Friday, July 9, 2010

ఏ.బి.ఎన్ "మా నాన్న గాంథి " ప్రసారం పచ్చి వ్యభిచారం

ప్రవాస భారతీయులు వై.ఎస్. జన్మ దినోత్స్వం చేసుకుంటామంటే, ఈ నేపథ్యంలో ఒక సందేశం ఇవ్వమంటే  అందుకు జగన్ ఒక వీడియో సందేశం పంపారు.

అందులో ఒక ముక్క చెప్పారు ప్రత్యేకించి సందేశం అంటూ చెప్ప పోతే   ఎంత చెప్పినా తక్కువే అవుతుందని   అన్నారు. పూర్వంలో మహాత్మా గాంథి  తన జీవితమే తన  సందేశం అన్నట్టుగా వై.ఎస్. జీవితమే అతని (వై.ఎస్)  సందేశం అవుతుందన్నారు.

ఇక్కడ పోలికన్న మాటే లేదు. వారి సందేశం ఏది  అన్న ఒక్క ప్రశ్నకు మాత్రమే  ఎవరి జీవితం వారి సందేశం  అనడం జరిగింది. ఇందులో మహాత్మునికి ఎక్కడ అగౌరవం జరిగిందో, అవమానం జరిగిందో తెలీడం లేదు.

ఓకే !  జగన్ తన సందేశంలో వై.ఎస్. మహాత్ముని కోవకు చెందిన వ్యక్తి అన్నారు. సాక్షాత్తు మహాత్ముడు అని చెప్పలేదు.  గాంథి వంటి మహాత్ముడని చెప్పలేదు.  మహాత్ముని కోవకు చెందిన వ్యక్తి అన్నారు.  కోవకు అన్న పదానికి ఏమిటర్థం? కంది పప్పు మానవశరీరానికి  ప్రోటీన్ ను  అందించే ఆహార పదార్థాల కోవకు చెందినది అంటామనుకొండి. మటన్ చికెన్ కూడ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. అంతటి  వైడ్ పాసిబిలిటి ఉన్న పదం "కోవ"

తమిళుడనైన నేను తెలుగువారికి క్లాసు పీకే సాహసం చెయ్యదలచలేదు. కానీ ఏ.బి.ఎన్ వారు ఈ ఒక్క ముక్కను పట్తుకుని ఇంత రాద్దాంతం చెయ్యడం వారికి సాక్షి పత్రిక మరియు సాక్షి టివి ఎంత గట్టి పోటి ఇస్తున్నాయి, వై.ఎస్. బతికుండగా వీరెంతగా ఇబ్బంది పడ్డారు, జగన్ సి.ఎం అయితే వీరికి మరి ఎంతగా ఇబ్బంది కలుగుతుందనే  విషయాలను ప్రేక్షకులకు తెలియ చేస్తుందంతే. ఈ ప్రసారం వారికి కనీశం  వ్యాపారపరంగా కూడ  దాయికం కాదు.  ఈ టపాకు టైటిల్ పెట్టినప్పుడు ఆవేశంగా వ్యభిచారం అని పేర్కొన్నాను గాని కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే ఈ కథన ప్రసారం ఉచిత వ్యభిచారమే అవుతుంది. (వారికి సైతం లాభం చెయ్యదు కాబట్టి)

No comments:

Post a Comment