Monday, October 11, 2010

చిరు జగన్ కు మద్దత్తు ప్రకటించాలి

నమస్తే అన్నా  ..!
ఈ రోజు ఈ టపాతో పాటుగా ఒక కవిత్వం కూడ పోస్ట్ చేసాను.ఇక్కడ నొక్కి చదవండి. మీ విమర్శలు, అభిప్రాయాలకు వేచి యున్నాను












చిరు జగన్ కు మద్దత్తు ప్రకటించాలి

జగన్ కు వ్యతిరేకంగా చెక్ పెట్టడానికి  తనను పావుగా వాడుకుని లాభపడి  తనను  రాజకీయ అనాధగా, బృహన్నలగా  శికండిగా (ఏ)మార్చిన కాంగ్రెస్ అదిష్థానానికి దిమ్మ దిరిగేలా చెయ్యాలంటే చిరు చిరు  జగన్ కు మద్దత్తు ప్రకటించాలి. నాడు నేడు నిత్యం అభద్రతా భావంతో తప్పటడుగులు వేస్తూ రాజ కీయ ఆత్మ హత్యకు చేరువవుతున్న  చిరుకు ఇంతకన్నా బెటర్ చాయిస్ లేదు. (ఆవేశానికి గురై పోకుండా చిరు అభిమానులు ఈ టపాను పూర్తిగా చదవాలని మనవి. ఆ పై భూతులు తిట్టినా భాధ పడను)

ఎందుకీ మాట అంటున్నానో దీంతో చిరుకు కలిగే లాభమేమిటో  తెలుసుకోవాలంటే చిరు గతాన్ని దాని గురించిన నా విశ్లేష్ణను చదవండి.ప్లీజ్!

మన దేశంలో ఇప్పటికీ జనాభాలో సగానికి పైగా జనం ఆయా పూట బువ్వకు గ్యారంటి లేక బతుకుతున్నారు. అయినా వారిలో ఎందరికి అభద్రతా భావం ఉందో తెలీదు. మన దేశంలో పది శాతం కుర్రాళ్ళు నిరుధ్యోగులుగా ఉన్నారు .వారిలో ఎందరికి అభద్రతా భావం ఉందో తెలీదు. బోగస్ కార్డుల పేరిట లక్షలాది  రేషన్ కార్డులు రద్దు చేసారు. వారిలో ఎందరికి అభద్రతా భావం ఉందో తెలీదు.

కాని మెగా స్టార్ , కోట్లకు పడగలెత్తిన సంపన్నుడు,పదుల్లో  కుటుంభ సభ్యులు, లక్షల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా ఉన్నప్పటికి చిరంజీవిని మాత్రం అభద్రతా భావం పట్టి పీడిస్తుంది. ఇది ఆయన గారి జీవితంలో కొత్తేం కాదు.

స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి పుత్రికా రత్నాన్ని వివాహమాడేంత వరకు నిజంగా అతను మగధీరుడే. మగమహారాజే. కాని నాడు చిత్రసీమలో నెల్కొన్న కమ్మ ఆధిపత్యానికి జడిచి పోయి నాటి రాజుల్లా వివాహ వ్యూహం పన్నినప్పుడే అతనిలోని అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనబడింది.

చిత్ర సీమలో చిరు కేరియర్ గ్రాఫ్ ను జాగ్రత్తగా పరిసీలిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయి. వరుసగా రెండేసి సినిమాలు ఫెయిల్ అయితే వెంటనే costumes,hair style,make up,dance,fight  అన్నింటిలోను పెనుమార్పులు ప్రవేశ పెట్టడాన్ని గమనించవచ్చు. ( మార్పు నేరమా? అని మీరడగొచ్చు - ఇంతటి పెనుమార్పులు  అభధ్రతా భావానికి సూచికలని మాత్రమే నేనంటున్నాను. పైగా అల్లుడా మజాకావంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులకు సైతం దిగ జారారు. ( అందాక ఎన్.టి.ఆర్ లేని లోటును చిరుతో పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్న నేను చిరును భాయికాట్ చేసేసాను)

ఎన్.టి.ఆర్ రెజిమ్ లో తన వారికి ఒకటి రెండు సీట్లు ఇప్పించుకోవడంలో ప్రారంభమైన చిరు రాజ్యాధికార కాంక్ష స్వంత పార్టి దాకా వెళ్ళింది.( చంద్ర బాబు ఎమ్.టి.ఆర్ పంథాలో చిరు మనుషులకు కొన్ని సీట్లు కేటాయించలేదేమో?)

ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ఉన్న వయో పరిమితి ఉన్న ఏ వ్యక్తి అయినా పార్టి పెట్టొచ్చు అది నేరమేమి కాదు. కాని కాల దేశ వర్థమానాలను పరిగణలోకి తీసుకుని మరి దిగాలి.  ఎన్.టి.ఆర్ వ్యక్తిత్వం వేరు, అతని పనితీరు వేరు, అప్పట్లో ఉన్న స్థితి గతులువేరు. వీటిని  బేరేజు చేసుకోకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు దూకాడు.

తిరుపతిలో జరిగిన తొలి సభలోనే అతని భలహీనతలన్ని భయిట పడ్డాయి. (చివరన పార్టి అజెండాను స్క్ర్రిప్టు చూసి చదవడం) .అసలా స్క్ర్రిప్టే ఏదో కార్పోరేట్ కంపెని వారి వార్షిక నివేదికలా ఉన్నదన్నది నిర్వివాదాంశం.

పార్టి అన్నది సతరు నాయకుని మానస పుత్రికగా ఉండాలి. టీమ్ వర్కుకు నేను వ్యతిరేకం కాదు.టీమ్ ఒక బ్యూటిషియన్లా పని చెయ్యాలే గాని ప్లాస్టిక్ సర్జరి చెయ్యకూడదు. అసలు ప్రజారాజ్యం పార్టియే ఒక కృత్రిమ సృష్ఠి. మెకానికల్ స్ట్ర్రక్చర్.

ఏదో ఊహించి, మరేదో జరుగుతుందని ఆశించి పార్టి పెట్టిన చిరుకు సహజ సిద్దంగా అతనిలో ఉన్న అభద్రతా భావం పరుగులు తీయించింది. రాజ శేఖర్, జీవితల పై దాడి సంఘఠన ఒక ఉదాహరణ. దీంతో ఎక్కడ తను ఆర్థికంగా చితికి పోతాడోనన్న భయంతో ఆశావాహుల వద్దనుండి భారి మొత్తాలు వసూలు చేసే కార్యక్రమానికి మౌనమే అర్థాంగీకారమనే చందాన సమ్మతించారు.

అన్ని పార్టీల్లోను జరిగే తంతే.కాని ప్రజారాజ్యంలో మరీ అధికారికంగా జరగడం, కోవర్టుల (చిరు పద ప్రయోగం) కారణంగా అవి భయిటకు పొక్కడం.. ఆదిలోనే హంసపాదుగా మారింది.

పైగా వై.ఎస్. ఆర్ పరిపాలన పై పెద్దగా వ్యతిరేకత లేదు, చంద్ర బాబా మహా కూటమి కట్టేరు. చిరంజీవి ప్రసంగాలు, కేవలం పెదాల్లోనుండి  వచ్చిన మాటలు ప్రజల గుండెల్లోకి ప్రవేశించ లేక పోయాయి. పార్టికి పునాదులుగా ఉండి,తామే సర్వమై చక్రం తిప్పవలసిన అభిమానులు కేవలం ప్రేక్షక పాత్ర వహించ వలసి వచ్చింది.

నేనైతే ముందుగానే చిరు జాతకం చూసి 20 నుండి  30 సీటు వస్తే ఎక్కువ అని తేల్చేసాను. కాని చిరు భ్రమల్లోనే మునిగి తేలారు. ఫలితాలొచ్చాయి. వై.ఎస్. ఆర్ మరో ఆరు నెలలు బతికి ఉంటే చిరు వై.ఎస్ పాదాల చెంత చేరేవారు. ఎలాగో వై.ఎస్. పోయారు. చిరు అసలు రంగు భయిటపడటం కాస్త ఆలస్యమైంది.

తెలంగాన సమస్య భూతమై లేసినప్పుడు జడుచుకుని తట పటాయింఛి పిరికిలా తెలంగాన జిల్లాలోని క్యేడరును జోకర్లు చేసాడు.  జగన్ కారణంగా చిరుకు కాంగ్రెస్ అదిష్ఠానం ఆహ్వాణం పలికింది.   జగన్ కు వ్యతిరేకంగా చెక్ పెట్టడానికి తనను పావుగా వాడుకుంటున్నారంతేనన్న సంగతిని  గడియారానికి ఉన్నంత భుర్రున్నవాడు సైతం ఊహించ గలడు. కాని చిరు ఊహించ లేక పోయారు.

ఇప్పటికి మంత్రి వర్గం చోటా ? అంటే ఆహ్వాణం అందలేదంటాడు. మైక్రో ఫైనాన్స్ ఆగడాల గురించి మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఉందా అంటాడు. సినిమా చేస్తానంటాడు. అమెరికా వెళ్ళి బరువు తగ్గ్తుతాడు.పాపం చిరు .. నాడు నేడు అభద్రతా భావంతో వనికి పోతున్నాడు. (  అల్లు అరవింద్  పున: నియామకం - పవన్ పున:ప్రవేశం గురించిన ప్రకటలన్ని దీనినే చాటుతున్నాయి.

చిరంజీవి ఎవరన్నా గుర్తు చేస్తే బావున్ను "అతనో మెగా స్టారని" అప్పటికన్నా అతని మనస్సులోని అభద్రతా భావం తొలుగుతుందేమో చూడాలి.

భలహీనుడుగా ఉండటం కూడ తప్పు కాదు. భలహీనుడుగా ఫీలవ్వడమే తప్పు.అదే ఓటమికి హేతువు. జగన్ కు వ్యతిరేకంగా తనను పావుగా వాడుకుని లాభపడి  తనను  రాజకీయ అనాధగా, బృహన్నలగా  శికండిగా (ఏ)మార్చిన కాంగ్రెస్ అదిష్థానానికి దిమ్మ దిరిగేలా చేసే ఎత్తు వెయ్యాలి.

ప్రభుత్వం ఉందా అన్న దుస్థితి ఉన్నందున - ఇది చిరుగారి మాటే - (ఇందుకు కారణం ప్రభుత్వానికి రోశయ్య  నేతృత్వమే కనుక) సి.ఎల్.పి సమావేశం ఏర్పాటు చేసి సి.ఎల్.పి నేత ఎంపిక పై మరో సారి  అభిప్రాయం కోరాలి. సీక్రెట్ బ్యేలెట్ నిర్వహించాలని  కోరాలి.

కనీశం రోశయ్య పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలి.  జగన్ కు ఒక అవకాశం ఇస్తే తప్పేంటి - పార్టి అంతర్గత కుమ్ములాటలు సముసి - ప్రజా సమస్యల పై దృష్ఠి పెట్టే అవకాశం ఉంటుందనాలి.

దెబ్బకి సోనియాకు దిమ్మ తిరిగి  ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ప్రజా రాజ్యానికి మంత్రి మండలిలో స్థానం సైతం  వెతుక్కుంటూ వస్తుంది.

2 comments:

  1. మీరు వాలిద్దరికి మధ్యవర్తిగా ఉండి,చిరుకి ఒక ౧౦,౦౦౦ కోట్లు ఇప్పించండి.అపుదాయన ఎందుకు సపోర్ట్ చేయ్యదో చూద్దాం.

    ReplyDelete