Saturday, December 18, 2010

మీ రాశి పై మీన గురుడి ప్రభావం

1.మెషం:
రాశి చక్రంలో అంగ బలం, మనోబలం,ఉత్సుకతలను సూచించే మేష రాశియందు జనియించి ఈ సోమరుల ప్రపంచంలో చురుగ్గా పని చేసి మరి చెడ్డ పేరు తెచ్చుకునే మేష రాశి  మిత్రులారా !
 డెసెంబరు 6న  మీ రాశికి లాభస్థానమగు 11నుండి వ్యయస్థానమగు 12నకు రాబోతున్న గురు మీకెలాంటి ఫలితాలను ఇవ్వనున్నాడో చూద్దాం.

గురు మీకు 9,12స్థానాలకు అధిపతి. ఈయన 12వ స్థానమున స్వక్షేత్రం పొందడం ఒక విదంగా మేలే. ఆరింట శని ప్రభావంతో పంతాలు ,పట్టింపులకు పోయి ఎడా పెడా ఖర్చులు పెడుతున్న మీ ఆలోచనల్లో మార్పొచ్చి ఉన్నవంతా ఊడ్చి పెట్టైనా సరే, ఏదైన ఆస్తిని అమ్మైనా సరే  ఒక ఆస్తి కొనాలి, పుణ్య కార్యం చెయ్యాలి,శుభకార్యం చెయ్యాలి, పుణ్య క్షేత్రయానం చెయ్యాలన్న సతుద్దేశం కలుగుతుంది.

2.వృషభ రాశి:
రాశి చక్రంలో దనం, వాక్కు,కుటుంభం నేత్ర స్థానాలను సూచించే సౄషభ రాశియందు పుట్టి వీటికే అత్యంత ప్రాధన్యత ఇస్తూ బ్రతికే వృషభ రాశి మిత్రులారా !
మీకు అష్ఠమ, లాభాధిపతి అయిన గురు లాభంలో స్వక్షేత్రం పొందటం ఒక విదంగా మేలు.మరో విదంగా కీడు. అష్ఠమ స్థానాధిపతి మరణాన్ని ( గండ కాలం కాని వారికి భారి నష్ఠాలు, జైలుపాలు,ఐపి వెయ్యడాన్ని సూచిస్తారు)  సూచించువాడు. ఇతను 11కు వస్తే మీ ఎల్డర్ సిస్టర్,బ్రదర్ కు గండం . భంధు మితృల మరణవార్తలు క్యూ కడతాయి. అయితే ఎల్.ఐ.సి, నష్ఠ పరిహారం,వీలునామా తదితర మరణ సంభంధ ఆదాయాలు పొందవచ్చు.

3.మిథున రాశి
రాశి చక్రంలో సోదరులు,సాహసం,ప్రయాణాలను సూచించే మూడవ రాశియగు మిథున రాశియందు పుట్టి పై విషయాలకే అత్యంత ప్రాధన్యత ఇచ్చే మిథున రాశి  మితృలారా !
7,10 స్థానాలకు అధిపతి అయిన గురుడు పదిన స్వక్షేత్రం పొందడం మంచిది కాదు. దీంతో మీ వృత్తి,వ్యాపారాలు,ఉధ్యోగాల్లో పెను మార్పులే చోటు చేసుకోవచ్చు. కొందరికి ఉధ్యోగ విరమన చెయ్యవలసి కూడ రావచ్చు టేక్ కేర్.  ఫ్రెండ్,లవర్,partner, వైఫ్ వైగారా వారివలన మీ వృత్తి,వ్యాపారాలు,ఉధ్యోగాల్లో కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది.

4.కర్కాటకం
జాతక చక్రంలో తల్లి ఇల్లు,వాహణం,హృదయం ( మమకారాలు) విద్యలను సూచించే కర్కాటక రాశియందు పుట్టి పై విషయాలకే అత్యంత ప్రాధన్యత ఇచ్చే కర్కాటక రాశి  మితృలారా !
మీకు ఆరు ,తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన గురు 9న  స్వక్షేత్రం పొందడం ఒక విదంగా మంచిది కాదు. ఒక విదంగా మంచిది . అవునండి. ఆస్తి మీద.పొదుపు మీద  వివాదం,రుణం తలెత్త వచ్చు. కొందరైతే మాత్రం అప్పు చేసి మరి ఆస్తి కొనడం, తీర్థ యాత్రలు చెయ్యడం చేయవచ్చును. తండ్రి ఆరోగ్యం బెంగ  పెట్టును.దూర దేశ వర్తమానాలు ఆశాజనకంగా ఉన్నప్పటికి ఒకతని వలన ఇబ్బంది పడవలసి రావచ్చు.

No comments:

Post a Comment