Friday, July 16, 2010
శభాష్ ! చంద్ర బాబు !!
సి.ఎం గా ఉన్నప్పుడు ఏం చేసారు? అప్పట్లో అల్మట్టి నిర్మాణం విషయంలో ఏం చేసారు ? వంటి ప్రశ్నలన్ని అప్రస్తుతం. శుక్రవారం నాడు బాబ్లి ప్రాజక్టును సందర్శిస్తానని భయలు దేరడం ,అరెస్ట్ కావడం, ఎంతగా అవమానించినా భరించి కటిక నేల పై పడుకొని, పచ్చి గంగన్నా ముట్టకుండా జాగారం చేసినా పట్టిన పట్టు విడవకుండా నిలబడటంవంటి అంశాలను ప్రతి ఒక్కరు హర్షించాల్సిందే. ప్రధానిని కలుద్దామన్నాం కదా అని రోశయ్య అంటున్నారు.
సాంకేతికంగా చూస్తే మన్మోహన్ సింగ్ ప్రధానియే కావచ్చు. కాని కేవలం ఎం.ఎల్.సి గా ఉన్నా కేవలం సోనియా ఆశిస్సులతో సి.ఎం అయిన రోశయ్యకు , రాజ్య సభ ఎం.పి గా ఉంటూ కేవలం సోనియా బినామిగా ప్రధాని పదవిలో కొనసాగిస్తున్న మన్మోహన్ సింగ్ గార్లకు మద్య ఎటువంటి తేడా లేదు. ప్రధానితో మాట్లాడం కేవలం కాలయాపన అవుతుందే కాని ఫలితం మాత్రం శూన్యమని ప్రతి ఒక్కరికి తెలుసు.
కాబట్టి చంద్రబాబు బస్సు యాత్ర ముమ్మాటికి సబబే. పైగా తె.దే.పా వారు యాత్రలో పాల్గొనాలని అఖిల పక్షానికి పిలుపు కూడ ఇచ్చారు. అఖిల పక్షమంటే అందులో కాంగ్రెస్ కూడ మిళితమై ఉంది.పొరుగురాష్ఠ్ర్రం వైరి దేశంలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే మనవారు అంతర్గత పొర పొచ్చలతో వ్యవహరించటం సిగ్గు చేటు.
నరసింహరావు ప్రధానిగా ఎంపికై నంద్యాల్లో ఎం.పి గా భరిలో దిగినప్పుడు ఎన్.టి .ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలుగు గౌరవాన్ని నిలబెట్టారో అటువంటి నిర్ణయాన్ని రాష్ఠ్ర్రంలోని రాజకీయ పార్టీలు తీసుకోవాలి. మహారాష్ఠ్ర్ర ప్రభుత్వం యొక్క ఓవర్ యాక్షన్ ను ముక్త కంఠంతో ఖండించాలి. చంద్ర బాబుకు బాసటగా నిలబడాలి.
ఎన్.టి.ఆర్, వై.ఎస్. వంటి భలమైన నాయకత్వం రాష్ఠ్ర్రానికి లేకపోవడం ఈ రోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వా నేనా పంథాను వదలి మనం అన్న స్ఫూర్తితో పద్ద్దతి మార్చుకోవల్సి ఉంది. కనీశం యువతరానికి చెందిన జగనన్నా ఈ సన్నివేశంలో తన వైవిద్యాన్ని చాటాల్సి ఉంది.
అయినా నదులన్నింటిని జాతీయం చేసేంతవరకు , నదుల అనుసందానం చేపట్టేంత వరకు ఇటువంటి జల వివాదాలకు అంతే ఉండదు. నేను 2002 ఆగస్ట్ నెలలో నా ఆపరేషన్ ఇండియా 2000 పథకంయొక్క ప్రతిని అఫిషియల్ గా పంపగా సెప్టెంబరు నెలలో( తెదేపా సంస్థాగత దినం అనుకుంటా) "నదుల అనుసందానంతోనే దేశం శస్య శ్యామలమని" స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మాట నాటి ప్రముఖ పత్రికల్లో పతాక శీర్షికలుగా వెలుబడ్డాయి. ఎన్.టి.ఆర్ కూడ పార్లెమెంట్ ఎన్నికల్లో నేష్నల్ ఫ్రంట్ అధికారానికొస్తే నదుల అనుసందానం చేపడతామని ప్రకటించారు .( వారికి కూడ ఆపరేషన్ ఇండియా 2000 పథకం పంపడం జరిగింది)
వరద బాధితులు,కరవు బాధితుల్లా చంద్రబాబు బాధితులంటూ ఒక లిస్ట్ తయారు చేస్తే మొదటి పేజిలో నా పేరు ఉంటుంది. అంతగా నష్ఠ పోయిన వాడ్ని నేను. కాని వాటిని దలచి నేడు రాష్ఠ్ర్ర్ర ప్రయోజనాలకోసం కదం తొక్కి పొరుగు రాష్థ్ర్రంలో పరాభవానికి గురైన సందర్భంలో నోరు మూసుకోవడం కాని సొల్లు వాదనలు వినిపించడం కాని ధర్మం కాదు.
అందుకే రాష్ఠ్ర్ర ప్ర్జజలందరూ, పార్టీలన్ని ముక్త కంఠంతో మహారాష్థ్ర్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలి. బాబుకు అండగా నిలబడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment