Friday, October 15, 2010

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్ !

నేను ఎన్.టి.ఆర్ ను కీర్తిస్తుంటే చాలా మంది నన్ను కమ్మ కులస్తునిగా  ఊహించుకుంటారు. వీరభ్ర్హహ్మేంద్ర స్వామిని పూజిస్తే స్వర్ణ కారుడ్నని భావిస్తారు,వైఎస్. ను కీర్తిస్తే రెడ్డి కులస్తుడ్ని అనుకుంటారు. కాని నేను తమిళ ముదలియార్ కులస్తుడ్ని. రాష్ఠ్ర్ర) విభజనకు పూర్వం మా కులం బి.సి జాబితాలో ఉండేది .కాని ఎందుకో తొలగించ బడింది. వై.ఎస్.  మాకులాన్ని బి.సి. జాబితాలో పునరుద్దరించాడన్నది ఇక్కడ అప్రస్తుతమైనా చెప్పక తప్పడం లేదు.

ఏమన్నానూ..ఆ.. నేను కమ్మకులస్తుడను కాను. నాకు మతపిచ్చి,కుల గజ్జి లేదంటే లేదు గురువా.. నా మనస్సు ఎవరిపై మొగ్గితే వారిని అభిమానిస్తుంటాను.  ఎన్.టి.ఆర్  నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడన్నాను కదా అందుకు సంభంధించిన రెఫెరెన్స్ టు ది కాంటెక్స్ట్ చూసే ముందు ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించిన సన్నివేశాన్ని మీతో పంచుకుంటా.

అవును బాసూ.. నిజంగానే  ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించాడు. అదీ భారి భహిరంగ సభలో. రాజీవ్ "గలి గలి మే షోర్ హై రాజీవ్ గాంథి చోర్ హై " అని కీర్తించబడుతున్న సమయాన వచ్చిన ఎన్నికల ప్రచారానికంటూ చిత్తూరు కణ్ణన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు ఎన్.టి.ఆర్ వచ్చారు.

అంతకు పూర్వం అప్పట్లో తెలుగు యువతా ప్రచార కమిటి సభ్యునిగా " ఎన్.టి.ఆర్ వస్తున్నాడహో.." అంటూ వ్యేనెక్కి మైకు పట్టి ప్రకటిస్తూ  ఊరంతా తిరిగి  వచ్చాను . ఎన్.టి.ఆర్ రావటానికి ఆలశ్యమైంది. తుంపర్లు మొదలయ్యాయి. వెంటనే ఎవరో నాయకుడు నన్ను పిలిచి " ఏదన్నా మాట్లాడు.. జనం ఆగేట్లు చూడు "అన్నాడు.

మైకు పట్టుకున్న నేను " సోదర్లారా దేశమే బోఫర్శీ బోఫర్శని కోడై కూస్తుంది కదా. ఆ బోభర్స్ అంటే ఏమిటో అందమైన చందమామ కథలా చెబుతా" అని మొదలు పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాను.
నా మాటల్లో ప్రజలు, ప్రజల స్పందనతో నేను మై మరచి పోయాం.

సడెన్ గా ఎన్.టి.ఆర్ చైతన్య రథం మైదానంలోకి ప్రవేశించేసింది. మొదట తేరుకుంది నేనే. ప్రసంగాన్ని ఆ క్షణమే ఆపి "ఎన్.టి.ఆర్ జిందాబాద్ " అంటూ నినదించాను . వెంటనే ప్రజలందుకున్నారు. ( ఎన్.టి.ఆర్ ఎంట్రి తరువాత జనంలో ఎటువంటి రియాక్షన్ ఉంటుందో మళ్ళీ చెప్పాలా) ఎన్.టి.ఆర్ జనాన్ని చూసి అభివాదం చేస్తూ నా వైపు చూసారు. నేను రెండు చేతులు జోడించి నమస్కరించాను.

వెంటనే అభివాదం ఆపి నన్నాశీర్వదించారు. ఈ సన్నివేశాన్ని ఇప్పుడు తలచుకున్నా ఒళ్ళంతా పులకరిస్తుంది.

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్:

1999 ఎన్నికలు పూర్తయ్యాయి. తె.దే.పా ఘన విజయం సాధించింది. ఎన్.టి,.ఆర్ సి.ఎం అయ్యేరు. ఆనందం ఆపుకోలేక  సచివాలయం చిరునామాకు ఒక ఉత్తరం పంపేను. వెంటనే ఎవరో సెక్రెట్రి సమాధానం పంపేరు.

అప్పట్లో మా నాన్న రిటైర్డ్ అయ్యి ఇంటికొచ్చేసారు. ( జిల్లా ఖజాణా అధికారిగా చేసారు) ప్రత్యుత్తరం సంగతి నేను చెప్పాను. ( ఆయన గారికి నేనంటే ఎప్పుడూ చిన్న చూపే - కాని నా మీద వల్ల మాలిన ప్రేమ కూడాను)

"ఒరేయి.. ఎన్.టి.ఆర్ సినిమా వాడు కదా.. నీ లాంటి వెర్రి వెంగళప్పల ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపడానికే ఒక టీమ్ పెట్టుకొని ఉంటాడు. ఏదీ.. నీకో ఉధ్యోగం ఇమ్మని వ్రాయి.. ఇస్తాడేమో చూద్దాం " అన్నాడు.

నెలరోజులు రాద్దామా వద్దా అని తట పటాయింపు ( ఎన్.టి.ఆర్ నాకు దేవుడుతో సమానం - మరి ఆయన నుండి నిరాధారణ ఎదురైతే భాధేగా - చివరికి ధైర్యం చేసి " కులాంతర వివాహం తదితర అంశాలను ప్రస్తావించి చిన్న ఉధ్యోగం ఇప్పించాలని ఉత్తరం వ్రాసాను.

మీరు నమ్మితే నమ్మండి.. లేకుంటే మీ ఇష్ఠం. నాలుగు రోజులో మళ్ళీ సి.ఎం.కార్యాలయం నుండి ఉత్తరం.
కులాంతర వివాహం చేసుకున్నవారిలో విద్యార్హత ఉన్నవారు  ఓ.సి అయినా వారిని బి.సిగా గుర్తించే జీ.ఓ,
హౌసింగ్లో ఇవ్వ్వవలసిన రిజర్వేషన్, క్యేష్ రివార్డుకు దరకాస్తు చేసుకోవలసిన పద్దతి, సంభందిత ఫార్ములతో  కలెక్టరు వారికి అడ్రెస్ చేస్తూ ఉత్తరం వచ్చింది.

( ఆ ఉత్తరంతో జిల్లా యంత్రాంగం చేత పని చెయ్యించుకోలేక పోయినది వేరే కథా.. కాని వారానికి స్పందించే  యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న  ఎన్.టి.ఆర్  పరిపాలనా దక్షుడా? లేక ఆరు సంవత్స్రరాలైతే కాని, మరీ పది రూ. ఎమ్.ఓ పంపి జిల్లా విణియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేస్తే కాని స్పందించిన చంద్రబాబు పరిపాలనా దక్షుడా.. మీరే నిర్ణయించుకొండి - చంద్ర బాబును నేను విమర్శిస్తే కొందరు నొచ్చుకోవచ్చు - కాని ఇటువంటి అనుభవాలు వందలకు పైగా ఉన్నాయి నాకు)

No comments:

Post a Comment