Thursday, July 15, 2010

వివాహం ప్రకృతి విరుద్దం

భార్యా భర్తలు కాని ,ప్రేమిక్లుగాని అర్థం చేసుకోవలసిన చేదు సత్యం ఇది. అందుకని వివాహమాడరాదని ,వివాహితులంతా విడాకులు పుచ్చుకొని విచ్చలవిడిగా బ్రతకాలని చెప్పను. కాని భార్యా భర్తలు, ప్రేమికులు ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకుని ఆతర్వాత ఆలోచిస్తే వారి సమస్యలు అర్థం పర్థం లేనివన్న నిజం అర్థమవుతుందని చెబుతున్నాను.

వివాహాలు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయని, వివాహం అంటే  ఏడడుగుల బంధం కాదని , ఏడేడు జన్మలకు చెరగని  బంధమని,  వవిత్ర బంధమని ఇలా ఎన్నో విదాలుగా చెబుతారు.  ఇవన్ని పై పై తళుకులే.

వివాహామనే ప్రాడక్టుకు చుట్టు ఉంచిన ప్యేకింగ్ కాగితాలను తీసి వేస్తే వివాహమన్న మాటకు ఒక స్త్ర్రీ ఒక మగవానితోనే సెక్స్ పెట్టుకోవాలి. సతరు పురుషుని వీర్యాన్ని స్వీకరించి అతనికి ఒక వారసుడ్ని కనివ్వాలి. వండి పెట్తాలి. ఒక పురుషుడు ఒక్క స్త్ర్ర్రీతోనే సెక్స్ పెట్టుకోవాలి. ఆమెను పోషించాలి. ఆమె కని పెట్టిన సంతానాన్ని పోషించాలి.

ఈ ప్రక్రియ తరతరాలుగా కొనసాగుతూనె ఉందిగా . ఇప్పుడు ఎందుకీ ప్రశ్న అని మీరు ప్రశ్నించవచ్చు.. కాని నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి చాలా తేడా ఉంది.  ఇంతకాలం వివాహ వ్యవస్థ ఈ మాత్రమన్నా విజయవంతంగా కొనసాగడానికి  చిన్న కారణం ఉంది. అదేమంటే వివాహ వ్యవస్థలో అసలు సిసలైన బాధితురాలైన స్త్ర్రీ  తనకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకునే స్థితిలో కాని, తెలిసినా బాహుటంగా చెప్పటానికి గాని, ఇదేమని ప్రశ్నించేందుకు కాని అనుకూలమైన పరిస్థితి లేక పోవడమే.

ప్రస్తుతుతం పురుషుల హవా కాస్త తగ్గింది. ప్రభుత్వ యంత్రాంగాలు ఎంతగా తుప్పు పట్టి ఉన్నా అక్షరాశ్యత పెరిగింది. ముఖ్యంగా స్త్ర్రీకి విద్య లభ్యమైంది. మగ పిల్లల్లా ఇతరత్రా డైవర్షన్స్ లేవు కాబట్తి బాలురకన్నా బాలికలు భాగానే రానిస్తున్నారు. విద్యార్హతతో ఉధ్యోగం సాధ్యమైంది. వీటితో పాటుగా ఆలశ్య వివాహాల వలనబట్త తల మొదల్గొని పుంశత్వ లేమి దాకా అన్నీ ఒక్కసారిగా పురుషుల జోరుకు బ్రేకు వేసాయి. వివాహానికి పూర్వం ఈవిడ  జీతం తోడైతే కాని సంసారం సాగని పరిస్థితి. కాబట్తి కొన్ని కొన్ని స్వేచ్చలు, ఈవిడ ఒకతని భార్య అయ్యాక ఈవిడ  జీతం వస్తే గాని కుటుంభం సజావుగా సాగని రోజులొచ్చాయి. స్త్ర్రీ జీవితం రెండు ప్రక్కలా వెలిగించిన కొవ్వర్తిలా మారింది. ఇంట్లోనే కాక కార్యాలయంలోను శ్రమించాల్సి వచ్చింది.

దీంతో ఆవిడలోను ఆత్మవిశ్వాసం పెరిగింది. (ఇందుకు అతి ముఖ్య కారణం గర్భ నిరోధక పద్దతులు) పురుషునికన్నా తాను దేనిలోను తీసి పోదని అర్థం చేసుకుంది. ఆవిడలో విజ్నానం వికసించింది. ముఖ్యంగా సెక్స్ గురించిన అవగాహణ పెరిగింది. ఆర్గాజం గురించి తెలిసొచ్చింది. (ఆలశ్య వివాహాల కారణంగా హస్త ప్రయోగం/హోమో పరిశోదనలతోనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు)

పురుషునితో సమానంగా /ఇంకా చెప్ప బోతే అతనికంటే ఎక్కువగా తాను  శ్రమించినా తనకు తగినంత  విశ్రాంతి, సుఖం, గుర్తింపు,స్వేచ్చ,  తనకు లభ్యం కాక   పోతే దానిని సహించలేని స్థితికి స్త్ర్రీ  వచ్చింది. అందరు స్త్ర్రీలకు ఈ అవకాశం, గుణం  వచ్చిందని చెప్పలేము గాని మెజారిటి స్త్ర్రీలకు ఇది వర్తిస్తుంది.

మీ ఏరియా పోలీస్ స్టేషన్లో నమోదైన కనబడుట లేదు కేసులు పరిశీలిస్తే అందులో వివాహితులే అందులోను స్త్ర్రీలే ఎక్కువగా ఉండటాన్ని చూడొచ్చు. పైగా ఇటువంటి కేసులు 90% దాక స్టేషన్ దాక రావనుకొండి.

గతంలో  విద్యా,ఉధ్యోగం,ఆర్థిక స్వేచ్చ లేక నోరు చచ్చి పడి ఉన్నంత కాలం వివాహమనే చెరసాలలో స్త్ర్రీని  బంధించి ఉంచిన పురుషులు  తాము మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూ తిరిగి చెడి భార్య చెంతకు చేరేవారు.

చలామణిలో ఉన్న కావ్యాలు, సామెతల సృష్ఠికర్తలు పురుషులే కాబట్టి వివాహాన్ని ఆహా ఓహో అని కీర్తించి మెస్మరైజ్ చేసి ఉంచేరు. ఈ క్రింది సామెత చూడండి " తిరిగి చెడింది ఆడది. తిరగ్గ చెడ్డాడు మగవాడు" ఆడ మగా ఎవరు చెడు తిరుగుళ్ళు తిరిగినా ఒక్క ఎయిడ్సే వస్తుంది.

మొత్తానికి సాఫిగా సాగిన కథ డామిట్ అడ్డం తిరిగింది ! ఇన్నాళ్ళు వివాహ వ్యవస్థ ద్వ్రారా స్వేచ్చా ,సెక్యూరిటి రెండూ అనుభవించిన పురుషులకు దిమ్మ తిరుగుతూంది. అలాగని వివాహ వ్యవస్థ అనే గొడలు దూకి అటువెళ్ళిన స్త్ర్రీలు స్త్ర్రీలు గిల్టితో చచ్చి పోతున్నారు.

ప్రస్తుతం ఉన్న భార్యా భర్తలందరిని రెండు గ్రూపులుగా విడదీయొచ్చు. ఒకటి విడిపోయినవారు, రెండు విడిపోయే తెగింపు లేక బతుకుతున్నవారు. వివాహమన్నది ప్రకృతు విరుద్దమే. అందుకని ఈ వివాహ వ్యవస్థ పూర్తిగా కూలి పోవాల్సిందేనా ? రేపటితరం అమ్మ ఒడికి నాన్న భుజాలకు దూరం కావల్సిందేనా? మిద్యేమార్గం ఏమి లేదా? ఆలోచిద్దాం. రేపటినుండి ఈ సబ్జెక్ట్ పై సుధీర్ఘ వ్యాస పరంపరను వ్రాయాలనుకున్నా. ( హారం వారు నిషేదించి వెయ్యకుంటే..)


 పురుషులకు బొత్తిగా అర్థం కావడం లేదు. తలపట్టుకుని  కూర్చుంటున్నారు.

No comments:

Post a Comment