Tuesday, December 21, 2010

మీ రాశి పై మీన గురుడి ప్రభావం - 2

5.సింహ రాశి
రాశి చక్రంలో ఐదవ రాశి అయ్యి భుద్ది,పుత్రులు,పేరు ప్రఖ్యాతలకు అత్యంత ప్రాధన్యత ఇచ్చే సింహ రాశి  మితృలారా ! మీకు ఐదు,ఎనిమిది స్థానాధిపతి అయిన గురు ఎనిమిదిన స్వక్షేత్రం పొందడం ఏ  విదంగాను మేలు కాదు. దీంతో పిల్లలకు హాని,పిల్లల వలన ఇబ్బందులు,అధిక ఖర్చులు నెత్తి మీద పడతాయి. చిన్నపాటి గాయాలు,ప్రమాదాలు, అపరాద రుసుము కట్టవలసి వచ్చేది కూడ జరుగవచ్చును. మీరు తేలికగా అనుకుని మొదలు పెట్టిన పనులు మిమ్మల్ని ఖైదిలా మార్చేస్తాయి.   స్యేడుస్టిక్ గా ఆలోచించే అవకాశమూ ఉంది. మీ తెలివి తేటలను నమ్ముకుని ఏది చెయ్యకండి.  గురువారం ఉపావసం ఉండండి.

6.కన్యా రాశి
రాశి చక్రంలో శతౄ,రోగం,రుణాలను సూచించే 6 వ రాశియగు కన్యా రాశి యందు జన్మించిన మిత్రులారా ! దీంతో మీరు పుట్టి పెరుగుతున్న కొద్ది మీ చుట్టు ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా,ఒకరు అప్పుల అప్పారావుగా, ఒకరు కోర్టు కేసులకు తిరిగే వారుగా తయారవుతారు. మీకు నాలుగు,ఏడు భావాలకు అధిపతి అయిన గురుడు ఏడున స్వక్షేత్రం పొందటం మేలే. వివాహితులు భార్య వద్ద తల్లి ప్రేమను పొందే అవకాశం ఉంది అలాగే తల్లి ఒక స్నేహితురాలివలే మీ కష్థ నష్ఠాలను అర్థం చేసుకొని సహాయ పడే అవకాశమూ ఉంది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశమూ ఉంది. అయితే ఒక సం. కాలం ఆవిడ చెయ్యి పై చెయ్యిగా ఉండును. కట్నం కానుక రూపంలో ఒక హవుసింగ్ సైట్/ఇల్లు  లభించ వచ్చు. తల్లి తరపు భంధుత్వంలో అమ్మాయి కుదర వచ్చు.

7.తులా రాశి
రాశి చక్రంలో ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను సూచించే 7వ రాశియగు తులా రాశిలో జన్మించి పై త్లిపిన వారి చే  అత్యధికంగా ప్రభావించ బడే వారు మీరు. మీకు  గతంలో ఐదున ఉన్న గురుడు ఆరో స్థానానికి రావడం ఒక విదంగా మేలు. అతి తక్కువ వడ్డికి పెద్ద మొత్తం అప్పుగా లబించ వచ్చు. అయితే  ఈ గ్రహ స్థితి కడుపు,గుండె సంబంధ రుగ్మత, పెద్దలతో వైరుధ్యాన్ని కూడ ఇవ్వొచ్చు. గురుడికి సోదరాధిపత్యం ఉండుట వలన మీ అతివిశ్వాసంతో విరోధాలు కొని తెచ్చుకోవచ్చు. చివరికి సోదర,సోదరిమణితో సైతం చేదు అనుభవం తప్పదేమో? పైగా ప్రయాణంలో సమస్య, చెవి సంభంధ రుగ్మత కూడ రావచ్చు


8.వృశ్చిక రాశి:
రాశి చక్రంలో ప్రమాదాలు, జైలు పాలు,మానసిక క్షోభలు, నిస్సహాయత,అపఖ్యాతులను సూచించే 8 వ రాశియగు వ్శ్చృవృశ్చిక రాశియందు జన్మించి  సదా  చిక్కుల్లో, అసంతౄప్తిలోనే ఉండే వారు మీరు. గత సం.కాలం నాలుగున ఉన్న గురుడు తల్లి,ఇల్లు,వాహణ సంభంధ సమస్యలను ఇచ్చేడు. ఇటీవల ఇతను ఐదుకు రావడం మేలే. ఈయనకు దనాధిపత్యం కూడ ఉంది కాబట్టి లావాదేవీలు సరళంగా సాగుతాయి. మాటకు విలువ పెరుగును.కుటుంభంలో సౌభాగ్యం ఐక్యత హెచ్చును. పిల్లలు లేని వారికి ఈ ఏడాది ఆడ సంతానం కలిగే అవకాశం ఉంది.

9.దనస్సు:
రాశి చక్రంలో తండ్రి,తండ్రి తరపు భంధువులు,గురువులు, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు, పొదుపు ,ఆస్తులను ,ఆస్తి వివాదాలను సూచించే దనస్సు రాశియందు జన్మించి పై త్లిపిన అంశాలచే సదా సతమతమయ్యే వారు మీరు. లగ్నాధిపతి అయిన గురుడు స్వక్షేత్రం పొందడం మేలే.కాని అది బాలుగున జరగడం వలన పని,పాటా లేక ఇంట కూర్చోవలసి వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. తస్మాన్ జాగ్రత్త . మీలో కొందరికి గవర్నమెంట్ క్వార్టర్స్, ప్రభుత్వ వాహణ యోగం కలుగ వచ్చును. (వాటి వలన కొన్ని చిక్కులు కూడ వస్తాయి). ఏది అమినా భాగా విశ్రాంతి తీసుకునే అవకాశం గలదు.

No comments:

Post a Comment