Friday, May 28, 2010

సమైఖ్య వాదుల గుండెల్లో జగన్ అరెస్ట్

ఓదార్పు యాత్రకు భయిలు దేరిన జగన్ సమైఖ్య వాదుల గుండెల్లో అరెస్ట్ అయ్యారు. ఆదిష్థానంతో ఇన్నాళ్ళు జరిగిన వ్యవహారంలో జగన్ ప్రదర్శించిన వైఖరిలో నాకు ఏమాత్రం సుముఖత లేదు. నేను ఏనాడో చెప్పాను కలిసొచ్చే  వారు వందో /యాభైయో వెంట తీసుకెళ్ళి గవర్నర్+ స్పీకర్  గారికి లెటర్ ఇస్తే సరిపోయే యవ్వారమిదని. ( ప్రయేక భృందంగా పని చేస్తామని / కాంగ్రెస్ వై.ఎస్ గా)

కాని ఎందుకో జగన్ తటపటాయిస్తూ వచ్చారు. కాని వరంగల్ జిల్లా పర్యటన విషయంలో మాత్రం అచ్చం తన తండ్రిలాంటి మంకుపట్టుతో ముందుకెళ్ళారు. ఎన్.టి.ఆర్ అభిమానిగా నా సెంటిమెంట్ ఏమంటే ఈ రోజు ఎన్.టి.ఆర్ జన్మ దినం. జగన్ ప్రదర్శించిన గుండె నిబ్బరానికి ఎన్.టి.ఆర్ వై.ఎస్ ఆర్ల ఆత్మలు కూడ దోహద పడ్డాయేమో.

ఇంతకీ తెలింగాణా వాదులకు ఒక సలహా మీరు ప్రత్యేక రాష్ఠ్ర్ర్రం కోరుకోవడం వేస్టు. ఎందుకంటే రేపు "గ్రహ పాటునో పొరబాటునో" తెలంగాణా రాష్ఠ్ర్రం వచ్చినా జగన్ ఓదార్పు యాత్ర జరుగుతుంది. అందుకే మీరు ప్రత్యేక దేశం కోరుకొండి.

తెలంగాణా వాదమా తెల్లగడ్డ ఊరగాయా.. ఇదే వై.ఎస్. బతికుంటే టి.ఆర్.ఎస్ మరో నాలుగు ముక్కలయ్యేది. ఇదే జగన్ సి.ఎం అయ్యుంటే ఎనిమిది ముక్కలయ్యేది. తానెంతటి అసమర్థు డో రోశయ్య మరోసారి రుజువు చేసుకున్నారు.

జగన్ అరెస్టుతో తెలంగాణా ప్రాంతం చల్లపడుతుంది కాని సీమాంద్ర ప్రాంతం వేడెక్కదా? ఆత్మ గౌరవం తెలంగాణా వారికే ఉంటుందా? మాకైతే ఉండదా?

ఓదార్పు యాత్ర ఖమ్మం లో సాగగా  లేనిది కేవలం వరంగల్ లో మాత్రం ఇంతటి విధ్వంసం ఎలా సంభవం.
కేంద్ర ,రాష్ఠ్ర్ర ప్రభుత్వాల హిడెన్ అజెండా ఏమిటో సీమాంద్ర నేతలు ఇప్పటికైనా గుర్తించాలి. ఒక్క వై.ఎస్. ఆర్ ఎపిసోడ్ తో సోనియా మేల్కుంది. తెలంగాణవంటి  చిన్న రాష్ట్ర్రం ఏర్పడితే అక్కడ రోశయ్య లాంటి మరో బొమ్మను ఉంచి దిల్లి నుంచి ఆడించుకోవచ్చని, ఆంద్రా ప్రాంతంలో ఎంతటి భలమైన నాయకత్వం వచ్చినా భజనపరులను ప్రోత్సహిస్తూ అనగ త్రొక్కవచ్చని కల కంది. కాని ఇది అసంభవం.

నేనిది వరకే సూచించాను. రాష్ఠ్ర్ర్రం భాగుపడాలంటే నిజమైన నాయకత్వ లక్షణాలు, మానవీయ కోణం గల వై.ఎస్.ఆర్. ఎన్.టి.ఆర్ వారసులు ఏకం కావాలి. దిల్లి గల్లీల్లో అడుక్కు తింటూ రాష్ట్ర్ర ఆత్మగౌరవాన్ని కుప్ప పోసి అమ్మే వెన్నెముకలేని వెదవలను వెలివేయాలి

1 comment: