1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.తెలనాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై ఖర్చులు రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలితే పది సం.లు, జడివానలు మొదలైతే 5 సం.లకు కొన్సాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
No comments:
Post a Comment