Thursday, October 7, 2010

యండమూరి నా పై పోలీసు కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానన్నాడు

యండమూరి అంటే ప్రముఖ రచయిత వీరేంద్ర నాథ్ గురించే ఈ టపా. నేను తమిళునిగా ఉన్నప్పటికి  ప్రస్తుతం సిని రంగంలో   కథా రచయితగా స్థిరపడ్డ (?) జనార్థన మహర్షి ద్వారా వీరేంద్రనాథ రచనలు నాకు పరిచయమే ( 1987) అప్పట్లో జనార్థన మహర్షి వీరేంద్ర నాథ్ గారికి వీరాభిమాని. తన పేరును కందమూరి జనార్థన్ గా పెట్టుకుని రచనలు కూడ చేసేవాడు. అప్ప్పట్లో నేను నడిపిన చిన్ని పత్రికలో "ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా?" శీర్షికతో ఒక సీరియల్ కూడ మొదలు పెట్టాడు.

నేను ఎన్.టి.ఆర్ అభిమానిని. ( చాలంజ్ రాముడు పీరియడ్) ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి పోయిన తరువాత చిరంజీవి అభిమానిగా మారాను (కాస్త  అప్డేషన్ ఉండాలిగా). వీరేంద్ర నాథ్ రచనలు సినిమాలుగా రావడం. అందులో చిరంజీవి హీరో కావడంచేత అతని రచనలపై ఆసక్తి పెరిగింది.అప్పటికే  తెలుగు వ్రాయడం,చదవడం కాస్త సుళువైన పని అయ్యుండటం చేత డైరక్ట్ నవల్స్ చదవడం ప్రారంభించాను.

అంతకు పూర్వం సుశీలా కనకదుర్గా అనే ఆవిడ వీరు రచనలను తమిళంలోకి అనువదించేది. (సీరియళ్ళుగా కూడ విడుదలై వీరు రచనలు సంచలనమే సృష్ఠించాయి)

"యండమూరి నా  పై పోలీసు  కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానన్నాడు" అని టైటిల్ పెట్టి ఇదేం సోదిరా నాయనా అని విసుక్కోకండి. వయస్సు మీద పడుతుంటే పాయింటుకు రావడానికి పది నిమిషాలవుతుంది.

ఈ ఫ్లాష్ బ్యాక్స్ అంతా చెప్పటం అంత పెద్ద వ్యక్తి ఎంత చిల్లరగా ప్రవర్తించాడో నొక్కి చెప్పడానికే. సుశీల  కనకదుర్గ ( ఆవిడ అవువాదంలో వాడిన భాష చూస్తే బ్రామిన్ అనే అనిపిస్తూంది) తన తెలివితేటలు ఉపయోగించి వీరుకున్న మార్కెట్ వేల్యూని డబ్బు చేసుకుంది.అదెలా అంటే ఇతర రచయతల రచనలను వీరు రచనలని పబ్లిషర్సును నమ్మించి వాటిని అనువదించి మూలం: వీరు అనువాదం: సు.క.దుర్గా అని ప్రచురింప చేసింది.

నిజానికప్పుడు నాకు తెలుగు నవలా ప్రపంచం గురించి ఏమాత్రం తెలీదు.అయినా కొన్ని అనువాదాలు చదివినప్పుడు నా sixth sence చెప్పింది. ఇది వీరు రచన కాదేమో? వెంటనే నా తెలుగు మిత్రులను కలిసి వెరిఫై చేసాను. నిజం భయిట పడింది.వెంటనే వీరుగారికి ఉత్తరాముఖంగా జరుగుతున్న మోసాన్ని సవివరంగా తెలియ చేసాను. కాని నో రెస్పాన్స్.

కొన్నాళ్ళకే యుద్దన్నపూడి సులోచనారాణి గారు వీరుకు లాయర్ నోటీస్ ఇచ్చిన మాట మీ అందరికి విదితమే. ఒక దశలో వీరు రచనలను మనమే అనువాదం చేస్తే ఎలా ఉంటుందనిపించి వీరు గారిని కాంటాక్ట్ చేసాను.వెంటనే అనుమతించారు.కాని అప్పట్లో నాకున్న పరిమిత ఆర్థిక వనరుల వలాన పబ్లిషర్సును పట్టుకోలేక పోయాను.

ఇదిలా ఉంటే నాకు ఇంటర్ నెట్ పరిచయమైన కొద్ది రోజులకే వీరు గారి మెయిల్ అడ్రస్ నాకు దొరికింది. భారత దేశంయొక్క సర్వ సమస్యలను సమూలంగా పరిష్క్తరించటం కోసం నేనో పథకం రూపొందించియున్నాను దీని పై చాలా వ్యవహారం నడిచింది.

ఆ వివరాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలిగితే ఇక్కడ నొక్కండి.

 ఆ పథకం యొక్క సారం, దాని ప్రచారం,అమలు కొరకు నేను చేసిన ప్రయత్నాలను వీరు గారికి మెయిల్ ద్వారా పంపాను.

పంపాను అనడానికన్నా పంప కోరాను అనొచ్చు. ( ఇంటర్ నెట్ సెంటర్ వారిని) వారు పంపేరు. కొంత కాలానికి  గౄప్ మెయిల్స్ పంపే విద్య అబ్బింది. నేను గైకొన్న ప్రచారంలో భాగంగా అందరికి మెయిల్స్ పంపేవాడ్ని. గుంపులో గోవిందా అని వీరుగారికి కూడ నా మెయిల్స్ వెళ్ళేది.

నా పథకం పై స్పందించ వలసింది పోయి మరో సారి మెయిల్ పంపితే పోలీస్ కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానని మెయిల్ పంపాడు వీరేంథ్రనాథ్. నాకు తల కొట్టేసినట్టైంది. వెంటనే బ్రవుజింగ్లో ఆరి తేరిన వారిని సంప్రదించాను. వారు ఏమన్నారంటే " పిచ్చి..నా ...నీ మెయిల్ అతనికి అనవసరం అనుకుంటే దానిని స్పమ్ గా మార్క్ చేస్తే చాలు అది స్పమ్ ఫోల్డర్లో పడుంటుంది. మాకు రోజుకి వేల కొలది ఇటువంటి మెయిల్స్ వస్తుంటాయి. దీనికి కమీష్నరుకి ఏమిటి సంభందమన్నారు" ఇంకా లోతుగా చర్చించి  వెంటనే ఆయనగారి మెయిల్ ఐడిని నా అడ్రస్ లిస్టునుండి తొలగించేసాను.

 కమీష్నరుకి స్పమ్ మెయిల్కి ఏమిటండి సంబంధం? మీకంత సరదాగా ఉంటే ఇవ్వండి  అంటూ చివరిగా ఒక మెయిల్ పంపాను.

పంచ్:
తదుపరి దశలో ఆయనగారు గౌ. సంపాదకీయం వహించే సైకాలజి టుడే మేగజిన్లో నా రచనలూ వెలుబడ్డాయి. ఆయనగారిని పిలిపించి సెమినారు జరిపే పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు నా చేతా ఒక సెమినార్ నిర్వహించేరు. పాపం! వీరేంథ్ర నాథ్ గారికి ఈ క్షణం దాకా తెలీదు s_murugesan_67 అన్నా చిత్తూరు మురుగేశన్ అన్నా ఒకరేనని మీరు చెప్పకండేం!

No comments:

Post a Comment