ఈ ముక్క ప్రతి తెలుగు వాని నోట రావాల్సిన రోజు ఇది. కాని పండుగ రోజూ పాత మొగుడే అన్నట్టుగా రాష్ఠ్ర్ర రాజకీయ వేత్తలు ప్రవర్తిస్తుండడం సిగ్గు చేటు. ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నేతలు, సి.ఎం పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది. చంద్రబాబు బాబ్లి ప్రాజక్టును సందర్శిస్తానని భయలు దేరారు. బాబ్లి ఉన్నది ఏ పాకిస్థాన్లోనో, చైనాలోనో లేదు. ఈ దేశం సరిహద్దులోపలే ఉంది.
కాని బాబ్లి వద్దకు తీసుకెళ్దామని మోసగించి అరెస్ట్ చేసారు. మహారాష్ఠ్ర్రలోని దర్మాబాద్ ఐ.టి.ఐ ప్రాంగణంలో భందించ్చారు.
అక్కడి పరిస్థితి వింటుంటేనే రక్తం ఉడికి పోతుంది. పవర్ కట్, దోమల తాకిడి, త్రాగు నీరు,టాయిలెట్ సైతం లేక పోవడం ఇంతకీ చంద్రబాబు ఏదో లెటర్ ప్యేడ్ పార్టి నేత కాదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రోటకాల్ ప్రకారం సి.ఎం కు తదుపరి ప్రాముఖ్యత గల నేత.. కాని మహిళా ప్రజా ప్రతినిదులకు సైతం మినహాయింపు లేక ఇదే రోత.
వీరు వాదించుకున్నట్టు బాబ్లి నిర్మాణాలు చట్టపరమైనవే అయితే వాటిని చంద్రబాబు తదితరులు సందర్శిస్తే కొంపలు మునుగుతాయా? మహారాష్ఠ్ర్ర ప్రభుత్వ తీరు చూస్తే అవి అక్రమ నిర్మాణాలేనన్న భావన కలుగక మానదు.
చంద్రబాబు తదితరులను తొలూత రెండు రోజుల జుడిషియల్ కస్టడికి పంపారు. తదుపరి రిమాండును పొడిగించి ఔరగాబాద్ జైల్కు తరలించాలని చూసేరు.తమ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబు భృందం నిరాహార దీక్ష చేపట్టి నిరాహార దీక్షతో నీరసించి ఉన్నవారి పై స్త్ర్రీ పురుషులన్న వివక్ష లేకుండా, ప్రజా ప్రతినిదుల అన్న మర్యాద లేకుండా పోలీసులు పైశాచికంగా దాడి చేసి, లాఠి చార్జి చేసి, రక్తపాతం సృష్ఠించడం అమానుషం, ఆఠవికం. వారి లగ్గేజిలను భయిటకు విసిరేయడం, గన్ మేన్లను భయిటకు గెంటి వేసి దాడులకు పాల్పడటం ఇవన్ని చూస్తుంటే టైమ్ మెషిన్ ద్వారా ఏ క్రీశ్తు పూర్వ కాలానికో వెళ్ళి పోయినట్టుందిగాని మరోలా అనిపించటం లేదు.
చంద్రబాబు మహారాష్ఠ్ర్ర సరిహద్దులో అడుగు పెట్టిన క్షణం నుండి అక్కడ జరిగిన అన్యాయాలు,అవమానాలన్నింటిని తలతన్నే విదంగా ఈ దాడి జరిగింది. ఇంతటితో ఆగక వారిని భలవంతంగా బస్సుల్లో ఎక్కించి బ్రేక్ ఫాస్ట్ సైతం లేక మాడ్చి భలవంతంగా విమానం ఎక్కించారు.
కాంగ్రెస్ వారు చంద్రబాబును చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. అట్టడుగు స్థాయినుండి అంచెలంచలుగా ఎదిగిన వ్యక్తి. అధికారం కోల్పోయినా ఐదు సం.ల తరువాత కూడా నువ్వా నేనా స్థాయిలో గట్టి పోటిని ఇచ్చిన వ్యక్తి. చంద్రబాబు దలచుకుంటే ఎంతటి చిన్న విషయాన్నైనా మాయల మరాటిలా జాతీయ స్థాయిలో హైలైట్ చెయ్యగల సమర్థుడు. అటువంటిది.. ప్రస్తుతం జరిగిన సంఘఠణ చిన్నా చితకా విషయం కాదు.
హైదరాబాద్ దిగ గానే వైద్య పరీక్షల నిమిత్తం క్యేర్ హాస్పిటల్ లో చేరడంతో బాబు వ్యూహం షురూ అయ్యింది. ఇక చూడండి !
చంద్రబాబు బృందం పై జరిగిన ఈ దాడి, వారికి జరిగిన అవమానాలకు వెనుకున్న సోనియా కుట్ర, రోశయ్య చేతగానితనం మద్య ప్రజాస్వామ్యం నలిగి సుజ్జు సుజ్జు అయ్యింది . ఈ పాశవిక చర్యను,ప్రజాస్వామ్య ఖూనిని ముక్త కంఠంతో ఖండించి మహారాష్ఠ్ర్ర ప్రభుత్వాన్ని బతరఫ్ చెయ్యాలి అని నినదించవలసిన మన రాష్ఠ్ర్ర రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటున్నారు.
అయితే సోమవారం తెలుగుదేశం చేపట్టిన బందుకు వై.ఎస్. సోదరుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి సంఘీ భావం వ్యక్తం చెయ్యడం ,మోహన్ బాబు దర్నాకు దిగడం, హర్షకుమార్ సంఘీభావం వ్యక్తం చెయ్యడం కాసింత విశ్వాసం కలిస్తూంది. కాని పొన్నాల, సబీత ఇంద్రా రెడ్డి స్పందనలు చికాకు కల్గిస్తున్నాయి.
నాటి ఎన్.టి.ఆర్ మొన్నటి వై.ఎస్. నాయకత్వం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వై.ఎస్. జీవించి ఉండగా తె.దే.పా ఎం.పి ల బృందం మహారాష్ఠ్ర్రకు వెళ్ళడం సేఫ్ గా తిరిగి రావడాన్ని , నేటి దుస్థితిని ఒకసారి బెరేజు వేసుకొండి.
ఎప్పుడో చని పోయిన వారి కుటుంభాలను పరామర్శిస్తా. ఓదారుస్తా అని పట్టు పట్టి ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్ వెంటనే చంద్రబాబును కలిసి పరామర్శించవలసి ఉంది. వై.స్. ఉండి ఉంటే ఆయన ఇదే పని చేసేవారు (పరిస్థితి ఇంతగా దిగ జారేది కాదనుకొండి)
గమనిక: చంద్రబాబును నాకన్నా ఘోరంగా విమర్శించినవారెవరూ ఉండరు. కాని ఈ తరుణంలో చంద్రబాబు కేవలం ఒక పార్టి అధినేత కాదు. మన రాష్ఠ్ర్ర మేలు కోరి కదం త్రొక్కిన చంద్రబాబు మన వాడు. మనవారికి అన్యాయం జరిగినప్పుడు గళం విప్పకుండా ఉంటే మనం చచ్చిన శవాలతో సమానం.
No comments:
Post a Comment