Sunday, July 25, 2010

జాతకం లేకుండానే మీ గ్రహ భలం

జాతకం లేకుండానే మీ జాతకంలోని  గ్రహ భలాలను తెలుసుకోవడానికి ఈ  టపా ఉపకరిస్తుంది. భగవంతుడు ఏ ఏ గ్రహానికి ఏ ఏ విషయాలను కేటాయించాడో క్రింద పట్టికలో చూడండి. ఒక గ్రహం ఆధిపత్యం వహించే విషయాల్లో మీకు వెనుకంజ, ఆటంకం,నషం వాటిల్లి ఉంటే ఆగ్రహం మీ జాతకంలో బలహీన పడిందని లెక్క. ఒక గ్రహం ఆధిపత్యం వహించే విషయాల్లో మీకు లాభం, విజయం కలిగి ఉంటే ఆగ్రహం మీ జాతకంలో బల పడిందని లెక్క. ఓకే .. ప్రొసీడ్ !

జ్యోతిష్యంలోని ప్రాథమిక సత్యాలు
గ్రహాలు:
నవగ్రహాలు భగవంతుని మంత్రి మండలిలో మంత్రులువంటివారు. భగవంతుడే ప్రధాని. ఒక ప్రధాని శాఖలను మంత్రులకు అప్పగించినట్టే దేవుడు ఈ భూమి పై విషయాలను తొమ్మిది శాఖలుగా విభజించి ఒక్కో గ్రహానికి అప్పగించాడు.

సచివాలయం వెళ్ళిన వారికి ఏ మంత్రితో పరిచయానుభంధాలుంటే ఆ మంత్రిత్వ శాఖలో పనులవుతాయి కదా .అలాగే ఎవరి జాతకంలో ఏ గ్రహం భలంగా ఉంటే ఆ జాతకుడు సతరు గ్రహం కారకత్వం వహించే విషయాల్లో బహుగా రానిస్తాడు.

ఏ గ్రహం ఏ శాఖకు అధిపతి?

1.రవి:
పగటి పూట పుట్తిన వారికి  తండ్రి,తండ్రి ఆస్తి, తండ్రి తరపు బంధువులను వారితో రిలేషన్ ను సూచించేవాడు రవియే. ఏ పూట పుట్టినప్పటికి  కుడి కన్ను, శరీరంలోని కుడి భాగం ,
తల,పళ్ళు,ఎముకలు,వెన్నెముక, కొండ ప్రదేశాలు,మిట్ట ప్రాంతాలు,ముళ్ళున్న కాయలు,పుష్పాలు, స్థానిక ప్రభుత్వాలు ( మునిసిపాలిటి,పంచాయితీ), ప్రకటనల విభాగం, దిన పత్రికలు, నాయకత్వ  లక్షణాలు, చైతన్యం,ఆత్మ,ఆత్మ గౌరవం ,స్వేచ్చా స్వాతంత్ర్యం
ఆరంజ్ రంగులకు రవియే అధిపతి

2. చంద్రుడు:
మనస్సు, ఊపిరి తిత్తులు,కిడ్ని,శరీరంలోని ఎడమ భాగం , నీరు,జలాశయాలు,ద్రవ పదార్థాలు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న స్థానాలు ( నది తీరం, బీచ్, సినిమా హాళ్ళు, కళ్యాణ మండపాలు,బస్ స్టాండు, రైల్వే స్టేషన్, ఏయిర్ పోర్ట్, ) ఊహా శక్తి, కనికరం, మంచి మానవత్వం,సంచలం, నిలకడ లేని తనం, ఊయల, పల్లపు ప్రాంతాలు, కుళ్ళి పోయే కూర గాయలు, రెండుంకాలు రోజుల్లో పూర్తికాగల అనిశ్చితి నిండిన డీల్స్.
మనోల్లాసం, ఆశ్వర్యం కలిగించే విషయాలు ( రెండు తలలతో పుట్టిన దూడ వంటివి)


3. కుజ:
పోలీస్,మిలిటరి, రైల్వే,భూములు,సోదరులు,కెమికల్స్, అగ్ని,ఇందనాలు (ఫ్యూయల్స్) కట్టెలు,విద్యుత్, శతృవులు,మీకన్నా వయస్సులో చిన్నవారు, చిన్నవారిలాకనబడే వారు, రాజు కులస్తులు, అగ్ని ముఖ వృత్తి వారు, దక్షిణ దిక్కు,ఉష్ణ రోగాలు, ట్యూమర్స్, రక్త శుద్దిలో సమస్యలు, కడుపులో  మంట.పెప్టిక్ అల్సర్, పైల్స్, శస్త్ర్ర చికిత్స, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, కోపం,ద్వేషం, రంపు,రచ్చ, కొమ్మున్న జంతువులు,పాలు ,పాల ఉత్పత్తులు, మాంసం, సుబ్రమణ్యస్వామి, స్పోర్ట్స్, వంట, మార్షల్ ఆర్ట్స్,యుద్దాలు, తర్కం, వ్యూహం, పగడం, ఎముకలోని బోన్ మ్యేరో, వ్యాధి నిరోధక శక్తి,

4.రాహు:
సినిమా,లాటరి, సారాయి, జూదం, పొగాక,సర్పాలు, విష జంతువులు,ఇతర బాషస్తులు, అన్ వారంటడ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్స్, ఎగుమతి,దిగుమతి,వేదేశాలు, విదేశీ యానం, కాకిలాంటి నల్లని రంగు గల మనుష్యులు, కాకిలా ఓర చూపు చూసే వారు, త్రాగు బోతులు, జూదరులు, మేజీషియన్స్, అల్లోపతి మందులు, రసాయినిక ఎరువులు, సి.ఐ.డిలు, ముసుగు దొంగలు, మాఫియా, డ్యూప్లికేట్ వస్తువులు, రాత్రి పూట చేసే పనులు, చీకటిలో చేసే రహస్య కార్య కలాపాలు ,కుట్రలు, రహస్య శతృవులు.స్మగ్లింగ్, పన్ను ఎగవేత,బ్లాక్ మని, తెర వెనుక ఆడించే రాజ్యాంగేతర శక్తులు,నడుముకు క్రింది భాగం, అక్కడ గుర్తు తెలియని నొప్పులు, బలహీనతలు దొంగ లెక్కలు, సరకుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వయసుకు తగిన ఎదుగుదల లేక బక్క చిక్కి ఉండటం ,లేదా బోద శరీరం, ఫుడ్ పాయిజనింగ్, మెడికల్ అలెర్జి,మాధక ద్రవ్యాలు.


5..గురు:
గోల్డ్, కుదువ వ్యాపారం, మామ మాత్రపు వడ్డీతో సాగే ఫైనాన్స్ వ్యాపారం, రాజకీయం, తి.తి.దే వంటి ధార్మిక సంస్థలు, వృద్దులు, గెజటడ్ ఆఫీసర్శ్, ఖజాణా, బ్యాంకులు, పెళ్ళి, భార్యా, పిల్లలు, గౌరవం,పలుకు బడి, బ్రాహ్మణులు, పురాణ ఇతిహాసాలు, సంస్కృతం,గుళ్ళు,గోపురాలు,సేవా సంస్థలు,హిందూ మతం, మత సంస్థలు, ఈశాన్య దిక్కు, న్యాయ స్థానం, పుష్యరాగం,హృదయం, కడుపు, జ్నాపక శక్తి, ఆస్తికత్వం,ప్రభుత్వ గుర్తింపు, అవార్డు,రివార్డులు, ప్రభుత్వ క్వార్టర్స్, గురువులు, తీర్థ యాత్రలు,
 క్యేషియర్/ షరాఫ్ , ముందు చూపు,ప్రణాళికలు రోపొందించుకోవడం.
6..శని:
ఐరన్,స్టీల్,ఆయిల్, సెకండ్ హ్యాండ్ వస్తువులు, దుమ్ము దూళి నిండినవి, కుళ్ళు కంపు వచ్చేవి, జిడ్డు గలవి,నల్ల రంగుగలవి , పడమర దిశ, ఎస్.సి, బి.సి లు శని ఆధిపత్యంలోనివే. క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్, దళితులు, పేద ప్రజలను దోచుకునే వ్యాపారాలు, (ఉ. నూటికి పది వడ్డి వ్యాపారం) , యూని ఫార్మ్ దరించిన కార్మికులు, కార్మిక సంఘాలు, నల్లని చాయ కలిగిన వ్యక్తులు, వికలాంగులు (ముఖ్యంగా కుంటి వారు) , నరాల వ్యవస్థ, కాలు, ఆసనం, ఆలశ్యం, బంధించపడటం, అవమానం, వ్యవసాయం, క్వారిలు,స్వరంగాలు, దీర్ఘ కాల ప్రాజక్టులు, దళిత వాడలు (మాల పల్లెలు), మరుగు దొడ్లు, డ్రెయినేజి వ్యవస్థ, సోమరితనం,  కూలడానికి సిద్దంగా ఉన్న, కోర్టువ్యాజ్యాల్లో ఉన్న  నివాసాలు, కాయులా పడ్డ కర్మా గారాలు, ప్రేతాత్మలు
7..బుధ:
పోస్టల్,ఎస్.టి.డి, మెడిసిన్స్, గణితం , అకౌంట్స్, ఆడిటింగ్, కన్సల్టన్సి, కొరియర్,లైసెన్ ఆఫీసర్, అఫిషియల్ స్పోక్స్ మ్యెన్, విద్యా సంస్థలు, సంఘాలు అనుకూలిస్తాయి.వ్యాపార రంగంయందు ఆసక్తి కలగడమే కాక బహుగా రానిస్తారు. (కాని స్వంత వ్యాపారం పనికి రాదు, ఏజెన్సి, డీలర్ షిప్, ఫ్రాంచెస్ ఓకే) , వైశ్యులు ఉత్తర దిక్కు ,బజారు వీథి , చేంబర్ ఆఫ్ కామర్స్, చర్మం, పురుషుల్లో అండం (టేస్టికల్స్ ), స్త్ర్రిలలో ఓవరీస్ కుఇతనే అధిపతి.  సమాచార సేకరణ, క్రోడీకరణ, వాటిని సక్రమంగా పొందుపరచడం ( భావ ప్రకటనా సామర్థ్యం) వంటి వాటికి కూడ బుధుడే అధిపతి. ప్రభుత్వం+ప్రైవేటు రంగాలవారు కలిసి నిర్వహించే సంస్థలు కూడ ఇతని క్రిందకే వస్తాయి. ఉ. ఎప్ ట్రాన్స్ కో, జెన్ కో, ఎల్.ఐ.సి, ఆర్.టి.సివంటివి
( కేతు మరియు శుక్ర గ్రహాల శాఖలేవో రేపటి టపాలో చూద్దాం

No comments:

Post a Comment