డా. వై.ఎస్. టి.ఆర్.ఎస్ తో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు గాక. చర్చల ద్వారా కామ ఒపీనియన్ ద్వార తెలంగాన ఇస్తామని ప్రకటించి ఉండవచ్చు గాక. అయినా ఆయన ముమ్మాటికి సమైక్యవాదియే. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ..టి.ఆర్.ఎస్. నేత కే సి ఆర్ తత్వం ఏదో వై.ఎస్.కి బాగా తెలుసు. కేవలం తె.దే.పా హయాంలో మంత్రి పదవి రాని ఏకైక కారణం తో టి.ఆర్.ఎస్ స్థాపించిన నీచ వ్యక్తిత్వం కే.ఎస్.ఆర్ ది.కే.సి.ఆర్ గారికి తెలంగానా తెచ్చుకోవాలన్న కాంక్ష నిజంగానే ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగానా ఇస్తుంది అని కామన్ ప్రోగ్రాం లోనైనా, ఎలక్షన్ మేనిఫెస్టోలనన్నా పెట్టించి ఉంటాడు లేకుంటే పొత్తు పొసగదని భయిటకొచ్చేవాడు. వై.ఎస్. ఆర్ పాలనలో ఆయన వ్యవహార శైలి చూస్తే మనకిట్టే అర్థమవుతుంది. ఆయన వేటినైతే మనస్పూర్తిగా చెప్పాడో వాటిని ఆరు నూరైనా నూరు ఆరైనా ఇచ్చాడు. అమలు చేసాడు. తెలంగాన వాదం తో పబ్బం కడుక్కో చూసిన కే.సి.ఆర్ ని ఎంతగా భలహీన పరచారంటే ఆ పార్టిలో చీలిక వచ్చింది. చీలిక వర్గం కాంగ్రెసుకు బాసటగా ఉంది.మరో పక్క తెలంగానా వాదాన్నే మరుగున పడ వేయడం కోసం జలయజ్ఞంలో తెలంగానకు సింహ భాగమిచ్చారాయన. తెలంగాన కావాలని నువ్వే అడ్డమని వారు గగ్గోలు పెడితే " నేను నిలువు కాదు అడ్డము కాదని" సేటైర్ చేసారు. వై.ఎస్. మనస్తత్వం తెలిసినవారెవరన్నా దీనిని ఇట్టే విశ్లేషించుకోగలరు. వై.ఎస్. సమైక్య వాది కాబట్టే , తెలంగానా అభివృద్దిని ఆత్మ సాక్షిగా ఆకాంక్షించారు కాబట్టే తెలంగాన అభివృద్దికి నడుం కట్టారు. అందుకే తెలంగానా ప్రజలు తమ ప్రాంతములో కాంగ్రెసుకు పట్టం కట్టేరు. తండ్రి భాటలో వై.ఎస్. జగన్ సమైక్య వాదాన్ని భలపరుస్తూనే గోల్డన్ తెలంగానా అంటూ కొత్త వాదాన్ని తెర మీదికి తెచ్చేరు
అందుకే జై అమైక్యాంథ్ర ! జై వై.ఎస్.ఆర్ ! జై జగన్
No comments:
Post a Comment