Wednesday, July 21, 2010

విపరీత రాజయోగం.

ఒక జాతకంలో 6,8.12 భావాలు దుస్థానాలు. అంటే దుష్ఫలితాలను ఇచ్చేవి. ఈ భావాధిపతులు మరెక్కడా కాకుండా పై తెలిపిన 6,8.12 భావాలలో ఏదైన ఒక దానిలో ఉంటే అది విపరీత రాజయోగం.
దీని గూడార్థం విప్పి చెబుతా. 6వ భావం జాతకునికి శతృ రోగ రుణ బాధలను ఇస్తుంది. 8వ భావం మనిషికి తీరని అప్పులను, దీర్ఘ రోగాలను, జైలు వాసాన్ని, దివాళా తీయడాన్ని, ఆపదలను, మరణాన్ని ఇచ్చే స్థానం. 12వ భావం మనిషికి త్రిప్పుట,అలసట, సయ్యాసౌఖ్యం(సెక్స్),ఖర్చు పెట్టే విదానం, నిద్ర వంటి విషయాలను సూచిస్తుంది. ఈ భావాధిపతులు చెరో భావంలో పడ్డారనుకొండి మూడు ప్లస్ మూడు ఆరు భావాలు నాశకారీ అవుతాయి. ఒక వేళ ఈ మూడు భావాధిపతులు ఈ మూడు భావాల్లో ఏదో ఒక భావంలో ఉండి పోతే మూడు భావాలే నాశకారీ అవుతాయి. ఇదో కోణం.

అలానే నిండా మునిగిన వాని చలిలేదన్న చందాన అతను ఎదురు దెబ్బలకు రాటు దేలి పోవచ్చు. దీంతో సమస్యలెదురైనప్పుడు చిన్న చిన్న వాటికి బెదరకుండా నిబ్బరంగా నిలబడటంతో నిజంగానే రాజు కావచ్చు.

ఇంకా లోతుగా ఆలోచిస్తే 6+8 భావాధిపతులు కలిసారనుకొండి ఎనిమిది అంటే మరణం . ఆరు అంటే  శతృ,రోగం రుణం . పై కలయకతో  శతృ,రోగం రుణం అనే మూడు అంశాలు చస్తాయంతే.

6+12 భావాధిపతులు కలిసారనుకొండి. పన్నెండు అంటే వ్యయ స్థానం. ఆరు అంటే  శతృ,రోగం రుణం . పై కలయకతో  శతృ,రోగం రుణం అనే మూడు అంశాలు  ఖర్చై పోవచ్చు (అసల్లేకుండా పోవొచ్చు.ఉన్నా మటుమాయం కావచ్చు.

ఇప్పుడర్థమైందిగా విపరీత రాజయోగం ఎలా వొర్క్ అవుట్ అవుతుందో?

No comments:

Post a Comment