ఉమ్మడి కుటుంభాలుండే ఇప్పుడు యూనిక్ ఫేమిలీస్ వచ్చే. దీంతో గ్రహాల ఫలితాలు కూడా పూర్తిగా మారిపోయే.

లగ్నాత్ సప్తమ స్థానం జీవిత భాగస్వామిని సూచిస్తుంది. అప్పట్లో భాల్యవివాహాలున్నందున, వైద్య వసతులు లేనందున  సప్తమ స్థానం చెడి ఉంటే  కేవలం మరణమే సంభవించేది.ఇప్పుడలా కాదు.

లగ్నాత్ పంచమ స్థానం  బుద్దిని, పిల్లలను సూచిస్తుంది. కు.ని చేసుకోక పోవడం వలన  పంచమ స్థాన దుష్ఫలితాలన్ని పిల్లల మీద పడి పల్చ పడేవి.  ప్రస్తుతం ఒకరిద్దరు పిల్లలే ఉన్నందున ఆ ప్రభావం మనుష్యుల బుద్ది పై పడి అది కాస్త వక్రించి నానా తిప్పలు పెడుతూంది.

ఇలా ఎన్నో విషయాలను నా పరిశోధనల ద్వారా రుడీ చేసుకున్నాను.  జ్యోతిష్యం ఒక విచిత్రమైన సబ్జెక్ట్. ఒక కోణంలో చూస్తే చాలా హేతు బద్దంగా, ఒక సైన్స్ లాగా అనిపిస్తుంది. ఇది బిగినర్స్ కు కలిగే ఫీలింగ్. కాని కాస్త లోతుగా వెళ్తే మాత్రం " అమ్మ బాబోయి భగవంతుని అనుమతిలేనిదే ఏ ఒక్క విషయాన్ని కేవలం జ్యోతిష్యం ద్వారా ప్రిడిక్ట్ చెయ్యలేమురా నాయనా" అనిపిస్స్తుంది.

ఏది ఏమైనప్పటికి జ్యోతిష్యం కనీశం ఒక విజ్నానంగానైనా అభివృద్ది చెందాలంటే జ్యోతిష్కులు కొన్నంటిని అలవరచుకోవలసి ఉంది.

1.వెంటనే తమ ప్రాక్టీస్ బంధ్ చేసి అద్యయనం మొదలు పెట్తకున్నా కనీశం ఇతర వ్యాపకాలను ప్రక్కన పెట్టి ఖాళి దొరికినప్పుడల్లా గ్రంథాలను లోతుగా అద్యయనం చెయ్యాలి. వాటిలో పేర్కొన్న ఫలాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారో విశ్లేషించాలి. ఆ జిష్టును పట్టుకోవాలి. స్వతా:గా ఫలితాలు చెప్పే స్థాయికి ఎదగాలి.

2.జ్యోతిష్యం సస్థ  మానవ జీవితానికి  సంభందించింది కాబట్టి వీలైనంతవరకు అన్ని రంగాల పైనా అవగాహణ పెంచుకోవాలి. ఉ.  కంప్యూటర్ రంగంలో రెండు విభాగాలున్నాయి. హార్డ్ వేర్,soft వేర్. ఈ రెండు రంగాలు ఏ గ్రహం యొక్క కారకత్వంలో వస్తాయని తెలుసుకోవాలంటే ఈ రెండిండిని గురించిన ప్రాథమిక సమాచారమన్నా ఉండాలి. ( హార్డ్ వేర్ కుజ కారకత్వం , soft వేర్.భుధ కారకత్వం)

3.భవిష్యత్ అన్నది దేవ రహస్యం. భగవంతుని అనుమతి ఉంటేనే అది దర్శనమిస్తుంది. దాదాపుగా రెండు గంటల దాక ఒకే లగ్నం ఒకే జాతకం . రెండు గంటలంటే 120 నిమిషాలు.మన భారత దేశంలో నాలుగు నిమిషాలకో బిడ్డ పుడుతుందని సమాచారం .అంటే కేవలం మన దేశంలో మాత్రం ఒకే జాతకం, ఒకే లగ్నంలో 120x4=480 మంది పిల్లలు పుడుతున్నారన్న మాట. అంటే ఒకే జాతకం,ఒకే లగ్నంలో 480 మంది పుట్టినప్పుడు వారందరి భవిష్యత్ ఒకే విదంగా ఉంటుందా? అలాగైతే మనకు 480మంది మెగా స్టార్లు ఉండాలిగా? ఎందుకు లేదు. ప్రతి మానవుడు డిఫ్రెంట్ గా ఉంటాడు. అందరిని కేవలం ఏదో ఒక జ్యోతిష్య సూక్తిని పెట్టుకొని ఒకే దొడ్డిలో కట్టేయాలని చూడడం మూర్ఖత్వం. మరి ఆ 480 మందిలో ఎవరు మెగా స్టార్ అవుతారు. తక్కిన 479 మంది ఎందుకు మెగా స్టార్ కాలేక పోయారు. మరేమయ్యారు? ఇవన్ని తేల్చాలంటే భగవంతుని దయ ఉండాలి. ఆ దయకు అర్హులుగా జ్యోతిష్కులు బ్రతకాలి. భగవంతుడు తనను సమస్త సృష్థి రూపంగా ఎక్జిబిట్ చేస్తున్నాడు.ఈ ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతితో మమేకం కావాలి.ఈగో వీడాలి.ఈగో వీడితేనే ప్రకృతితో అనుసందానం సంభవం. అప్పుడే ప్రకృతిలో భాగమైన గ్రహాల ప్రభావాన్ని గణించగలం.

ప్రతి జీవరాశి ఈ సృష్ఠిలో తనను ఓ విడదీయలేని భాగంగానే ఫీలవుతుంది. ప్రకృతితో కలిసి నడుస్తుంది. మానవుడు కూడ ఈ భూమిమీదకు వచ్చినప్పుడు త్రికాల జ్నానంతో ( యూనివర్సల్ మైండ్) వచ్చాడు. కాని సమాజం చొప్పించిన ఈగో ఆ జ్నానాన్ని కప్పెసింది. ఫలానా పువ్వు ఫలానా నెలలో పుయ్యాలని ప్రకృతి ఒక అజెండాను ఏర్పరచింది. అది ఖచ్చితంగా అమలవుతుంది కూడా. అందుకని ఆ చెట్టు టెన్షన్ పడదు, అందులో  హడావుడి ,అలజడి ఏమాత్రం ఉండదు. కాగల కార్యమునకు కావల్సిన ఏర్పాట్లు  క్రమేణా జరుగుతూ ఉంటాయి.

ఇందుకు కారణం ఆ చెట్టు /మొక్క ప్రకృతిలో మమేకమైంది. అలా మమేకమైన నాడే భవిష్య వాణి సంభవం.

4.స్వార్థం వీడాలి. అవును ప్రకృతిలో ఎక్కడా స్వార్థం కనబడదు. నిస్వార్థమే ఉంతుంది. దూడకంటూ తన శరీరంలో ఉత్పత్తయ్యే పాలును ఎలాగో మానవుడేగా పిండుకుంటాడని ఆవు పాల ఉత్పత్తిని ఆపదు,తగ్గించదు. ఎవరోగా కోసుకెళ్తారని మొక్క పూలు పుయ్యడం మానదు. నిస్వార్థాన్ని అలవరచుకుంటే ప్రకృతితో అనుసందానం, గ్రహాల నడకను గుర్తెరగడం,వాటి ప్రభావాన్ని గణించ కలగడం సాథ్యమవుతుంది.

5.వాక్ శుద్ది ఉండాలి. అంటే సత్యమే పలకాలి. అతని మాటలు  సాటి మనుషులకు అహ్లాదాన్ని కలిగించే విదంగా ఉండాలి.

6.జ్యోతిష్యం వేదాల్లో ఓ భాగమే. పూర్వం బ్రాహ్మణులు "శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పొయ్యాలా.. చదివితే నాలిక కొయ్యాలా" అంటూ అమానుషంగా ప్రవర్తించేరు. దాని పర్యావసనంగా జనం వేదమంటేనే భూటకమనే స్థాయికొచ్చేరు .కాబట్టి జ్యోతిష్కులు ఆర్థులను ఎజుకేట్ చేసే ప్రయత్నం చెయ్యాలి. ఏ మాత్రం దాపరికం లేకుండా తాను ఏ కారణం చేత సతరు ఫలితాన్ని చెబుతున్నాడో విడమరచి చెప్పాలి

7.జ్యోతిష్యంలో ఎన్నో అంతర్భాగాలున్నాయి. వాటియొక్క ప్రమాణం ఏమిటి,పరిది ఏమిటి, అవి ఎంతవరకు హేతుబద్దమని విప్పి చెప్పాలి. ఉ. రాశి ఫలాలు, పేరు పొంతనములు, సంఖ్యా శాస్త్రం

8.పూర్తిగా జాతకాన్ని  దగ్గర పెట్టుకుని చెప్పే జ్యోతిష్యమే మంచిదని . ఇతరత్రా పద్దతులంతా లోప భూయిష్ఠమని అవి ఫలించే అవకాశం చాలా తక్కువని చైతన్య పరచాలి.

9.జ్యోతిష్యమన్నది ఎవడబ్బ సొత్తూ కాదు.  అది మన పూర్వీకులు,రుషులు మహర్షుల త్యాగ ఫలం. వారందరు పెన్సిలిన్ కనుగొన్న  అలెగ్జాండర్ ఫ్లెమింగ్లైతే మనం కేవలం ఆ పెన్సిలిన్ సూది వేసే డాక్టర్లము మాత్రమే. గడియారం కట్టుకుని టైం చెప్పేవాడు గొప్పవాడు కాడు గడియారాన్ని కనుగొన్నవాడే గొప్పవాడు. కాబట్టి అనకువతో వ్యవహరించాలి. ప్రజలు మనకిచ్చే సొమ్ము మనం వారికి కేటాయించిన సమయానికి వారిచ్చే నష్ఠ పరిహారం మాత్రమే. ( ఆ సమయంలో మనమింకేదో పని చేసి కొంత సంపాదించుకొని యుంటాముగా - ఆ సొమ్మును వారు కాంపన్సేట్ చేస్తున్నారంతే )

10.జ్యోతిష్కుడన్నవాడు కేవలం ఫలితములను చెప్పువాడు మాత్రమే . ఫలితములను ఇచ్చు వాడు భగవంతుడే. మీ జ్యోతిష్యం నిజమైతే , మీరు చెప్పిన ఫలితాలు జరిగితే అది మీ గొప్పతనం కాదు. జ్యోతిష్యం యొక్క గొప్పతనం. ఒక వేళ మీరు చెప్పిన ఫలితం జరుగకుంటే మీరెక్కడో పొరభాటు చేసారని అర్థం.

2 comments:

  1. చక్కగా, బాగా, వ్రాశారు మురుగేశన్ గారు.ధన్యవాదాలు.

    ReplyDelete