వై.ఎస్. మరణానంతరం జగన్లోని ఎన్నో లోపాలను నేను చూడ కలిగాను. వాటిని సరి దిద్దుకునేందుకు ఎన్నో సలహాలను నా టపాల ద్వారానే కాకుండా వ్యక్తిగత ఫ్యేక్సు, కొరియర్ ద్వారా కూడ పంపాను. ఆయన వాటిలో కొన్నింటిని పాటించటం కాకతాళీయమే కావచ్చు. అయినా సరే వై.ఎస్.ఆర్లో ఎన్.టి.ఆర్ని చూసుకు(న్న)నే ఎన్.టి.ఆర్ అభిమానిగా మళ్ళీ ఈ టపా వ్రాస్తున్నాను. ( దీని ప్రతిని జగన్ కు కొరియర్ ద్వారా కూడ పంపుతాను.
జగన్ !
కాంగ్రెస్ పార్టి ఆదిష్ఠానం ఉన్నది దిల్లిలో అక్కడ పొద్దు పొడిచేదే పగలు 10 గంటలకు.అక్కడ ఉన్న చలికి ఇక్కడి యువతలోని రక్తపు వేడి సోకాలంటే చాలా కాలం పడుతుంది. వారికి కావల్సింది శక్తి,యుక్తి గల నాయకులు కారు. వారికి కావల్సింది కాళ్ళు మ్రొక్కే భజన పరులు.అందుకే వై.ఎస్. అంతటి వాడు 33వ ఏట పి.సి.సి.అయినప్పటికి సి.ఎం కావటానికి 22 సం.లు వెయిట్ చెయ్యవలసి వచ్చింది. చంద్రబాబు ఇంద్రజాలంతో నేడు గొంతు చించుకుంటున్న ముసలి నక్కలన్ని తోక ముడిచి నోళ్ళు మూత పడిన వేళ, ఇక చేసేది ఏమి లేక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ స్థితి గతులు అధోగతి పాలై పోతున్న వేళ తప్పని సరి పరిస్థితిలో వై.ఎస్. ను సి.ఎం చేసి ఆయనగారికి కొంత మెరకు స్వేచ్చను ఇచ్చారేగాని అది వారి నైజం కానే కాదు. పైగా వై.ఎస్. తనకెంతో ప్రజా బలమున్నా, నాయకత్వ లక్షణాలున్నా కొంత మెరకు భజన కూడ చేయ కలిగారు. అందుకే మనగలిగారు. వై.ఎస్. సి.ఎం అయిన కొత్తలో సెంట్రల్ ఇంటలిజెన్స్ ద్వారా ఒక సర్వే కూడ చెయ్యించారు .ముఖ్యమంత్రిని మారుస్తే ఎలా ఉంటుందని. (ఈ విషయం అప్పటి ఆంద్రప్రభలో కూడ వచ్చింది.) మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుంది. వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలడంతో ఆగే పీచే భంధ్ చేసుకున్నారు)
వై.ఎస్ ప్రదర్శించిన విధేయత కేవలం ఒక షో మాత్రమే ఆయన విధేయుడు కాడని సోనియా మేడంగారికి ఎప్పుడో తెలుసు. పైగా రెండవ విడత జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవడం సోనియా మేడంకు కొంత మనోధైర్యాన్ని కూడ కలిగించినట్టుంది. వై.ఎస్. బతికుంటే వై.ఎస్.ను కూడ రోశయ్య రేంజిలో ట్రీట్ చేసేవారే (అందుకు వై.ఎస్. ఎలా స్పందించేవారు/ఎలా భుద్ది చెప్పేవారన్నది వేరే కథా)
మీ విషయంలో సోనియా మేడం వైఖరేమో అర్థం చేసుకోవడానికి బుర్ర కూడ అవసరం లేదు. కిడ్ని చాలు. కడప పులితోనే ఏగ లేక చచ్చాం. ఇక పులి బిడ్డతో కూడా ఏగాలా అన్న విసుగే ఈ వైఖరికి కారణం. వై.ఎస్. ఎంతటి విధేయత ప్రదర్శించినప్పటికి ఆయన విధేయుడు కాడని/తామే ఆయన గెలిచి పెట్టే ఎం.పి.సీట్లకు గాను విధేయులమని వారికి తెలుసు. వై.ఎస్. వెర్సస్ హై కమాండ్ రిలేషన్ ఎలా ఉండేదో ఒక్క తిరుపతి మెడికల్ కళాశాలకు భూమి కేటాయింపు వ్యవహారమే గీటు రాయి.
ఉత్తుత్తి సుత్తెందుకు సూటిగా చెబుతున్నా:
ఎటూ ఇక ఆదిష్ఠాణంతో తెగదెంపులు జరిగి పోయినట్టే .. ఇప్పటికైనా పార్టిలీ చీలిక తెచ్చి కొత్త పార్టిగా అవతరించండి. రాష్ఠ్ర్రాన్ని మానవీయ కోణంలో పరిపాలించినవారు ఇద్దరే ! ఒకర్ ఎం.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు అన్యాయమే జరిగింది. ఇద్దరు సమైఖ్య వాదులే. కాబట్టి ఎన్.టి.ఆర్ వారసులను కలుపుకెళ్ళే ప్రయత్నం చెయ్యండి .స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి. యువతరానికి మరింత దగ్గర కావడానికి ఫేస్ బుక్ /ట్విటర్ లో ఖాతా తెరవండి. బ్లాగుల్లో మీ గురించి వచ్చే కథనాల పై స్వయంగా స్పందించండి. వై.ఎస్. ఆర్ జీవిత చరిత్రను తెలుగు,ఉర్దూ బాషల్లో వ్రాయించి పది లక్షల ప్రతులన్నా ప్రజలకు అందేలా చూడండి. (సరళమైన భాషలో) వై.ఎస్. ఆర్ జీవితం పై ఒక సి.డి విడుదల చెయ్యండి. డా.రాజశేఖర్ ప్రారంభించిన వై.ఎస్. గురించిన సినిమాలో మీరే టైటిల్ రోల్ పోషించండి. వ్యాపారాలు, బెంగళూర్లకు గుడ్ బై చెప్పండి. మీ పని ఇక్కడే ! మీ శతృత్వమన్నా, మైత్రి భంధమన్నా ఇక్కడి వారితోనే. ఓబుళాపురం మైన్స్ త్రవ్వకంలో సాంకేతిక లోపం కారణంగా కేవలం కొన్ని మీటర్ల విస్తీర్ణంలో జరిగిన తప్పిదానికి జనార్దన్ రెడ్డిని / మీ తండ్రిగారిని ఆడి పోసుకున్న చంద్రబాబే మీ ప్రధాన శతృవు కావాలి. ఇక్కడి భజన పరులలో ఎవ్వడూ మీకు శతృవు కాడు.స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చాటితే ఎగ్గు సిగ్గు లేని ఆదిష్ఠానం మీ పార్టితో సైతం పొత్తుకు సై అంటూ భజన చేస్తుంది. మీ యుద్దం భజన పరుల పై కాక ఆదిష్ఠానం పై ఉండాలి. ఇక్కడి భజనపరులు పాపం ఏదో రోజు మీ గుమ్మం ముందు వచ్చి వాలే వారే. కొత్తా పార్టి పెడితే మొత్తం హై టెక్ పద్దతిలో జరిగేలా చూడండి. పార్టికి వెబ్ సైట్, ఆన్ లైన్ మెంబర్ షిప్, ఆన్ లైన్ చాట్, వారంలో ఒక దినం మీరే ఆన్ లైన్ లో ఉండి కార్యకర్తలతో ఇంటరేక్ట్ అవ్వండి.
ఎలాగూ ఎన్.టి.ఆర్ జన్మ దినోత్సవం నాడు ఎన్.టి.ఆర్ అంతటి/వై.ఎస్. ఆర్ అంతటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించేరు. వై.ఎస్,ఆర్ కు అసమ్మతి రాజకీయాలేమి కొత్త కావు. ఇందిరమ్మ పైకే చెప్పులెయ్యించాడన్న ఖ్యాతి కూడ ఉంది. ఎన్.టి.ఆర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎలాగో తెగించారు. తెగకొట్టుకుని భయిట పడండి. ఇద్దరు మహా నేతలు మిమ్మలి ఆశీర్వదిస్తారు.
No comments:
Post a Comment