రానున్నది జగన్నామ వత్సరమని వ్రాసిన నెను ఇలా మాట మారుస్తున్నానని అనుకోకండి. ఆ మాట చెప్పినప్పుడు నా వద్ద జగన్ పుట్టిన సమయం లేదు. ఉత్తుతే ఆయన గారి జనన తేదీని న్యూమరాలజి ప్రకారం అనలైజ్ చేసి వ్రాసాను. బుధవారం నాడు ఏ.బి.ఎన్. ఆంద్రజ్యోతి టి.వి లో జరిగిన చర్చా కార్యక్రమంలో జగన్ టైం ఆఫ్ బర్త్ గురించిన క్లూ దొరికి ఈ టపా వ్రాస్తున్నాను.
వై.ఎస్. విషయంలో కూడా ఇలానే ఓ క్లూ పట్టుకుని ఆయన గారి భవిష్యత్తును విజయవంతంగా గణించి తెలిపాను .అది నిజమైన మాట విదితమే. పస్తుతం చర్చా గోష్ఠిలో నాకు దొరికిన క్లూ ఏమంటే జగన్ గారి లగ్నం కన్యా ,( ఈ లక్నం జగన్ జనన తేదీ అయిన డిసెంబరు, 21, 1972 న అర్ద రాత్రి దాటాక వస్తుంది) వృషభంలో శని ( డిసెంబరు ,20 రాత్రి దాటాక ఒక టైం పెట్టుకుని జాతకం వేస్తే ఇదీ టాలి అవుతూంది) , చం కేతు సమ్మేళనం,(ఇదీ ఓకే) అర్థాష్ఠమ శని ( ఇది ప్రస్తుతం మిథున రాశికే జరుగుతూంది) . కాని చర్చా గోష్ఠిలో పాల్గొన్న జ్యోతిష్కులు విక్రమ స్థానంలో కుజుడున్నాడని అన్నారే గానీ నేను ఒర్క్ అవుట్ చేసిన జాతకంలో కుజుడు రెండున ఉన్నాడు. ఏది ఏమైనప్పటికి నా అంత:కరణ వాణి చెబుతూంది. ఈ టైం ఈ జాతకం కరెక్ట్ అని.
ఈ జాతక ప్రకారం ఉన్న మైనస్ పాయింట్స్:
*లగ్నం కన్యా కావటం:
లిటిగేషన్ ముందు పుట్టి ఆ తరువాత పుట్తింది కన్యా లగ్నం. ఏదో వై.ఎస్. డాక్టరైనందున తప్పించుకున్నాడు కాని ఆ వృత్తిలో లేకుంటే మెటాష్ అయ్యుంటాడు. క్రమేణా జగన్ చుట్టూ ఉన్నవారు శతృ రోగ రుణ పీడితులుగా మారుతారు.
*చంద్ర కేతు కలయక :
ఇది ప్రజాదారణ పొందటానికి,మనోవికాసానికి అడ్డంకి. చం లాభాధిపతి కావటం చేత ప్రతి అభివృద్దికి ముందు హి హేస్ టు పే మోర్. పైగా ఊపిరితిత్తులు, కిడ్ని సంభంధిత సమస్య కూడ రావచ్చు
*వ్యయాధిపతి అయిన రవి సుఖ స్థానాన ఉండటం:
అక్కడ సుఖ, కళత్రాధిపతి అయిన గురువు కూడ ఉండడంతో ఆ గురువు రాహువుతో చేరడం తొ అనేక ఉద్పాతాలు సంభవిస్తాయి. ఉ. కాళ్ళు చేతులు విరగడం, కీళ్ళ నొప్పి, ముఖ్యంగా వీపి నొప్పి , తల్లికి హాని, ఇల్లు,వాహణాల వగైరాలోను హాని, భార్యకు పీడ, జాతకునికి నాభి వద్ద సమస్యలు, కుడి కన్ను చూపు దెబ్బ తినడం జరుగవచ్చు.
*రెండున కుజుడు:
కుటుంభానికి హాని, కుటుంభం యుద్దరంగంలో కాపురం ఉన్నంత అనిశ్చితి,అపాయాలు ఎదురవుతాయి.
జాతకుని మాటల వలన హాని జరుగును. ఆస్తి , దనం కట్టెల్లా కాలి పోతాయి గొంతు సంభంధ సమస్య కూడ రావచ్చు
*లగ్నాధిపతి, శుక్రుడు మూడున:
ఈ కలయక వలన జాతకునికి ఎనలేని త్రిప్పుట అలసట, ప్రయాణాలు,సంసార సుఖ హీనత, కాసింత చెవుడు కూడ రావచ్చు
ఇప్పటికి వై.ఎస్. కుటుంభం పై అర్థం లేని ,తర్కంలేని శతృత్వం, ఈర్ష్య, ద్వేషాలు ఉన్న వారి కడుపులు చల్ల బడేలా కొన్ని ఫలితాలను చెప్పాను.
ఇక తదుపరి భాగంగా జగన్ జాతకంలోని ప్లస్ పాయింట్స్ ను వివరిస్తాను:
ఈ లగ్నానికి యోగ ప్రధుడైన శని 9 ఉండటం.. దీని గురించి టివిలోని చర్చలో కూడా చాలా వరకు హైలైట్ చేసారు. జాతకంలోని పంచమ భావం జాతకుని పూర్వ పుణ్యాలను సూచిస్తుంది. ఈ భావాధిపతి అయిన గ్రహం తండ్రిని సూచించే స్థానంలో నిలిచినది. దీనర్థం ఏమంటే జగన్ గత జన్మలో కూడ వై.ఎస్. కొడుకుగానే పుట్టి ఉంటాడని. అతని మనస్సంతా తండ్రి పైనే,తండ్రి ఆశయాలపైనే కేంద్రీకృతం అయ్యుంటుందని. జగన్ అదృష్ఠమంతా తండ్రి రూపంగానే పని చేస్తుందని.
ఇదో కోణమైతే 9 వ భావం దూర ప్రాంతంలోని పెద్దలను ,సూచిస్తుంది. ( అదిష్ఠానం) . ఇక్కడ పూర్వ పుణ్యాధిపతి అయిన శని నిలవడం చేత అదిష్ఠానం జగన్ కి అత్యంత అనుకూలంగా మారుతుంది. అయితే శని మంద గమనుడు కాబట్టి ఈ ఫలితం కాస్త ఆలశ్యంగా జరుగ వచ్చు. ( అంటే ఎనిమిది నెలల్లో కాలేదు కాబట్టి ఎనిమిది సం.లు కూడ కావచ్చు) . దీంతోనే ఇంతటి చిక్కు. కాని శని అనగా సేవకుడని లెక్క. అదిష్ఠానం జగన్ కు సేవ చేసే రోజులు తప్పక వస్తాయి. జాతకమున శనికి శుభ, దుస్థానాధిపత్యాలు రెండూ కలగడం చేత తొలూత శనికి కలిగిన దుస్థానాధిపత్యం వలన ఇప్పటిదాకా కొన్ని అవాంచనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శని కోణ స్థానాధిపతిగా త్వరలో సత్ఫలితాలను ఇవ్వనున్నాడు.అప్ప్డ్ అదిష్ఠానం జగన్ సేవలొ తరిస్తుంది సుమండి.
బుద శుక్రుల కలయక:
ఇది ఈ లగ్నానికి చాలా విశేషం. ఈ లగ్నానికి ఈ రెండు గ్రహాలు కలవడం చాలా రేర్. వీరిరువురు ప్రయాణాలను సూచించే మూడవ స్థానంలో కలవడం, యాత్ర చేసి తీరుతానని జగన్ పట్టు పట్టడం యాధృచికం కాదు. ఎవరో జ్యోతిష్య నిఫుణులు చెప్పి ఉంటారని నా ఉద్దేశం.
కుజుడు రెండున ఉన్నాడని దుష్ఫలితాలను ఏకరవు పెట్టాను. కాని కాస్త సూక్ష్మంగా చూస్తే కుజుని రాశి అయిన వృశ్చికమున శుక్రుడు, శ్రుక్రుని రాశి అయిన తులయందు కుజుడు ఉండుట చేత దీనిని పరివర్తనా యోగమందురు. అంటే ఇరువురు స్వక్షేత్రంలో ఉన్నంత ఫలితాన్ని ఇవ్వగలరని శాస్త్ర్రం
*లగ్నం కన్యా కావటాన్ని గొప్ప మైనస్ పాయింట్ గా పేర్కొన్నాను. ఇది ఒకింత వరకు నిజమే. కాని శతృవులను, వ్యవహారాలను ఎదుర్కోవటం కన్యా లగ్నం వారికి వెన్నతో పెట్టిన విద్యా.
*వ్యయాధిపతి అయిన రవి సుఖ స్థానాన ఉండటాన్ని మైనస్ గా పేర్కొన్నాను. కాని నిజమైన నాయకుడన్న వాడు ఇంటిని అంటి పెట్టుకుని ఉండడు. ఉండ కూడదు. జగన్ సదా సర్వ కాలం ప్రజలనే అంటి పెట్టుకుని ప్రజలతో మమేకం అవుతున్నంత కాలం ఈ దోషం పని చెయ్యదు కాక చెయ్యదు
*చంద్ర కేతు కలయకవలన జరుగవచ్చని చెప్పిన దుష్ఫలితాలు కూడ జరుగవు. ఎందుకంటే జగన్ కుటుంభం క్రైస్త మత సాంప్రదాయాన్ని కూడ పాటిస్తుంది కాబట్ట్టి రాహు కేతువులు ఇతర మతాలకు కారకులు కాబట్టి.. ఈ అంశతోనె గురు రాహు కలయక కూడ జగన్ విషయంలో పనిచెయ్యదు. పైగా చం అంటే మనస్సు, కేతు అంటే విరక్తి. నాన్నను పోగొట్టుకుని, నాన్న ఉన్నప్పుడు బెల్లంలా చూసుకున్న వారంతా అన్నన్నా అల్లం అంటూ పారి పోవటాన్ని చూసి చూసి ఇప్పటికే జగన్ ఒక్క వేదాంత ధోరణికి వచ్చేసారు.కాబట్టి చం కేతు కలయక దోషాన్ని ఇవ్వదు ( ఇవన్ని వై.ఎస్. విషయంలోను పని చేసాయి. నా అనలైజ్ కరెక్ట్ అయ్యిందని గర్వంగా చెప్పుకుంటున్నాను)
ఇక అర్థాష్ఠమ శని అంటారా ? జగన్ ఇంటిని అంటి పట్టుకుని ఉంటేనే ఈ దోషం పని చేస్తుంది. ఇక యాత్ర,యాత్ర, యాత్రేగా . .. ఇంకా స్థానిక ఎన్నికలు ప్రచారాలు.. ఉండనే ఉంటాయి. తల్లికి వైధవ్యంతో ఈ దోషం చాలా వరకు పరిహారమైంది.
దశా భుక్తులు:
09/Jan/2008 = > నుండి 08/Mar/2011 వరకు శని దశలో శుక్ర భుక్తి:
శని.శుక్రుల గురించి ఇప్పటికే చాలా చెప్పెను. జగన్ ఊరికే రాష్థ్రమంతటా పర్యటిస్తుంటే చాలు. ఈ భుక్తి చాలా వరకు ఒర్క్ అవుట్ అవుతుంది
08/Mar/2011 => నుండి 20/Feb/2012 వరకు శనిలో రవి భుక్తి:
ఈ పీరియడ్లో కూడా జగన్ ఇంటికి దూరంగా,తన వారికి దూరంగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ( బహుసా ముఖ్యమంత్రి అయ్యి కుటుంభం కోసం ఎక్కువ సమయం కేటాయించ లేక ఫోతారేమో? అయితే ఒక ఫ్రేక్చర్ జరిగే అవకాశం మాత్రం ఉంది. వై.ఎస్. కూడ సి.ఎం కాక ముందు కాళ్ళు విరక్కొట్టుకున్న సంగతిని గుర్తు తెచ్చుకొండి
17/Mar/2020 వరకు శని దశ, అక్కడనుండి 17/Mar/2037 దాకా బుధ మహాదశ అన్నీ అనుకూలమే. మించి మించి పోతే పండిత పుత్ర పరమ సుంట , వైద్య పుత్ర రోగి అన్న నానుడుకి అనుగునంగా రోగిష్థిగా తయారవుతారేమోగాని దీర్ఘకాలం రాజకీయ రంగాన్ని శాసిస్తుంటారన్నది నిర్వివాదాంశం.
అందుకే మళ్ళీ చెబుతున్నా జగన్ భవిష్యత్ ఏమి భంగారం కాదు. దానికన్నా విలువైన ప్లాటినం ..
No comments:
Post a Comment