జగన్ నేతృత్వంలో కొత్తపార్టి ఏర్పాటు కావటం ఖాయమనిపిస్తూంది. ఈ నెల 9 వ తేదినుండి సమైక్యాంథ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా ఇంత వరకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడ రోశయ్య అనర్హుడని చెప్పలేదు. కాని ఈ రోజు సి.కె.ఆద్వర్యంలో పురపాలక చేర్మన్ గా ఉన్న సరళా మాఏరి (ఇది వరకే రాజినామా సమర్పించారు) , చిత్తూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివప్రసాద్ "రోశయ్య అనర్హుడని వెంటనే అతను రాజినామా చెయ్యాలని డిమాండ్ చేసేరు
వై.ఎస్. ప్రియ శిష్యులు చిత్తూరు ఎం.ఎల్ ఏ సి.కె.బాబు కనుసైగలు లేక ఇట్టి స్టేట్మెంట్ భయిటకొచ్చే అవకాశమే లేదు. అలాగే ఇన్ని రోజులు రాజదానికే పరిమితమై ఉన్న సి.కె బాబు ఈ తిరుపతికి చేరుకోవడం నిరాహారా దీక్షలో పాల్గొనడం 24+24 గంటల రాయలసీమ బంధ్కు పిలుపునివ్వడం కూడ కొత్త పార్టి ఆవిర్భావానికి సూచికలే.
నాడు వై.ఎస్. నేడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సి.కె. స్వతాహగా ఈ నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదు.
కడపలో వివేకానంద రెడ్డి దీక్షను బగ్నం చెయ్యడం, పార్లెమెంటులో జగన్ మోహన్ రెడ్డి నమస్కరిస్తే కనీశం ఒక చిరునవ్వన్నా చిందించక సోనియా తల బిరుసుతో వెళ్ళీ పోవడంవంటి సంఘఠనలు ఎన్నో ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్నాయి
అసలు కడప ఎం.ఎల్.ఏ టిక్కెట్ జగనుకు ఇవ్వక పోవడమే అసలైన మనస్పర్దలకు దారి తీసిందనిపిస్తుంది. సతరు బి.ఫామును కె.వి.పి పి.ఏ తీసుకోవడం, వై.ఎస్. సతీమణి పదవీ స్వీకారం చెయ్యక పోవడం, సభకు రాక పోవడం, ఏకగ్రీవ ఎంపికకు సహకరించిన ప్రతి పక్షాలకు కనీశం కృతజ్ఞతలు చెప్పక పోవడం వెనుక కూడ ఎన్నో వ్యూహాలు దాగి ఉన్నాయి.
ఎటు లెక్కించినా జగన్ కొత్త పార్టి పెట్టడం ఖాయమనే చెప్పాలి
congress (YS)
3753253313
సంఖ్యా శాస్త్ర ప్రకారం లెక్కిస్తే ఈ పేరుతో పార్టి పెడితే ( టోటల్ 35 దానిని కూడి సింగిల్ నెంబరు చేస్తే 8 వస్తాయి) కేవలం 8 నెలల శ్రమతో ఈ పార్టి అధికారానికి వచ్చే అవకాశాలున్నాయి.
అయితే ఈ పేరుతో అనే అక్షరాన్ని మాత్రం కలపకూడదు. అలా కలిపితే టోటల్ పది వస్తుంది. చివర సున్న రావడం చేత ఆ పార్టి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై పోయే అవకాశం ఉంది తస్మాన్ జాగ్రత్తా
No comments:
Post a Comment