Sunday, October 24, 2010

మీ క్యేరెక్టరును నిర్ణయించేది సెక్స్ పట్ల తొలి దాడే

మానవ మస్తిష్కంలో సెక్స్ కేంద్రానికి అతి తగ్గర్లోనే  మేథస్సు  సంభంధ కేంద్రం కూడ ఉందట. ఇస్లామ్ ప్రవక్త నబి(స-అజం) సున్తీ చేయించుకోమని సూచించింది కూడ ఈ సత్యాన్ని బేస్ చేసుకునే ఉండాలి. ఒక సరస్సులో ఒక రాయి విసిరితే అదెలా ప్రకంపణలు సృష్తించి సరస్సు అంతటా వ్యాపిస్తుందో అలా సున్తీ పని చేస్తూంది.

ప్రాణుల నుండి ప్రకృతి కాంక్షించే ప్రప్రథమ భాద్యత వ్యాప్తి చెందడమే. బలహీనుడు, మూర్ఖుడు, రోగిష్ఠి,కుష్ఠ్రు రోగి, ఎయిడ్స్ రోగిలో కూడ వీర్యోత్పత్తి కలగడానికి ఇదే కారణం. ప్రస్తుతం మానవుడు ప్రకృతినుండి విడిపడి చాలా దూరం వచ్చేసినా, తన ప్రతి చర్యతో తన పుంసత్వ నాశనానికే పాల్పడినా  ఇప్పటికీ ఎంతో కొంత పుంసత్వంతో మానవ కోటి కొనసాగటానికి ఇదే మూలం.

సైకాలజి ప్రాతిపదికన తీసుకుంటే పిల్లలు తొలూత తమ ఆసన ద్వారం పై ఎనలేని ఆసక్తి చూపుతారు. క్రమేణా వారి స్పృహ వారి జననేంద్రియం పైకి ఎగ ప్రాకుతుంది. కాని తల్లి తండ్రులు,అధ్యాపకులు, సమాజం అతనేదో పెద్ద నేరం చేసినట్టుగా విరుచుకు పడతారు.

దీంతో మూనాళ్ళ ముచ్చటగా గడిచిపోవలసిన ఆసక్తి అతని సబ్ కాన్షియస్లోకి వెళ్ళి పోతుంది. అతను తన జీవితంలో తనకు ఎదురయ్యే తొలి సమస్యను తొలిసారిగా  ఎదుర్కోవలసి వస్తుంది. అదే కామవాంచ. అతను తనలోకలిగే కామవాంచను ఎలా ఎదుర్కొంటాడో , దానికి ఎలా ఉపసమనం పొందుతాడో ఇదే అతని శేష జీవితాన్ని ప్రభావిస్తుంది.

ఉదాహరణకు అతను తన కామవాంచను ప్రశ్నించడం మొదలు పెడితే దాని ఆద్యంతాలను తెలుసుకో కలుగుతాడు. అలా కాక హస్త ప్రయోగానికి అలవాటు పడితే అతనో హిప్పోక్రెట్ గా, ఎస్కేపిస్టుగా తయారవుతాడు. ఆపోజిట్ సెక్స్ వారి పైకి అతని దృష్ఠి మళ్ళితే అతను సమస్యలను సూటిగా ఎదుర్కొనే వాడుగా తయారవుతారు.వాస్తవమైన  ప్రేమలో పడితే కామవాంచ తనంతట తనే మాయమవుతుంది.

ప్రేమన్నది కామవాంచను తీర్చుకునె యత్నంగా విన్న మీకు ఈ మాట ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. కాని ప్రేమ కామవాంచను కట్టిడి చేసి దానిని సెకండరిగా మారుస్తుంది. కాని అబ్బాయికి కలిగిన ప్రేమ కేవలం ఇన్ ఫ్యేక్చువేషనా అసలైన ప్రేమా అన్న ప్రశ్నకు సమాదానాన్ని పట్టి  ఈ రూల్ వర్తిస్తుంది.

లోతుగా ప్రేమించినవారు పలువురు  తమ  ప్రియురాలితో సహజంగా సెక్స్ చేసుకోవడానికి వెనుకాడుతున్నట్టు నాకు వెల్లడించి ఉన్నారు. ప్రేమ మనిషిలోని సున్నితమైన ఫీలింగ్స్ ను నిద్రలేపి శారీరక ఇచ్చను వెనక్కు నెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

తన కామవాంచను తీర్చుకోవడానికి అతను ఎంచుకునే మార్గమే అతని శేష జీవితాన్ని ప్రభావిస్తాయి. సెక్స్ పట్ల అతనికి కలిగే ప్రాథమిక అభిప్రాయం అతను ఎంత పెద్ద చదువులు చదివినా, సంస్కారాలు నేర్చినా మారడం లేదు.

మన సమాజంలో చాలా మంది డ్యూయల్ రోల్ చెయ్యడానికి కారణం కూడ ఇదే .మన సమాజం సెక్సును దాదాపుగా నిషేదించటంతోనే ఈ దుస్థితి.  మానవుని మనస్సు చాలా తెలివైంది.

సమాజానికి ఎదురు తిరిగే దమ్ములేని ఆ నిస్సహాయుడు కావడంతో  అతని మనస్సు సెక్సును వెనక్కు నెట్టి ( సబ్ కాన్షియస్లోకి) దానికి ప్రత్యామ్నాయంగా కొన్నింటిని ఎంపిక చేసుకుంటుంది.

అవే డబ్బు , అధికారం వంటివి. అంటే అతని మనస్సు వీటిలో ఏదో ఒకదాని ద్వారా సెక్స్ను పొందవచ్చని భావిస్తుందన్నమాట.

కాని కొందరి కేసుల్లో అనచి వేయ బడిన కామవాంచ హింసగా ఉబుకుతుంది. టీన్ ఏజర్స్ చాలా వరకు రెస్ట్ లెస్ గా, రెబల్స్ గా ఉండటానికి ఇదే కారణం.

మరి కొందరు ( అదృష్ఠ వశాస్తూ వీరు అల్ప సంఖ్యలో ఉంటారు) ఆథ్యాత్మికం వైపుగా ఆకర్షింప పడతారు. ఎల్.కె.జి చదవని వాడు డిగ్రీ చేరినట్టు తికమక పడుతుంటారు. ఆథ్యాత్మికానికి తొలి మెట్టు సెక్స్ .కామి కాని వాడు మోక్ష కామి కాలేడు అన్న సత్యాన్ని గ్రహించక ఇటు కామవాంచను మ్యేనేజ్ చెయ్యలేక అటు ఆథ్యాత్మికంగానూ ఎదగలేకుండా సతమతమవుతుంటారు.

ఏది ఏమైతేనేం సెక్స్ అన్నది మానవజీవితంలో ఎదురయ్యే జఠిల సమస్య. దానిని నిజాయితిగా,తెగింపుతో ఎదుర్కొనకపోతే సెక్స్ పట్ల వారి దృక్పథం పూర్తిగా మారిపోయి ఉత్త ఎదవలుగా తయారవుతారు. ఏదో రోజు తివారి, స్వామి నిత్యానందలా భయిటపడి అప్రతిష్ఠపాలవుతారు

No comments:

Post a Comment