Friday, October 15, 2010

ఎడిటోరియల్ ను సైతం అమ్ముకుంటున్న ఆంద్రజ్యోతి

ఈ ఆరోపణను అన్ని పత్రికల పై చెయ్యాలో ఏమో? ( నేను జ్యోతి మాత్రమే తెప్పిస్తున్నా అన్ని పత్రికలవారు ఈ పనేచేసారేమో? ( ఈ రోజున)

ఇటీవల ప్రతి చిన్న విషయానికి చంద్ర బాబు "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" - అనే వాక్యాన్ని ఎడా పెడా చెప్పేస్తున్నారు. ప్రతిపక్షంలో పడ్డాక చంద్ర బాబు" మైండ్ సెట్ భాగా మారింది". పాపం ఆయనగారు సి.ఎంగానే చెడ్డారు. కళ్ళకు గంతలు, చెవుల్లో కాటన్ బేళ్ళు . ఆయనకేం తెలీదు పాపం. లోకల్ ఎమ్.ఎల్.ఏ కన్నా ఎస్.పి మాటే గొప్ప.( తాను నెగ్గి, తనను సి.ఎం చేసింది ఆ అమాయకులేనన్న సంగతిని సెలెక్టివ్ అమ్నీషియా కారణంగా మరిచి పోయారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్న భ్రమలో ఉండి పోయారు. ఆయన కారు క్రింద క్లైమోర్ బాంబు(?) పేలితే గాని, సానుభూతిని క్యేష్ చేసుకోవడానికి ముందస్తుకెళ్ళి ఓడి పోతే గాని పాపం ఆయన మైండ్ సెట్ మారలేదు.

కొందరు కొన్ని పాత్రల్లోనే విజృంభిస్తారు. ఉ. రోశయ్య నెంబర్ టూగా ( వై.ఎస్. దశావతారంలో కమల్ హాసన్ లా భహుపాత్రాభినయం చేసారనుకొండి -అదిష్ఠానానికి వేధేయత కాడనుండి - టి.ఆర్.ఎస్. శాసన సభ పార్టిని చీల్చడం దాక - అన్నింటా బెస్ట్ పెర్ఫార్మెన్సే - కాని ఈ రికార్డు అందరికీ సాధ్యం కాదు కదా?

ఓకే బాబు విషయానికొస్తా. రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంవారంతా నెగటివ్ థింకర్స్ అయినట్టుగా బాబు ఒకరే పాజిటివ్ థింకర్ అయినట్టుగా మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇచ్చేవారు. ఎన్నికల సమయంలోనే రాజకీయమని సూత్రీకరించి "ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని"మండి పడే వారు. మైండ్ సెట్ మార్చుకోమని సలహాలిచ్చేవారు.

మైండ్ సెట్ ఏమన్నా టి.వి సెట్టా ఎక్చేంజ్ ఆఫర్లో బ్లాక్ ఆండ్ వైట్ ఇచ్చేసి కలర్ తీసుకోవడానికి. ఎలుక తోలు ...నలుపు నలుపే బాబుగారు. సారి! నేనేదో చెప్పాలనుకుని ఈ సోదిలో తగులుకున్నా ఈ మద్య భాబు మాటలే నా నోట (చేత) కూడ వస్తున్నాయి.

ఈ మద్య "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" అనే వ్యాఖ్యను ఊత వ్యాఖ్యలా వాడి పారేస్తున్నారు. ( బాబు గారి ఊత్ పదాలు గుర్తున్నాయా? - ఈ విదంగా మనం ముందుకు పోతున్నాం) . నిజానికి ఈ మాట అనాల్సింది దినపత్రికలను ఉద్దేశించే!

హై కోర్టు జడ్జి ముందు పేపర్ క్లిబ్బింగ్ పెడితే యాబైకి సింగిల్ కాలమ్, వందకు డబుల్ కాలమ్ వార్తలొస్తాయి.అవన్నీ తీసెయ్యండి అన్నారుట. ఎన్నికల సమయంలో ప్రకటనలు వార్తల రూపంలో వెలుబడ్డ వైనాన్ని ఏకంగా సుప్రీమ్ కోర్టే ఖండించింది ( అనుకుంటా)

గతంలో ప్రకటనలు స్వీకరించటానికి ఎన్నో నిభందనలుండేవి. ఒక సారి ఈనాడులో చిన్న ప్రకటన ఇవ్వాలని వెళ్ళాను. " జ్యోతిష సలహా రుసుము : రూ. వంద - కంప్యూటర్ జాతకం ఉచితం" అన్న మాటకు అక్కడి సిబ్బంది అభ్యంతరం తెలిపారంటే చూసుకొండి.

ఇప్పట్లో ప్రకటనల విశ్వసనీయతకు మేం భాధ్యులం కామని కంటికి కనబడి చోట ముద్రించుకుని ఒక్క రోజులో భరువు తగ్గే ప్రటనలను సైతం ప్రచురిస్తున్నారు. " వీరు ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు"

గతంలో ప్రకటనను వార్తా రూపంలో ప్రచురించి పొడి పొడి అక్షరాల్లో ఏ డి వి టి అని పెట్టే వారు. ఆతరువాత ప్రకటన దారుల నిభందన మెరకు "స్పాన్సర్డ్ ఫీచర్"అని పెట్టారు. దమ్మున్న చానలని రొమ్ము భాదుకునే ఆంద్రజ్యోతి ఇందులోనూ సంచలనం సృష్టించింది.

Advertisement - Editorial అనే రెండు పదాలను కలిపి అడ్వెర్టోరియల్ అనే కొత్త పదాన్నే సృష్ఠించింది
ఏకంగా రెండు ఫుల్ పేజీలు రోశయ్యగారి విశ్వరూపాన్ని (?) చిత్రీకరించే వార్తలు పెట్టింది. రోశయ్యంటే నాకెంతో గౌరవం. ఆయన మాత్రం ఆర్థిక మంత్రిగా లేకుంటే వై.ఎస్.విచ్చలవిడి సంక్షేమ పథకాలతో రాష్ఠ్ర్ర్రం ఎప్పుడో దివాళాతీసేదని, అసలు వై.ఎస్. చరిస్మాకు పవర్ (ఫైనాస్న్ జెనరేటరే రోశయ్యని చెబుతుండేవాడ్ని. అందుకే ఆయనగారిని విమర్శించాలంటే మాటలు రావడం లేదు ( నేను ఇంకా రాజకీయ నాయకుడ్ని కాలేదుగా.. ఈ గంట పొగిడి తదుపరి గంటే విమర్శనాస్త్ర్రాలు సంథించడానికి)

రోశయ్య అనుకోవచ్చు తన చిరకాల కోరిక (నెంబర్ వన్ అవ్వటం) నెరవేరిందని. కాని ఈ సి.ఎమ్ పదవి అన్నది ఈ టపా అంతా టైప్ చేసాక కంట్రోల్ ఏ నొక్కి ఆ పై డెలిట్ మీట నొక్కినట్టేనని ఆయనగారికి అర్థం కావడంలేదు.

జగన్ రోశయ్యను సి.ఎమ్ గా ప్రతిపాదించినట్టే రోశయ్య సోనియావద్ద హోం మినిస్టర్ కమ్ డెపుటి సి.ఎంగా జగన్ ను ప్రతిపాదించి ఉంటే ఇలా డబ్బులిచ్చి ఎడిటోరియల్ కొనుగోలు చేసే దుస్థితి వచ్చేది కాదు. ఎడిటోరియల్ ను అమ్ముకోవడానికి ఆంద్రజ్యోతికి సిగ్గుండదని నాకు తెలుసు ( ఆ రెండు పత్రికల్లో అదీ ఒకటని వై.ఎస్. ఏనాడో తేల్చారు కాబట్టి) కాని కొనుక్కోవడానికి రోశయ్యకు సిగ్గు లేక పోవడం కాస్తా ఆశ్చర్యాన్ని కలిగించింది.

హుం.. "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" అని చెప్పడానికి నేను బాబును కాను. నేను చెప్పదలచిన మాట " అందరం ( ఇటువంటి నీచ సంస్కృతులను ప్రశ్నించకుంటే మనమూ దానిలో భాగస్వాములమే గా) ఎక్కడికి పోతున్నామో నాకు భాగా అర్హ్తమైంది . ఎక్కడికి పోతున్నామంటే " సంపూర్ణ నైతిక పతనానికేసి - బుల్లెట్ ట్రెయిన్ తరహాలో బుల్లెట్ లా దూసుకు పోతున్నాం

4 comments:

  1. business is an art,one can throughly should know wat to sell nd how to sell.Andhrajyothi knows it very well thats why they r selling it.wats wrong in it murugaaaa...

    ReplyDelete
  2. murugaa..endayya nee parignaanam?aa..vyasula vaaru ,bhagavatham akhari scandamlo kali lakshanaalu entha baagaa raasaaro meeru chadavakapovadam emainaa baagundaa?before u answer,u have to read alot sishyare...

    ReplyDelete
  3. all my comments were meant on u ,for increasing the zeal in u my dear friend nd they r nt ment for to criticize u.....

    ReplyDelete
  4. Sir.
    Some of my writings may be foolish but I am not that much fool to misunderstand you sir.
    Thank you for your continuous interest on me and my writings.

    Always I seek the blessings of elders like you Sir

    ReplyDelete