Saturday, October 9, 2010

ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ఉత్త తిక్కలోళ్ళు

ఎవరికన్నా నాయకుడ్ని  కావాలన్న కోరిక పుట్టిందంటేనే అతనిలో  కాస్తో కూస్తే తిక్క ఉండాలి. మనిషిలో ఉన్నది ఒకే పవర్ అది సెక్స్ పవర్. కేవలం సెక్సు ద్వారా ఎగ్జాస్ట్ అయిపోయేంత పవర్ ఉన్నవారు సామాన్యులవుతారు. సెక్సు ద్వారా, పిల్లలను కనడం ద్వారా కూడ ఎగ్జాస్ట్ కానంతగా సమృద్దిగా సెక్స్ పవర్ ఉన్నవారే నాయకులవుతారు. సెక్స్ యొక్క లక్ష్యం spread  కావడం ,( తన తెగ/జాతిని వ్యాపింప చెయడం)  expand ( పిల్లలు పెరిగి పెద్దవారైతే వారీ ప్రపంచమంతటా తిరుగుతారు- ఇతని ప్రతి రూపమే పిల్లలు కాబట్టి తనే తన పరిదిని పెంచుకున్నట్టు  expand అయినట్టు మానవుడు ఫీల్ అవుతాడు)  ,తన మరణాన్ని ఏదో విదంగా గెలవడం లేదా వాయిదా వెయ్యడం ( పుట్టినవాడు ఇతని ప్రతిరూపం -ఇతను మరణించినా ఇతని ప్రతిరూపంగా కొడుకు బ్రతికే ఉంటాడు)   మరణాన్ని చవి చూడటం ( ఇదీ సెక్సులో సంభవం - వీర్య స్కలన సమయాన కలిగే బ్లాక్ అవుట్ - బుల్లి మరణం) .

నూటికి 99.99 శాతం మానవులు డి-జెనరేటడ్. వారు సెక్సు,పిల్లల్ని కనడంతోనే ఎగ్జాస్ట్ అయిపోతారు. కొందరు తమలో మిగిలి ఉన్న పవర్ - అదే సెక్స్ పవర్ ప్రేరణతో వ్యాపించాలి, వృద్ది చెందాలి,  తమ ఉనికిని చాటాలి అని తపిస్తుంటారు. సెక్స్ పవర్ అంటే క్రియేటివ్ పవర్. ఎన్.టి.ఆర్ నటుడుగా, కళాకారుడుగా సెక్స్ పవర్ ను  సృజణాత్మకతగా మలచుకుని ఆత్మ సంతృప్తి చెందుతూ వచ్చారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమను తన కనుసైగల్లో నడిచేలా చేసారు. మకుటం లేని మహారాజుగా ఏలారు. అయినా అతనిలో శక్తి ఊరుకోలేదు .పై పైకి ఉబికింది.ఉరకలేసింది.ఎగ ప్రాకింది. అందుకే రాజకీయ రంగ ప్రవేశం చేసారు.

పవర్ను  ఎల్లప్పుడూ ఎంప్లాయి చేస్తుండాలి. లేకుండే అది తను స్టోర్ అయిన కంటెయినరును  (బాడి) బాధించటం మొదలు పెడుతూంది.  దీంతో అదనపు శక్తి గలవారు  తమలోని శక్తిని ఎలాగైనా భయిటకు విసిరెయ్యాలనే చూస్తుంటారు. దీనిని చూసి సామాన్యుల్ తిక్క అనుకుంటారు. పరిణితి చెందినవారు దీనిని సద్వినియోగం చేస్తుంటారు. పరిణితి చెందని వారు మర్లా సెక్సు వంక మొగ్గ చూపి అప్రదిష్ఠ పాలవుతారు. ( ఉ.తివారి -మాజి గవర్నరు, నిత్యానందా) .

ఎన్.టి.ఆర్ డజన్ మంది పిల్లలను కన్నారు. ఆ సందర్భంలో అతనిలో ఎటువంటి రెస్ట్ లెస్ నెస్ లేదు. అందరివాడుగా మెలిగారు. పిల్లలను కనే అవకాశం అయిపోయాకే అతనిలో రెస్ట్ లెస్ నెస్ పెరిగి ఉంటుంది. పవర్ ఎప్పుడు పవరును కోరుకుంటుంది. అందుకోసమే చంద్రబాబును అల్లుడు చేసుకున్నారేమో? చంద్ర బాబుకు పదవి పోవడం, దాని కోసం ఎన్.టి.ఆర్ దేశ రాజదానికేకడం,అక్కడ పరాభవానికి గురికావడం అందరికి విదితమే. ఈ సంఘఠన అతనిలోని పవరును ప్రవోక్ చేసింది. ఈగర్ టు పవర్ గా మారింది. తెలుగుదేశాం ఆవిర్భవించింది.

ఏ రాజ్యాధికారం కోసమైతే గినెస్ రికార్డును సైతం బద్దలు కొట్టి ప్రభుత్వ పగ్గాలు అందుకున్నారో. . ఆ రాజ్యాధికారం సైతం అతనిలో ఉభికిన అదనపు శక్తిని సంతృప్తి పరచలేక పోయింది.  భాస్కర్ రావు వెన్ను పోటు పొడవకుండా ఉండి ఉంటే ఎన్.టి.ఆర్ రాజకీయాల్లోనుండి పై తొలిగే వారేమో? ( రాజ్యాధికారంతో సంతృప్తి చెందక) లేదా రాష్ఠ్ర్ర రాజకీయాలనుండి కేంద్ర రాజకీయాల పై దృష్ఠి పెట్టేవారేమో?

కాని భాస్కర్ రావు పుణ్యమా అని ఎన్.టి.ఆర్ లోని పని దెయ్యానికి పని కలిగింది, తదుపరి వచ్చిన సాధారణ ఎన్నికల్లో  అధికారం పోయినా మళ్ళీ సినిమాల్లో నటిస్తానన్నారు. నటించారు. ఇవన్ని ఆయనలో ఉబికిన శక్తియొక్క వివిధ  రూపాలే.

అతనిలోని అధనపు శక్తి అతనిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయి కాని పవర్ బాడిని దెబ్బ కొడుతుంది. ఈ విదంగా పక్షవాతానికి గురయ్యారు. మళ్ళీ పెళ్ళాడారు. సామాన్యుడైతే " ఎలాగో కుర్చి దక్కింది.దీనిని దక్కించుకుంటే చాలనుకునే వాడు. కాని ఎన్.టి.ఆర్ లిక్కర్ మాఫియాకు లొంగ కుండా మద్య పాన నిషేదాన్ని అమలు చేయ చూసారు.

లిక్కర్ మాఫియా చంద్రబాబును కొనేసింది. కొందరు "రాజ గురువులు" ఇందుకు బ్రోకరేజ్ చేసేరు. ఆ వెన్నుపోటు ఎన్.టి.ఆర్ కు గుండె పోటుగా మారింది.

అన్ని సవ్యంగా ఉన్నప్పుడే ఎన్.టి.ఆర్ తాననుకున్నట్టు  భారత దేశం పార్టి స్థాపించి ఉంటే అతనిలోని దెయ్యానికి పని కల్పించినట్టయ్యేది. ఇక్కడ బాబుకు పగ్గాలిచ్చి తాను ఉప ప్రధానియో ,ప్రదానియో అయ్యుండేవారు.

ఏం చేద్దాం !
సమాజంలో శక్తి హీనులు మెజారిటిగా, శక్తిమంతులు స్వల్పంగా ఉన్నారు. శక్తి హీనుల్లో అథ్యధికులు అహంకార రహితులుగా వారికి హారతి పట్టిన రోజులు పోయాయి. (కలిప్రభావం) పల్లెల్లో పచ్చిగా చెబుతారు" ఎనుగును...........లంటే సరిపోతుందా దానికి సరిపడే ........ ఉండాలిగా. కాని నపుంశకులు సైతం రంభా,ఊర్వశులను కోరుకునే రోజులొచ్చాయి. వీరా శక్తి హీనులు. కాని కేవలం ఇగో కారణంగా శక్తి స్వరూపుడైన ఎన్.టి.ఆర్ మరణానికి కారకులయ్యేరు.


వై.ఎస్.ఆర్ విషయానికొస్తే అతని తండ్రి రాజారెడ్డి  ద్వారా సంపద, మెన్ పవర్ , ఆధిపత్యం  సంక్రమించినా వై.ఎస్. ఆర్ లోని పవర్ దాంతో సంతృప్తి చెందలేదు.  మరింత డబ్బు సంపాదించాలని అనుకొని ఉంటే అతనికున్న వనరులతో చెయిన్స్ ఆఫ్ హోటల్స్ లా చెయిన్స్ ఆఫ్ హాస్పిటల్సే నిర్మించి ఉండవచ్చు. కాని అతనిలో ఉబుకుతున్న పవర్ రాజ్యాధికారాన్ని కోరింది.

డబ్బు,అధికారం పై ఎటువంటి మక్కువ లేని వారు శక్తి హీనులని అర్థం. డబ్బు కోరుకునే వాడు,కేవలం డబ్బుతో సంతృప్తి పడేవాని శక్తి   ద్వితీయ శ్రేణికి చెందినది.   రాజ్యాధికారాన్ని కోరువాని శక్తి అమితం. ఇది ప్రథమ శ్రేణికి చెందింది. రాజారెడ్డి బతికున్న రోజుల్లోనే ,వై.ఎస్. విథ్యార్థి దశల్లోనే ఆయన ఆదాయపు పన్ను చెల్లించే హోదాలో ఉన్నారు. మని పవర్ పై మక్కువ క్షీణించటానికి ఇదీ ఒక కారణమై ఉంటుంది.

2004  ఎన్నికలను ప్రక్కన పెడతాం. అది కూటమియొక్క విజయం. కాని2009 ఎన్నికలను చూస్తే మనకర్థమవుతుంది.వై.ఎస్.ఆర్లోని పవర్ ఎంతటి శక్తిమంతమైందో. శక్తిమంతులు ఎప్పుడూ సవాళ్ళను స్వీకరిస్తారు. అన్ని పార్టీలు వై.ఎస్. ఆర్ పై పగతో ఒకటయ్యాయి.మరో ప్రక్క చిరంజీవి అభినవ ఎన్.టి.ఆర్లా విర్ర వీగుతున్నారు.స్వపక్షంలోను ఒక వర్గం శల్య సారథ్యం చేస్తుంది.

ఈ పరిస్థితిలో ఎవరైనా ఏదో అండ చూసుకుంటారు (కాంగ్రెస్ లోనైతే అదిష్ఠానం),రేపు ఓటమి ఎదురైతే  అందుకు కారణాలుగా చూపటానికి  ఏవో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. భాద్యతను మొయ్యడానికి బలిపశువులను సిద్దం చేస్తారు.

కాని వై.ఎస్.ఆర్ ఒంటి చేతితో ఎన్నికల సమరంలో దూకారు. గెలుపు -ఓటములకు తనదే భాధ్యతా అన్నారు. ఇవన్ని మనిషిలోని అదనపు శక్తి పుట్టించే తిక్క. గెలుపు అనంతరం శాసన సభ సమావేశాలు జరిగాయి. అవి పూర్తైన మర్నాడే మళ్ళీ "రచ్చ బండ"అంటూ చిత్తూరు భయలు దేరేరు. ఇదీ తిక్కే.

కేవలం త్రైమాసిక పరీక్షలు పూర్తైతేనే కొందరు ( చాలా మంది) విథ్యార్థులు నెల దాక పుస్తకాలు తాకరు -వారంతా శక్తి హీనులు) అటువంటి వై.ఎస్. వారం రోజులు విశ్రాంతి అని ప్రకటించి ఉన్నా తప్పు పట్టే వారు లేరు. అయినా భయలు దేరేరు.ఇందుకు కారణం అతనిలో ఉబికిన అదనపు శక్తియే.

ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తాం.అన్నీ నెరవేర్చడం సాధ్యమేనా? అని వై.ఎస్. ఆర్ ఆలోచించి ఒక్క జలయజ్నం విషయంలో వెనుకడుగు  వేసి ఉన్నా ఆర్థిక సంక్షోభం తలెత్తేది కాదు. ఎలాగూ విద్యుత్ భకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఇచ్చేరు కాబట్టి ,మన ప్రజలు  ఎప్పుడూ తాత్కాలిక పరిష్కారలా వైపే మొగ్గుతారు కాబట్టి ఇబ్బంది వచ్చేది కాదు.

వై.ఎస్. ఆర్ జలయజ్నం తలపెట్టడానికి కారణం కూడ ఈ అదనపు పవరే . అదే తిక్క పుట్టించేది. పోని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసారు. ఆ పథాకాల ద్వారా లబ్ది పొందిన వారెల్లా కాంగ్రెస్ పార్టికి ఓటిచ్చి ఉంటే మహా కూటమి సింగిల్ డిజిట్తుతో సరిపెట్టుకుని ఉండేది. కాని అలా జరగ లేదు. మరెందుకు వై.ఎస్. ఆర్ అంత ఆతృతతో రచ్చ భండ ప్లాన్ చేసారు, మరెందుకు శాసన సభ సమావేశాలు పూర్తైన మర్సటి దినమే చిత్తూరు భయిలు దేరేరు. అందుకు కారణం  అదనపు పవర్ . అది కలిగించిన  తిక్క.

1 comment:

  1. full lengthy comedy.Thanks for ur entertaining post sir.

    ReplyDelete