జగన్ గారు ! 1967లో పుట్టిన నేను 1972లో పుట్తిన మిమ్మల్ని ఇలా జగన్ అని సంభోదించడం తప్పు కాదనుకుంటాను. ఈ టపాను మీరు చదివే లోపు ఏ .బి. ఎన్ వారు మీకు షో కాస్ నోటీసులు జారి చేసి ఉంటారు. అచ్చు తప్పు కాదు. వారి కుతూహలం చూస్తుంటే వారే నోటీసు జారి చేసేలా ఉన్నారు.
నాయకుల మాటలకెందుకు విలువల్లేక పోయింది
ఓట్లకెందుకు మార్కెట్ వేల్యూ వచ్చిందని
వేదాలు వల్లించే వీరు కూడ ఈ పాపంలో భాగస్తులే అన్న మాటను ఎవరు చెప్పాలి? ఓకే పాయింటుకొచ్చేస్తా..
వీరుడు ఒకే సారి మరణిస్తాడు. ప్రిరికి వాడు రోజూ చచ్చి బతుకుతాడని అంటారు. దీనిని తమిళ నాడు సి.ఎం మరింత పదును పెట్టి " వీరునికి మరణమే లేదు ( మరణించినా ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు), పిరికి వానికి జీవితమే లేదు (వాడు బతికున్నా చచ్చిన శవంతో సమానం) అన్నారు. వారి సూక్తిని వారే మరిచి శ్రీలంకలోని తమిళుల ఊచ కోతలను చూస్తుండి పోయి పిరికివారైన మాట మనకొద్దు.
నేను తొలినుండి మీకు చెబుతూ వచ్చాను కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భలపడింది కాబట్టి రాష్ఠ్ర్రంలో సీట్స్ తగ్గడంతో సోనియా ఆలోచనా విదానం మారిందని, మరో ఇందిరమ్మలా తయారవుతున్నారని.
స్వీప్ చేసిన వై.ఎస్.నే ముప్పై చెరువుల నీళ్ళు తాగించిన వారు, ప్రస్తుతం వై.ఎస్. సైతం లేని స్థితిలో న్యాయం చెయ్యరని, భల ప్రదర్శనకు దిగాలని చెబుతూ వచ్చాను.
వై.ఎస్. మరణించిన తరువాత వచ్చిన మొదటి అమావాశ్యకే ముహూర్తం పెట్తి అనుకూలురైన ఎం.ఎల్.ఏలతో గవర్నరును కలవాలని కొరియర్ ద్వారా కూడ తెలిపాను. ప్రస్తుతం ఎలాగో వాస్తవం గ్రహించి తిరుగుభాట పట్టినందుకు అభినందనలు.
ఈ క్లీష్ఠ పరిస్థితిలో మీ వెంట నిలిచిన వారికి , నడిచిన వారికి మీ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి ఉన్న మార్గాలు రెండే.
* స్వంత పార్టి ఏర్పాటు
* అదిష్ఠానం ఎంతకు దిగి వచ్చినా మెత్త పడకుండా నిబ్బరంగా ఉండడం
ఒక వేళ అదిష్ఠానం పూర్తిగా తన తప్పు తెలుసుకుని జరిగిన నష్ఠానికి చింత వ్యక్తం చేసి అసెంబ్లిలో మద్దత్తు కోరితే అప్పుడు మాత్రం భయిట నుండి మద్దత్తు ఇచ్చే విషయం గురించి ఆలోచించ వచ్చు. ( కొన్ని నిభందనలతో ఉ. వై.ఎస్. పథకాలను తు చ తప్పకుండా అమలు చెయ్యడం)
ఈ దశలో వెనుకడుగు వేస్తే మాత్రం జగన్ గారూ .. మీరు చరిత్ర హీణులై పోతారు.
నేను నిజానికి చెప్పదలచిందేమంటే ఈనెల 20 నుండి సెప్టంబరు 5 వరకు కన్యలో కుజ శనుల కలయక దానిద్వార తలెత్తగల అతలాకుతల పరిస్థితిని పట్టి మాత్రమే.
అవును . జగన్ గారూ..మీ రాశి మిథునం. మీకు చతుర్తమున ఉన్న శని కుజునితో కలవడం చేత మీ మీత పార్టి వేటు వేయ వచ్చు. పైగా రోడ్డు ప్రమాదం కాని దాడి గాని జరుగ వచ్చు దానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాలి. అలానే రోశయ్య వంటి వృద్ద నాయకులకు కూడ ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది సుమండి.
ఇక మీ విజయానికి కొన్ని సలహాలు:
* ఆంథ్ర రాజకీయాల్లో మానవీయత పాలన అందించిన సి.ఎంలు ఇద్దరే . వారు ఎన్.టి.ఆర్ మరియు వై.ఎస్. గార్లే. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కూడ వారి వారసులే. కాబట్టి జగన్ ఎన్.టి.ఆర్ వారసులను, ఎన్.టి.ఆర్ అభిమానులను కూడ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి.
*ప్రజా రాజ్యాన్ని దగ్గర తీసుకోవడం చిరంజీవి పూర్వం చేసిన ఆరోపణలను (వై.ఎస్. రాష్ఠ్ర్రాన్ని దోచి సోనియాకు పెడుతున్నారన్న ఆరోపణ) అంగీకరించినట్టు కాదా అని నిల దీయాలి.
*సమైఖ్యాంద్ర వాదాన్ని భలపరచాలి.
* వై.ఎస్.కున్న పేరు ప్రఖ్యాతలను చెరచి వెయ్యాలని చూసే చంద్రబాబులాంటివారి నోళ్ళు ముయ్యించేలా వారు తమకు చెవుడొచ్చినా మంచిదేమో అని భావించేటంత ధీటుగా వారి విమర్శలను తిప్పి కొట్టాలి
No comments:
Post a Comment